Brahmamudi Promo: ఏడుస్తూ రాజ్‌ను బతిమిలాడుకున్న బాబాయ్- పెద్ద షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మీ- ఏంజెల్‌కు వారం టైమ్
11 August 2024, 6:49 IST
Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ తర్వాతి ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది లేటెస్ట్ ప్రోమోల్లో తెలుసుకుందాం.
ఏడుస్తూ రాజ్‌ను బతిమిలాడుకున్న బాబాయ్- పెద్ద షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మీ- ఏంజెల్‌కు వారం టైమ్
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రకాశం ఏడుస్తూ కనిపిస్తాడు. రాజ్‌ను బతిమిలాడుకుంటాడు ప్రకాశం. నాకు కల్యాణ్ ముఖ్యంరా. వాన్ని ఇంటికి తీసుకొద్దాం అని ఏడుస్తూ ప్రకాశం రాజ్‌తో చెబుతాడు. దయచేసి వాడికి నచ్చజెప్పి నువ్వే వాడిని ఇంటికి తీసుకురారా అని బతిమిలాడుకుంటాడు ప్రకాశం.
ఆలోచలన ఒక్కరికైనా ఉందా?
దాంతో రాజ్, కావ్య కూడా బాధపడతారు. తర్వాత ఇంట్లో ధాన్యలక్ష్మీ మరోసారి రచ్చ చేస్తుంది. తన కొడుకు కల్యాణ్ ఇంటి నుంచి వెళ్లిపోయినందుకు బాధపడుతూ అందరిని మాటలు అంటుంది. వాన్ని తీసుకురావాలన్న ఆలోచన ఇంట్లో ఒక్కరికైనా ఉంటే కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
పిన్నీ.. నేను వెళ్లి వాళ్లిద్దరిని ఒప్పించి నేను తీసుకొస్తాను అని రాజ్ హామీ ఇస్తాడు. అయితే, ఇక్కడే ధాన్యలక్ష్మీ పెద్ద షాక్ ఇస్తుంది. ఇద్దరు ఎవరు. నాకున్నది కొడుకు ఒక్కడే. ఇంటికి రావాల్సింది నా కొడుకు ఒక్కడే. మిగతా వాళ్లతో నాకు సంబంధం లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అపర్ణ, రాజ్, కావ్య వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.
నచ్చజెప్పే ప్రయత్నం
కల్యాణ్, అప్పులను ఇంటికి తీసుకు వచ్చేందుకు దుగ్గిరాల ఇంట్లో పెద్ద చర్చే జరిగేలా ఉంది. కల్యాణ్ ఒక్కడే రావాలని ధాన్యలక్ష్మీ అడిగిన దానికి ఎవరు ఒప్పుకునేలా కనిపించట్లేదు. అంతా ధాన్యలక్ష్మీని తప్పు పడతారు. వాళ్లిద్దరు రావడమే కష్టమని, అప్పును వదిలి కల్యాణ్ ఒక్కడు అస్సలు రాడని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి తండ్రి మహేంద్ర అని నిజం తెలుసుకున్న దేవయాని, శైలేంద్ర తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని వసుధారతో చెబుతుంది అనుపమ. అదంతా తన తప్పే అని వసుధార ఫీల్ అవుతుంది. మనుకు తన తండ్రి గురించి చెప్పమని వసుధార చెప్పిన అనుపమ వద్దని అంటుంది.
నా ప్రాణం అడ్డు
తనకు వార్నింగ్ ఇవ్వడంపై రిషిని నిలదీస్తాడు శైలేంద్ర. అలాంటి సమయంలో నీకు కాకుండా వసుధారకు సపోర్ట్ చేస్తేనే తనకు డౌట్ రాదని రిషి కవర్ చేస్తాడు. మీ పని అయ్యాక నన్ను ఏం చేయరని గ్యారెంటీ ఏంటని రిషి అడుగుతాడు. దాంతో కంగుతిన్న శైలేంద్ర.. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని అబద్ధాలు చెబుతాడు.
ఎండీ సీటు అంటే ఎందుకంత ఇష్టమని రిషి అడిగితే.. ఎండీ సీటు చెపాట్టలానేది నా జీవితం ఆశయం, రాజుగా ఉండాలనేది నా కల, కాలేజీలో నా మాటే శాసనంగా మారాలి, రిషి, జగతి, వసుధార ఇలా ఒక్కొక్కరు నా కలకు అడ్డుగా వచ్చారు. ఈ సీటు కోసం నేను ఏమేం చేశానంటే అని నిజాలన్ని చెబుతూ నోరు జారబోయిన శైలేంద్ర ఆగిపోతాడు. తర్వాత కవర్ చేస్తాడు.
వారం రోజుల టైమ్
మరోవైపు మనం కూడా వసుధార, రిషిలా కలిసి ఉందామని, మనిషికి మరో మనిషి తోడు ఉంటే బాగుంటుందని, పెళ్లి చేసుకుందామని మనుతో అంటుంది ఏంజెల్. వారం రోజులు టైమ్ ఇస్తే ఆలోగా సమాధానం చెబుతాను, ఇన్నాళ్ల నా నిరీక్షణకు వారం రోజుల్లో ఫలితం దక్కనుంది, నా ప్రశ్నకు సమాధానం దొరికిన వెంటనే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అంటాడు మను.