తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chatrapathi Bollywood Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ రివీల్ -రాజ‌మౌళి క్రేజ్ బెల్లంకొండ‌కు క‌లిసివ‌స్తుందా?

Chatrapathi Bollywood Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ రివీల్ -రాజ‌మౌళి క్రేజ్ బెల్లంకొండ‌కు క‌లిసివ‌స్తుందా?

27 March 2023, 13:28 IST

  • Chatrapathi Bollywood Remake: ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌తో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఈ రీమేక్ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం అనౌన్స్‌చేశారు. ఈ రీమేక్ ఎప్పుడు ప్రేక్ష‌క‌లు ముందుకు రానుందంటే...

బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్

Chatrapathi Bollywood Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం అనౌన్స్‌చేశారు. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 2005లో రిలీజైన ఛ‌త్ర‌ప‌తి సినిమా బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్ర‌స్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. ఈ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోండ‌గా వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

సోమ‌వారం హిందీ రీమేక్ రిలీజ్ డేట్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. హిందీలోనూ ఈ సినిమాకు ఛ‌త్ర‌ప‌తి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మే 12న ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాగి చెంబు ప‌ట్టుకొని నీళ్ల‌లో నుండి లేచి వ‌స్తోన్న‌ట్లుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ క‌నిపిస్తోన్నారు. అత‌డి ముఖం మాత్రం చూపించ‌లేదు.

ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కోసం ఫిజిక‌ల్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యార‌ని అనిపిస్తోంది. ఈ రీమేక్‌తోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ రీమేక్‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తోన్నారు.

బాలీవుడ్ వెర్ష‌న్ కోసం హిందీ ఛ‌త్ర‌ప‌తిలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ ప‌లు మార్పులు చేసిన‌ట్లు స‌మాచారం. పెన్ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతీలాల్ గ‌డా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ రీమేక్ కోసం గ‌త రెండేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.