తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 25th Episode: బ్రహ్మముడి- రుద్రాణికి కల్యాణ్ ట్విస్ట్- బయటపడ్డ రాజ్ తమ్ముడి ప్రేమ- గుడిలో అప్పు పెళ్లి

Brahmamudi July 25th Episode: బ్రహ్మముడి- రుద్రాణికి కల్యాణ్ ట్విస్ట్- బయటపడ్డ రాజ్ తమ్ముడి ప్రేమ- గుడిలో అప్పు పెళ్లి

Sanjiv Kumar HT Telugu

25 July 2024, 7:23 IST

google News
  • Brahmamudi Serial July 25th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 25వ తేది ఎపిసోడ్‌లో అప్పుపై కల్యాణ్‌కు ఉన్న ప్రేమను బయటకు తీసుకొస్తాడు రాజ్. అదంతా విన్న రుద్రాణి షాక్ అవుతుంది. మరోవైపు పెళ్లికి అప్పు ఒప్పుకుంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 25వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 25వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ జూలై 25వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పును రెడీ చేస్తారు కావ్య, స్వప్న. అది చూసుకున్న అప్పు ఛీ.. యాక్.. నేనేంటి చీర కట్టుకోవడం ఏంటీ అని అప్పు అంటుంది. పెళ్లి చూపులకు చీరే కట్టుకుంటారు అని కావ్య అంటుంది. అలా అని ఎక్కడైనా రాసి ఉందా. చీరలో నా మొహం బాగుండదు. నీ శ్రీమంతం రోజు చీర కట్టుకుంటే ఎలా నవ్వారో చూశారు కదా అని అప్పు అంటుంది.

బంటి నవ్వుతుంటే

నీ మొహం.. బాగానే ఉంది. కావాలంటే బంటిని అడుగుదాం అని బంటిని పిలుస్తుంది స్వప్న. బంటి వచ్చాకా అప్పు ఎలా ఉందని అడుగుతారు. చుట్టూ చూసి అప్పు ఎక్కడుంది అని అంటాడు బంటి. ఇదేరా అని స్వప్న అంటే.. అది చూసి బంటి పగలబడి నవ్వుతాడు. ఇది అప్పు ఏంటీ అని నవ్వుతూనే ఉంటాడు. దాంతో కోపగించుకున్న అప్పు బంటిని పంపిస్తుంది. వాడు నవ్వుతుంటే నాకు కూడా అనుమానం వస్తుంది కావ్య అని స్వప్న అంటుంది.

అలా అని అమ్మాయిని చూపిస్తామని చెప్పి అబ్బాయిని చూపించలేం కదా అని కావ్య అంటుంది. నేను ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. నచ్చితే నచ్చుతాను లేకుంటే లేదు అని అప్పు అంటుంది. మరోవైపు కల్యాణ్ బాధపడుతూ ఉంటాడు. తన ఆనందం కోసం నెల జీతాన్ని ఖర్చు చేసి తనకు అప్పు జాకెట్ కొనిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు కల్యాణ్. మన అన్నవాళ్ల కోసం ఆమాత్రం చేయలేమా అని అప్పు అంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న కల్యాణ్

హ్యాంగర్‌కు ఉన్న జాకెట్ తీసుకుని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు కల్యాణ్. అది చూసిన రాజ్ అక్కడ అప్పుకు పెళ్లి చూపులు అనగానే ఇక్కడ ఇలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇదే కరెక్ట్ టైమ్. ఎలాగైనా అప్పు మీదున్న ప్రేమను బయటకు తీసుకురావాలని రాజ్ వెళ్లి పలకరిస్తాడు. అడిట్ ఫైల్ గురించి అడిగితే.. కన్నీళ్లు తుడుచుకుంటూ వదినకు ఇచ్చానని కల్యాణ్ చెబుతాడు.

రాజ్ వెళ్లబోతు ఈ పాత జాకెట్‌ను పట్టుకున్నావ్ ఏంటీ. ఇప్పుుడు వేసుకుంటావా ఏంటీ. ఇలాంటి పాతవి వేసుకుని ఇంటి పరువు తీయకురా. నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను కదా. అవి వేసుకో. ఇలాంటి పాతవి మన బెడ్ రూమ్‌లో ఉండకూడదు. డస్ట్‌బిన్‌లో ఉండాలి అని వెళ్లి ఆ జాకెట్‌ను చెత్త డబ్బాలో పడేస్తాడు రాజ్. అన్నయ్య.. అంటూ ఆ జాకెట్‌ను తీసుకుని దుమ్ము దులుపుతాడు కల్యాణ్. ఏంటీ అన్నయ్య ఇలా చేశావ్. ఇది నాకు ఎంతో ఇష్టమో తెలుసా అని ఎమోషనల్‌గా కల్యాణ్ అంటాడు.

నిజం చెప్పురా

కానీ, పాతదైపోయింది కదరా అని రాజ్ అంటాడు. పాతవైపోయినా కొన్ని జ్ఞాపకంగా అలాగే మిగిలిపోతాయ్ అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. ఓ.. అప్పుపై నువ్ పెంచుకున్న ప్రేమలాగానా అని రాజ్ అంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రుద్రాణి ఆ మాటలు విని షాక్ అవుతుంది. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నువ్ ఎందుకో అప్పును ప్రేమిస్తున్నావ్ అనిపిస్తోంది. నిజం చెప్పురా. అప్పును ఇష్టపడుతున్నావా. నీ మనసులో మాటేంటే చెప్పురా. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా. లేదా ప్రేమిస్తున్నా స్నేహం అని భ్రమ పడుతున్నావా అని అడుగుతాడు రాజ్.

తెలీదు అన్నయ్యా. ఈ విషయంలో నేను చిన్నపిల్లాడిలానే ప్రవర్తిస్తున్నాను. ఇందాకా అప్పుకు పెళ్లి చూపులు, తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని చెప్పినప్పుడు నాకు కొద్దిగా భయమేసింది. నా ఫ్రెండ్ సంతోషంగా ఉంటుందంటే నేను సంతోషపడాలి గానీ ఎందుకు భయం వేసింది. తను శాశ్వతంగా దూరమైపోతుందన్న బాధ.. లేక ఇక నాకు తనతో ఉన్న బంధం తెగిపోతుందన్న భయమా. ఏమిటో అన్నయ్య ఏదీ తెలియట్లేదు. కానీ, ఒకటి మాత్రం నిజం అప్పు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని కల్యాణ్ అంటాడు.

గెస్ట్ హౌజ్‌లోనే ఉంటాను

ఒకవేళ అప్పు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందంటే నాకు కావాల్సింది అదే. నా మనసేం బాగోలేదు. నేను గెస్ట్ హౌజ్‌లోనే ఉండాలని అనుకుంటున్నాను. ఇంటికి రాను. అమ్మ అడిగితే చెప్పు అని వెళ్లిపోతాడు కల్యాణ్. అదంతా విన్న రుద్రాణి షాక్ అవుతుంది. ఈ కల్యాణ్ గాడు ఇంతపెద్ద ట్విస్ట్ ఇస్తాడనుకోలేదు. నేను ఏదైతో జరగొద్దని భయపడ్డానో అదే జరిగింది. ఇప్పుడు రాజ్‌ వాళ్లను కలిపేందుకు ట్రై చేస్తాడు. దానికి ముందే నేను చేయాల్సింది చేసి అప్పును ఎప్పటికీ కలవకుండా చేయాలి. వెంటనే ఈ విషయం ధాన్యలక్ష్మీకి చెప్పాలి అని వెళ్తుంది రుద్రాణి.

మరోవైపు అప్పును చూసుకునేందుకు పెళ్లి వాళ్లు వస్తారు. కనకం కంగారు పడితే ఎందుకు పడుతున్నావ్ అని స్వప్న అడుగుతుంది. అనామిక విషయం కావ్య చెబుతానంటుందే. వాళ్లు అర్థం చేసుకోకుంటే ఎలా అని కనకం అంటుంది. ఇప్పుడు చెప్పడమే మంచిది. లేకుంటే అత్తింట్లో మేము పడినట్లు పాట్లు పడాల్సి వస్తుందని స్వప్న అంటుంది. అప్పు ప్యాంట్ షర్ట్‌తో రావడం చూసి వాళ్లు షాక్ అవుతారు. ఏంటే ఇలా వచ్చావని కనకం అడుగుతుంది.

ముందే చెప్పడం మంచిది

నేను ఎలా ఉంటానో అలాగే చూపించాలని అనుకున్నాను. దీనికోసం అందంగా రెడీ కాలేను అని అప్పు అంటుంది. అది విన్న పెళ్లి కొడుకు ఐ లైక్ ఇట్ అంటాడు. ఇది వర్కౌట్ అయ్యేలా ఉందని స్వప్న అంటుంది. ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. మా అబ్బాయి చనిపోతే తనకు షర్ట్ పాయింటి వేసి చూసుకున్నాం. దాంతో తనకు అలాగే అలవాటై పోయిందని కనకం చెబుతుంది. దాంట్లో తప్పేం లేదు. వాళ్లకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే ఉండని అని పెళ్లి కొడుకు అంటాడు.

మేము ఒక విషయం చెప్పాలి శ్రీరామ్ గారు అని కావ్య అంటుంది. తన మీద ఒక నింద పడింది. ముందే చెప్పడం మంచిది అనుకుంటున్నాం అని కావ్య అంటుంది. అనామిక వేసిన కేసు గురించా.. మహిళా మండలి సభ్యురాలు మా బంధువే. పెళ్లి చూపులకు వస్తున్నామని తెలిసి జరిగిందంతా చెప్పింది. ఇందులో అప్పు తప్పేం లేదని, అనామిక నిందలు వేసిందని, ఎవరు ఏం చెప్పిన నమ్మకండని చెప్పింది. అంతేకాకుండా అప్పు ఆత్మ విశ్వాసంతో నిలబడం నాకు నచ్చిందని శ్రీరామ్ అంటాడు.

వాళ్ల ఇష్టమే నా ఇష్టం

మీరు పెళ్లికి ముందే విషయం చెప్పాలనుకోవడం కూడా నచ్చిందని శ్రీరామ్ తల్లి అంటుంది. కనకం చాలా సంతోషిస్తుంది. మీలాంటి సంస్కారం ఉన్న ఇంట్లోకి అప్పును పంపించడం మా అదృష్టం అని కృష్ణమూర్తి అంటే.. అందరూ మీలా ఆలోచిస్తే అమ్మాయిలకు కష్టాలే ఉండవని కావ్య అంటుంది. తను అప్పుకు నచ్చానో లేదో నిర్ణయం తీసుకోమ్మని, కావాలంటే టైమ్ కూడా తీసుకోమ్మని శ్రీరామ్ అంటాడు. ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. మా అమ్మనాన్న ఇష్టమే నా ఇష్టం. మా అక్కలు ఎలా చెబితే అలా వింటాను అని అప్పు చెప్పి వెళ్లిపోతుంది.

దాంతో అంతా సంతోషిస్తారు. తర్వాత కట్నకానుకల గురించి కనకం అడుగుతుంది. మీరు ఏం ఇచ్చుకోలేరని పంతులు గారు చెప్పారని శ్రీరామ్ తల్లి.. మాకు అవేం వద్దని శ్రీరామ్ తండ్రి అంటాడు. నిశ్చితార్థం కూడా ప్రత్యేకంగా కాకుండా పెళ్లిలోనే తాంబులాలు మార్చుకుందామని శ్రీరామ్ చెబుతాడు. దాంతో మీరు మా పరిస్థితులను అర్థం చేసుకోని చెబుతున్నారని కావ్య అంటుంది. నిజంగా మీ అందరికి హ్యాట్సాఫ్ అని స్వప్న అంటుంది.

పూర్తి అండగా ఉంటుంది

మా దుగ్గిరాల కుటుంబం లాగే మీ కుటుంబం అనిపిస్తుంది. మీకు మా కుటుంబం కూడా పూర్తి అండగా ఉంటుంది అని కావ్య చెబుతుంది. తర్వాత వచ్చే శుక్రవారం మంచి ముహుర్తం ఉందంటే ఇంత త్వరగా పెళ్లి అంటే కష్టమని కృష్ణమూర్తి అంటాడు. ఆర్భాటాలకు పోకుండా గుడిలో సింపుల్‌గా పెళ్లి చేద్దామని శ్రీరామ్ తల్లి అంటుంది. దాంతో అంతా సంతోషించి సరేనని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం