Brahmamudi June 12th Episode: బ్రహ్మముడి- కొడుకు చెంపలు వాయించిన ఇందిరాదేవి- సుభాష్ సూసైడ్! కావ్యను నమ్మనన్న అపర్ణ
12 June 2024, 7:51 IST
Brahmamudi Serial June 12th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 12వ తేది ఎపిసోడ్‌లో కొడుకు సుభాష్ చెంపలు వాయిస్తుంది ఇందిరాదేవి. ఎవరు ఆపినా కొడుతుంది. కోడలి పరిస్థితికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది తలుచుకుని సుభాష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ జూన్ 12వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఆ దొంగ మాయ ఎక్కడిపోయింది. దాన్ని పోలీసులకు అప్పజెప్పేదాన్ని అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ పోలీసులకు పట్టించేదాకా అది ఉంటుందా. దాని సంగతి చెబుతామని భయపడే పారిపోయి ఉంటుంది. ఊరి పొలిమేర కూడా దాటేసుంటుంది అని రుద్రాణి అంటుంది.
మాయ వెనుక ఎవరు
పెద్దమ్మకు ఇలా అయ్యేసరికి ఆ మాయను పట్టించుకోలేదు. లేకుంటే తనను, తన వెనుక ఉండి నడిపించినవాళ్లను పోలీసులకు అప్పజెప్పేవాన్ని అని కల్యాణ్ అంటాడు. ఆ మాయ వెనుక ఎవరైనా ఉంటే పట్టించాల్సిందే అని కావ్య అంటుంది. అసలు మన కుటుంబం మీద అంత పగ ఎవరికి ఉందని ధాన్యలక్ష్మీ అంటుంది. వాళ్లు మనకళ్ల ముందే ఉండొచ్చు. నిజం బయట పడేంత వరకు మంచితనం ముసుగులో ఉంటారు అని కావ్య అంటుంది.
నిజమే.. మొన్నటివరకు అన్నయ్య కూడా శ్రీరామచంద్రుడు అనుకున్నాం. కానీ, ఈ వయసులో కూడా బిడ్డను కంటాడని ఊహించామా అని సెటైర్లు వేస్తుంది రుద్రాణి. దాంతో కోపంతో వచ్చిన ఇందిరాదేవి సుభాష్ చెంప పగులకొడుతుంది. అంతా షాక్ అవుతారు. అలా కొడుతూనే ఉంటుంది ఇందిరాదేవి. దాంతో అంతా ఆపుతారు. వీడికి ఈ ఒక్క చెంపదెబ్బ సరిపోదు. వీడు అసలు మనిషేనా.. ఛీ.. దేవతలాంటి భార్యకు ఎలా ద్రోహం చేయాలనిపించిందిరా అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.
ఇంట్లో అడుగుపెట్టవ్
కోడళ్లు, తమ్ముడు, మరదలు, భార్య వీళ్లందరి ముందు నువ్ ఏమవుతావని ఆలోచించావా. ఇది విని నీ భార్య ఎలా ఉంటుందో ఆలోచించావా. ఇన్నాళ్లు నిన్ను ధర్మరాజు లాంటి వాడివనుకున్నాము కదరా. నువ్ చేసిన పనికి మొదటి సారి సిగ్గుపడుతున్నానురా. నా కడుపునా చెడబుట్టావ్ కదరా అని ఇందిరాదేవి ఆగ్రహంతో అంటుంది. శాంతించు అని రాజ్ అంటే.. నువ్ నాతో మాట్లాడకు అని రాజ్‌పై ఫైర్ అవుతుంది.
గొప్ప పని చేశానని అనుకుంటున్నావా. నీ తండ్రి చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ఇంటికి బిడ్డను తీసుకొచ్చావ్. అంటే నీ తండ్రి ఎలాంటి తప్పు చేసిన ఓకేనా. నువ్ తీసుకొచ్చిన రోజు నీ భార్యకు ఇలాంటి పరిస్థితే వస్తే అందరికంటే పెద్ద దోషిగా మిగిలిపోయేవాడివి. నా మనవరాలు ధైర్యం గలది కాబట్టి ఆరోజు తట్టుకుని నిలబడింది. మీరు అసలు మనుషులేనా. తండ్రి తప్పు చేస్తాడట.. కొడుకు ఆ తప్పును సమర్ధిస్తాడట. ఎవరికీ వాళ్లు ఏదో గొప్ప త్యాగం చేసినట్లు చెబుతున్నాడు నీ తండ్రి. ఏంటీ మీరిద్దరు చేసిన త్యాగం అని ఇందిరాదేవి అంటుంది.
ప్రాణాలపైనే ఆశ వదులుకుంది
ఇప్పుడు గానీ, జరగరానిది జరిగి నా కోడలు ఇంటికి తిరిగిరాలేదో.. నువ్ శాశ్వతంగా ఆ ఇంట్లో అడుగుపెట్టవ్. జాగ్రత్త అని ఇందిరాదేవి ఆర్డర్ వేస్తుంది. అమ్మమ్మ అత్తయ్యకు ఏం కాదని కావ్య అంటే.. ఏం కాదేంటే.. నా కోడలి గుండె పగిలింది. మనసు ముక్కలైపోయింది. ఈ దుర్మార్గుడు చేసిన పని తట్టుకోలేక ప్రాణాలపైనే ఆశ వదులుకుంది. ఇంతకంటే ఏం కావాలి. ఎంత పెద్ద సమస్య వచ్చిన నిలబడి మాట్లాడే నా కోడలు ఇవాళ గాలివానకు కూలినట్లు కూలిపోయింది అని ఇందిరాదేవి బాధగా చెబుతూ ఏడుస్తుంది.
అంతా సర్దిచెబుతారు. ఏడుస్తూ కూర్చుంటుంది ఇందిరాదేవి. ఇంతలో వచ్చిన డాక్టర్ ఆమెకు వచ్చింది మైల్డ్ అటాక్ కాదు. మాసీవ్ అటాక్. కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది అని డాక్టర్ చెబుతుంది. ఎంత ఖర్చు అయిన సరే నా కోడలిని బతికించండి. మా ఇంటి మహాలక్ష్మీ తిరిగి మా ఇంటికి రావాలి అని ఇందిరాదేవి అంటుంది. కంగారుపడకండి. ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. బ్రీతింగ్ ఇష్యూ ఉంది. ఆక్సిజన్ పెట్టాం. మీరంతా ఇక్కడ ఎందుకు.. ఒక్కరు ఇద్దరు ఉండండి. మేమున్నాం కదా. అబ్జవర్వేషన్‌లో ఉంచాలి అని డాక్టర్ అంటుంది.
ఏదేదో చేశావ్
దాంతో అందరిని పంపించేస్తాడు రాజ్. కావ్య, రాజ్, సుభాష్ మాత్రమే హాస్పిటల్‌లో ఉంటారు. ఇటు రా అని కావ్యను పక్కకు తీసుకెళ్తాడు రాజ్. ఐసీయూలో ఉన్న అపర్ణను చూసి నిన్ను క్షమించమని అడిగే అర్హత లేదు. నేనే జీవితంగా బతికావ్. అలాంటి నేనే మోసం చేసేసరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావ్. నా మొహం కూడా నీకు చూపించలేను. నన్ను క్షమించు అని బాధపడతాడు సుభాష్. మరోవైపు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా. వద్దని చెబుతున్నా ఏదేదో చేశావ్ అని రాజ్ ఫైర్ అవుతాడు.
చివరికీ దొంగ మాయను తీసుకొచ్చి నా బతుకు ధారపోయాలని చూశావ్. చివరికి మా అమ్మ ప్రాణాలమీదకు తీసుకొచ్చావ్ కదే. నువ్వే.. మొత్తం చేసింది నువ్వే. నేను చెప్పింది జోక్యం చేసుకోకుండా ఇక్కడిదాకా తెచ్చావ్. ఆ బిడ్డ నా బిడ్డ కాదని తెలిసినప్పుడే సైలెంట్‌గా ఉంటే అయిపోయేది కదా. మా అమ్మ మౌనంగా ఉండిపోయేది అని రాజ్ అంటాడు. నేను చెప్పేది వినండి. నేను చేసింది మన కుటుంబ పరువు కాపాడుకోడానికే అని కావ్య అంటుంది.
జీవితంలో మొహం చూడను
నోర్మూయ్.. నోర్మూయ్.. పరువు సంగతి పక్కన పెట్టు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావ్. మా నాన్న ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా. మా నాన్నను మా అమ్మ క్షమిస్తుందా. దొంగ మాయతో పెళ్లికి నో ఆబ్జెక్షన్ లెటర్ రాసిచ్చావ్. టైమ్ ఉంది టైమ్ ఉంది అని ఇంతదూరం తెచ్చావ్. ఒకవేళ మా అమ్మకు ఏమైనా జరిగితే.. జీవితంలో నీ మొహం చూడను. గుర్తు పెట్టుకో అని రాజ్ పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది.
మరోవైపు ఇంట్లో ఇన్నాళ్లు బావగారు తప్పు చేశారనుకున్నాను ఆయన తండ్రి గారే చేశారా. ఛీ ఛీ అసహ్యమేస్తుంది. మనవడిని ఎత్తుకోవాల్సిన వయసులో కొడుకును కంటారా. ఇలాంటి సిగ్గు మాలిన పనులు చేస్తారా. కావ్యను, రాజ్ బావగారిని ఆంటీ తిట్టారు. బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారు. కానీ, ఆయన మాత్రం నోరు మెదపకుండా ఉన్నారు. ఆయనకా ఇన్నాళ్లు విలువ ఇచ్చానని అనిపిస్తుంది. ఛీ ఛీ అది కూడా ఒక బతుకా అని అనామిక అంటుంది.
రోజు రోజుకు దిగజారుతున్నావ్
దాంతో కల్యాణ్ ఫైర్ అవుతాడు. నువ్ అసలు మనిషివేనా. పెద్దమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. నీకు పెద్దనాన్న చేసిన తప్పే గుర్తుకు వస్తుందా. పెళ్లికి ముందు ఇలా లేవు. చాలా మారిపోయావ్. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అసలు నువ్ ఇలాగే ఉండి నా దగ్గర నటించావా అని. మనిషిలా ఒక్కసారి అయినా ఉంటావనుకున్న ప్రతిసారి నన్ను డిసాప్పాయింట్ చేస్తూనే ఉన్నావ్. రోజు రోజుకు దిగజారి పోతున్నావ్. నీతో మాట్లాడాలంటేనే చిరాకు వేస్తుంది. నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశానా అనిపిస్తుంది అని కల్యాణ్ కోపంగా వెళ్లిపోతాడు.
మరోవైపు సుభాష్ తన తల్లి, డాక్ట్ అన్నమాటలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. పక్కన నర్స్ వెళ్తుంటుంది. ఆమె దగ్గర సిజేరియన్ నైఫ్ తీసుకుని చేయి కోసుకుంటాడు. దాంతో నర్స్ అరుస్తుంది. ఇంతలో కావ్య, రాజ్ వచ్చి అడ్డుకుంటారు. అయినా సుభాష్ నన్ను వదలండి.. నేను తలెత్తుకుని బతకలేను. అమ్మ నన్ను నేరస్థుడిలా చూస్తుంది అని మళ్లీ మళ్లీ చేయి కోసుకుంటాడు సుభాష్. మీకేమైనా అయితే అత్తయ్య గారు తట్టుకోలేరు అని కావ్య అంటుంది.
ఇంకోసారి చేయకండి సార్
ఎప్పటికీ మీ అత్తయ్య నన్ను క్షమించదు. రాజ్ నా వల్ల మీరు కూడా బాధ అనుభవించారు. నేను తప్పు చేయకుంటే మీ అమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని అలాగే చేయి కోసుకుంటాడు సుభాష్. డాక్టర్‌ను పిలుస్తాడు రాజ్. సుభాష్‌కు డాక్టర్ కట్టు కడతాడు. పిల్లలకు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా. సూసైడ్ కేసు ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఇలా ఇంకోసారి చేయకండి సార్ అని డాక్టర్ వెళ్లిపోతాడు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇలా చేయడమేంటీ డాడ్ అని రాజ్ అంటాడు. నేను బతకలేకపోతున్నాను. అందరూ నన్ను చులకనగా చూస్తారు. మీ అమ్మకు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణం నేనే కదా అని సుభాష్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
షాకిచ్చిన అపర్ణ
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తే గుండె షెడ్‌కు వెళ్లినట్లే. దాన్ని ఎప్పుడు ఇబ్బందిపెట్టిన ఆ గుండె ఆగిపోతుంది. అలాంటి పరిస్థితులు మనం క్రియేట్ చేస్తే ఆ గుండె ఆగిపోతుంది. అలాగే మా వదినా పైకి వెళ్లిపోతుంది అని రుద్రాణి రాహుల్‌తో అంటుంది. కట్ చేస్తే అపర్ణ చేయి పట్టుకుంటుంది కావ్య. నువ్ నాకు ధైర్యం చెబుతున్నావా అని అపర్ణ అంటుంది. మనింట్లో ఈ విషయంలో మీకు ధైర్యం చెప్పే ఏకైక వ్యక్తిని నేనే అని కావ్య అంటుంది. నువ్ నాకు ఏం చెప్పొద్దు. నేను నమ్మను అని అపర్ణ షాక్ ఇస్తుంది.
టాపిక్