తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 19th Episode: దుగ్గిరాల ఇల్లు సీజ్- రాజ్ న్యూ ప్లాన్- ఇందిరాదేవికి గుండెపోటు- కావ్యకు నడమంత్రపు సిరి

Brahmamudi December 19th Episode: దుగ్గిరాల ఇల్లు సీజ్- రాజ్ న్యూ ప్లాన్- ఇందిరాదేవికి గుండెపోటు- కావ్యకు నడమంత్రపు సిరి

Sanjiv Kumar HT Telugu

19 December 2024, 7:36 IST

google News
    • Brahmamudi Serial December 19th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో బ్యాంక్ వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేస్తామని, ఇంటి నుంచి బయటకు వెళ్లమని అంటారు. సీతారామయ్యపై కోర్టులో కేసు వేసి అయినా ఆస్తి దక్కించుకుంటామని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు. దాంతో ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్ వస్తుంది.
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 19వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 19వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 19వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఆస్తిని జప్తు చేస్తామంటూ బ్యాంక్ వాళ్లు వస్తే ధాన్యలక్ష్మీ, రుద్రాణి నానా మాటలు అంటారు. మీ గొడవలు బయట తేల్చుకోండి. వెంటనే ఇల్లు ఖాళీ చేస్తే సీల్ చేస్తామని బ్యాంక్ వాళ్లు అంటారు. చచ్చినా వెళ్లేది లేదు అని రుద్రాణి అంటుంది.

తల వంచాల్సిందే

పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా బయటకు పంపిస్తామని బ్యాంక్ వాళ్లు అంటారు. మేము కోర్టుకు వెళ్తాం. స్టే తెచ్చుకుంటాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంటి పెద్ద మతిస్థిమితం లేక రాసిచ్చాడని రుజువు చేస్తాం. ఆయన తెలివిలేక ఏదో రాసిస్తే మాకేంటీ సంబంధం అని రాహుల్ అంటాడు. ఆయన రాసిచ్చిన పత్రంతో ఎలాంటి సంబంధం లేదని ధాన్యలక్ష్మీ అంటుంది. తాతయ్య మాటకు తలవంచాల్సిందే అని రాజ్ అంటాడు.

మేము తలవంచం. కావాలంటే నువ్వు, మీ నాన్న అమ్మ తలవంచండి. మీ తాతయ్య మాటకు తలవంచితే అడుక్కు తినాలి. మాకేం కర్మ. వారసులుగా మా ఆస్తి రాబట్టుకోడానికి మేము కోర్టుకే వెళ్తాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును, నా చెవిదిద్దులు, కమ్మలు అమ్మేసి అయిన మంచి లాయర్‌ను పెట్టుకుంటాం అని రుద్రాణి అంటుంది. దాంతో ఆపండి అని ఇందిరాదేవి అరుస్తుంది. ఇన్నాళ్లు ఆయన ముందు మాట్లాడటానికే భయపడే మీరు ఇవాళ ఆస్తి పోతుందని ఇన్ని మాటలు అంటారా అని ఇందిరాదేవి అంటుంది.

ఇది ఆయన స్వార్జీతం. తనకే హక్కు ఉంది. ఆయన మాట నిలబెట్టాల్సిందే అని ఇందిరాదేవి అంటే.. కుదరదు. కోర్టుకు వెళ్తామని రుద్రాణి, ధాన్యలక్ష్మీ అంటారు. ఛీ.. మీరు అసలు మనుషులేనా. నా భర్త మీద కేసు వేస్తారా. ఆస్తుల కోసం భాగాల కోసం కోర్టుకు వెళ్తారా. చావు బతుకుల్లో ఉన్న మనిషికి ఈ విషయం తెలిస్తే ప్రాణాలతో ఉంటారా. ఆయన మాట పోయిన క్షణం ప్రాణాలు వదిలేస్తారు. ఆయన లేనప్పుడు ఈ చిట్టీ బతకదు అని గుండె పట్టుకుంది ఇందిరాదేవి.

డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉంటే

ఇంతలో ఒక్కసారిగా రాజ్ నిద్రలో నుంచి లేస్తాడు. ఇదంతా కల అనుకుని నీళ్లు తాగుతాడు. నానమ్మకు ఏం కాలేదు. కానీ, నేను ఆ డబ్బు కట్టకంటే నిజంగానే అదే జరుగుతుంది. ఏం చేయాలి బ్యాంక్ లోన్‌కు వెళ్లడమే మంచిది అని రాజ్ అనుకుంటాడు. ఫోన్ చేసి కొత్తగా మ్యాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టుకోడానికి యూనిట్ పెడుతున్నాం. ఇన్వెస్ట్‌మెంట్ కావాలని రాజ్ అడిగితే.. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్‌గా ఉంటే ఇస్తామని అతను అంటాడు.

తర్వాత ప్రాపర్టీస్ అన్ని మీ పేరు మీదే ఉన్నాయి కదా అని అతను అడిగితే.. కావ్య పేరు మీద ఉన్నాయని రాజ్ చెబుతాడు. అవునా. అయితే మీ ఆవిడ తప్పకుండా రావాలి అని అతను అంటాడు. ఇంత చేసి ఈ కళావతిని సహాయం అడగాలా. అసలు ఒప్పుకుంటుందా అని రాజ్ అంటే.. అస్సలు ఒప్పుకోదు అని రాజ్ అంతరాత్మ వచ్చి అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు. తను ఒప్పుకున్న నేను ఒప్పుకోను. నా ఇగో హర్ట్ అవుతుంది. పెళ్లాం దగ్గర తలొంచే ప్రసక్తే లేదు అని రాజ్ అంతరాత్మ అంటే.. రాజ్ షాక్ అవుతాడు.

నేనే అన్ని మూసుకుని హెల్ప్ అడగడానికి వెళ్తున్నాను. ఇలా అంటావేంటీ. తాతయ్య మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అని రాజ్ అంటాడు. అయినా మనం మగాళ్లం. ఇలా అడిగితే లోకువ అవుతాం. కాళ్లు పట్టుకుని అడుగుతావా అని రాజ్ అంతరాత్మ అంటాడు. అడిగితే కాళ్లు పట్టుకున్నట్లు కాదు. అయినా ఎవరి ఆస్తిరా మా తాతయ్య ఆస్తి. నా పెళ్లాన్ని అడుగుతున్నా అని రాజ్ వెళ్తాడు. ఓరీ నా ఒరిజినల్ ఇదేరా నాకు కావాల్సింది అని రాజ్ అంతరాత్మ అంటాడు.

నడమంత్రపు సిరి

మరోవైపు సీతారామయ్యకు డాక్టర్స్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. కోమాలో ఉన్న వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. మీలాగే మేము ఎదురుచూడాల్సిందే అని కల్యాణ్‌కు డాక్టర్స్ చెబుతారు. నిలువెత్తు మంచితనాన్ని మా నుంచి దూరం చేయొద్దు అని కల్యాణ్ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. మరోవైపు ఉప్పు లేదేంటీ. చప్పిడి కూడు పెడుతున్నావా. నడమంత్రపు సిరి బాగా తలకెక్కినట్లుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరికి నీకా.. మీ పుట్టింట్లో నీకు ఎలాగు గతి లేదుకదా అని ప్రకాశం కౌంటర్ ఇస్తాడు.

నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత మొదట చేసిన పని నా మొగుడుని, నా అత్తను బయటకు గెంటేయాలి కానీ అలా చేయలేదే. సెకండ్ మిమ్మల్ని మీ నోరును అదుపులో ఉంచడానికి పనిమనిషి కంటే హీనంగా చూడాలి కానీ, లేదే అని స్వప్న అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. తలపొగరు తలకెక్కిన చప్పిడి కూడు పెడుతోంది. మమ్మల్ని చంపుతావేంటీ అని రుద్రాణి అంటే.. అవకాశం దొరికింది కదా అని సూటిపోటి మాటలు అంటావు. ఒక్కసారి తక్కువ అయితే సర్దుకోలేవా అని అపర్ణ నిలదీస్తుంది.

ఇప్పుడు తను మహారాణి కదా. మనం ఏమనద్దు. చెలికత్తెల్లా తనకు వింజామరలు ఊపాలి. అంతేనా అని రుద్రాణి అంటే.. బాగా చెప్పావ్. చెలికత్తెల్లారా ఇక తినండి అని ప్రకాశం అంటాడు. అక్కడికి రాజ్ వస్తాడు. నేరుగా సహాయం అడిగితే నెత్తిన ఎక్కి కూర్చుంటుందేమో. నాలుగు మంచి మాటలు మాట్లాడి ఇంప్రెస్ చేయాలి. అప్పుడు దారికొస్తుంది అని వెళ్లి వంటలను మెచ్చుకుంటాడు రాజ్. ఈ వాసనకే ఆకలి పెరిగింది వడ్డించు అని రాజ్ అంటాడు.

ఏ మహత్యం ఉందో?

తినకముందే మెచ్చుకుంటున్నావ్ ఏంట్రా అని ఇందిరాదేవి అడిగితే.. నానమ్మా.. కళావతి వంటకు వంక పెట్టేవాళ్లు ముష్టి ఎత్తుకుని బతకాలి. ఇంటింటికి తిరిగి మాదా కోలం తల్లే అని అడుక్కోవాలి అని రాజ్ అంటాడు. అది ఇన్‌డైరెక్ట్‌గా రుద్రాణి, ధాన్యలక్ష్మీకి తాకుతుంది. విన్నారా అత్తగారు. అడుక్కుతినిపోతారంటా అని స్వప్న పంచ్ ఇస్తుంది. అన్ని సమంగా వేస్తుంది. ఆ చేతిలో ఏ మహత్యం ఉందో అని రాజ్ పొగుడుతాడు. ముందు తిని చూసి చెప్పు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మనకు కళావతి వంట ఏమైనా కొత్త. ముందు వడ్డించు అని రాజ్ అంటాడు. అబ్బా.. ఇవాళే ఉప్పు తక్కువ కావాలా అని లోపల అనుకున్న రాజ్.. పైకి మాత్రం సూపర్.. చెప్పానా వంక పెట్టలేం అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. పోనిలేరా నీకైనా విశ్వాసం ఉంది అని ఇందిరాదేవి అంటుంది. రాజ్ అబద్ధం చెప్పడానికైనా అర్థముండాలి. కూరలన్నీ చప్పగా ఉంటే అలా అంటావేంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అయ్యో అలా అనకూడదు. కూరలన్నీ చాలా బాగా చేశావ్ కావ్య అని రుద్రాణి అంటే.. నువ్వేంటీ సడెన్‌గా మాట మార్చావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇక్కడ జరుగుతున్న డ్రామా నీకు అర్థం కావట్లేదా. నిన్న మొన్నటిదాకా పెళ్లాన్ని వదిలేసి తిరిగిన రాజ్ ఇంత దారుణంగా ఉన్న కూరలను మెచ్చుకుంటున్నాడంటే ఏంటీ అర్థం. ఇప్పుడు యావదాస్తి కావ్య పేరు మీద ఉంది కాబట్టి. ఇంటి తాళాలు కూడా కావ్య చేతిలో ఉన్నాయి కాబట్టి అని రుద్రాణి అంటాడు.

రాబందులను చూల్లేదు

రాజ్ నీలాగే మేము కూడా నటిస్తాములే అని ధాన్యలక్ష్మీ అంటే.. మీ మాటలోనే అడుగులేస్తామని రుద్రాణి అంటుంది. దాంతో ఆపండి. ఆస్తుల కోసం ఒకరికి భజన చేసి బతకాల్సిన అవసరం నాకు లేదు అన తినకుండా రాజ్ వెళ్లిపోతాడు. మీరు తినండి.. కడుపునిండా తినండి. నా భర్తను తినకుండా చేశాకా అయిన మీ కడుపు మంట తగ్గింది కదా. ఛీ.. కనీసం కొంచెం మనుషుల్లా ప్రవర్తించండి. పొద్దున్న లేస్తే ఆస్తి ఆస్తి.. మీలాంటి రాబందులను ఎక్కడ చూడలేదు అని కావ్య వెళ్లిపోతుంది.

మరోవైపు కల్యాణ్‌కు అప్పు కాల్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడుగుతంది. పాట రాస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. ఎస్సై ట్రైనింగ్ గురించి కల్యాణ్ అడిగితే.. అక్కడ కష్టాల గురించి చెబుతుంది అప్పు. నిన్ను అవమానించివాళ్ల ముందు నువ్ తల ఎత్తుకుని తిరగేందుకే ఇంత కష్టపడుతున్నా అని అప్పు అంటుంది. మరోవైపు ఈ మధ్య రాజ్ నీకు దగ్గర అవుతున్నాడు అని అపర్ణ అంటుంది. తర్వాత నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని రాజ్ అంటాడు.

దాంతో కావ్య తెగ పొంగిపోతుంది. సిగ్గుపడుతున్న కావ్య భుజాలపై చేయి వేసు తనవైపుకు తిప్పుకుంటాడు రాజ్. చేతులు పట్టుకుని సహాయం కోరినట్లుగా చూస్తాడు. కానీ, కావ్యకు అది అర్థం కాక ప్రేమ అనుకుని మురిసిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం