Brahmamudi December 5th Episode: కల్యాణ్ నిజం బయటపెట్టిన అనామిక- సీతారామయ్యకు గుండెపోటు- కావ్యకు ప్రతిరోజు పరీక్ష
Brahmamudi Serial December 5th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో కల్యాణ్ ఇంటికి అనామిక వస్తుంది. రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర కల్యాణ్ ఊడిగం చేస్తున్నాడని, రైటర్ కాదని అగ్రిమెంట్ నిజం బయటపెడుతుంది అనామిక. ధాన్యలక్ష్మీ రచ్చతో సీతారామయ్యకు గుండెపోటు వస్తుంది. ప్రాణపాయ స్థితిలో తాతయ్య ఉంటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్ షర్ట్ బటన్స్ పెడుతూ మంచి మంచి పాటలు రాసి దుగ్గిరాల కుటుంబం పరువు నిలబెట్టాలని అప్పు అంటుంది. ఇంతలో అనామిక ఎంట్రీ ఇస్తుంది. నువ్వెళ్లు ఇలాంటి వాళ్ల సంగతి నేను చూసుకుంటాను అని అప్పు అంటుంది.
నమ్మకం ఉండబట్టే
హా వెళ్లు వెళ్లు.. లేట్ అయితే మీ గురువు గారు కోప్పడతారు టీ ఇవ్వలేదని అని అనామిక అంటుంది. దాంతో కల్యాణ్ షాక్ అవుతాడు. ఏంటీ నువ్వనేది అని అప్పు అంటుంది. ఫ్యాక్ట్, ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నాను అని అనామిక అంటుంది. నీకు ఏ పనిపాట లేకుండా మా ఇల్లు వెతుక్కుంటు వచ్చినట్లు ఉంది అని అప్పు అంటుంది. నీకు కల్యాణ్‌పై ఈ తిక్క నమ్మకం ఉండబట్టే ఇలా చేశాడు అని అనామిక అంటుంది.
తిక్క గిక్క అన్నావంటే ఊరుకోను. కల్యాణ్ ఏంటీ నా దగ్గర ఏమైనా దాచావా అని అప్పు అంటుంది. కల్యాణ్ ఏం చెబుతాడు. చెప్పిన తన వెర్షనే చెబుతాడు. ఆరోజు ఆఫ్ట్రాల్ పదివేల చెక్ తీసుకొచ్చి అంత వాగావ్ కదా. అంత లేదు అక్కడ. మీ శ్రీవారు రాసిన పాటకు ప్రేక్షకులు నీరాజనం పడితే వచ్చింది కాదు. టీ, కాఫీలు ఇచ్చి కాళ్లు పడితే వచ్చిన కూలి. మీ శ్రీవారు లిరిక్ రైటర్‌గా కాదు అసిస్టెంట్‌గా చేరారు. అది కూడా మూడేళ్లు ఊడిగం చేస్తానని అగ్రిమెంట్ ఇచ్చాడు అని అనామిక చెబుతుంది.
దాంతో కల్యాణ్ అప్పు ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటీ నిజాలు చెబుతుంటే మీ చెవులకు చిల్లులు పడుతున్నాయా అని కల్యాణ్, మోసం చేసిన నీ శ్రీవారిని చూస్తే కళ్లు బైర్లు గమ్ముతున్నాయా అని అనామిక అంటుంది. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను కోటీశ్వరుడిని చాలా ప్రగల్భాలు పలికాడు. తర్వాత తెలిసింది ఈయనకు అక్కడంత సీన్ లేదు. రాజ్‌దే రాజ్యం. అదృష్టవశాత్తు నేను బయటపడ్డాను. పాపం నువ్వే ఇతని ఉచ్చులో పడ్డావ్. ఇకనుంచి నువ్ బాధపడుతూనే ఉంటావ్. నిన్ను చూసి జాలిపడుతూనే ఉంటాను అని అనామిక అంటుంది.
అసిస్టెంట్‌గా జాబ్
చెప్పాను కదా ఇతను జీవితం రెజెక్ట్ చేసిన ఫెయిల్యూర్ పీస్ అని. ఇంకోసారి ఇలాంటి కూలి చెక్కులు తీసుకొచ్చి టెక్కులు పడకు అని అనామిక వెళ్తుంది. ఏంట్రా ఇది. నిన్ను క్లియర్‌గా అడిగాను. అక్కడ ఊడిగం చేయడం ఏంటీ. ఒకరికి మాట అనాల్సిన అవకాశం ఎందుకు ఇవ్వాలి అని అప్పు అంటుంది. మూడేళ్లు అగ్రిమెంట్ చేస్తేనే లక్ష్మీకాంత్ గారు అసిస్టెంట్‌గా జాబ్ ఇస్తాను అన్నారు. నా సక్సెస్ చూడాలనుకున్నా నీకు మూడేళ్లు పడుతుంటే అప్సట్ అవుతావని చెప్పలేదు అని కల్యాణ్ అంటాడు.
అలా అని నువ్ కష్టం పడుతూ నాతో సంతోషాన్ని పంచుకుంటున్నావా. ఇంకోసారి ఇలా నిజం దాచవు కదా అని అప్పు అంటుంది. లేదు. సారీ పొట్టి అని కల్యాణ్ అంటే అప్పు హగ్ చేసుకుని ఐ లవ్యూ అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే రుద్రాణి వచ్చి చిచ్చు పెడుతుంది. కావ్య ఇంటికి వెళ్లిన ముసలోళ్లు కచ్చితంగా తీసుకొస్తారు. ఇప్పుడైనా తేల్చుకో. వాళ్లు కావ్యను తీసుకొచ్చేలోపే ఏదైనా చేయు అని రుద్రాణి అంటుంది. అవును ఏదోటి చేయాలి. కానీ, ఏం చేయాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది.
దాంతో చచ్చిపో అని రుద్రాణి అంటుంది. దానకి కోపంగా లేచి ఏంటీ అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. అవును.. చచ్చిపో అంటున్నాను అంతే సీరియస్‌గా అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య, అపర్ణతో సీతారామయ్య వాళ్లు వస్తారు. కావ్య, అపర్ణ గుమ్మంలోకి అడుగుపెడతారు. ఇంతలో ధాన్యలక్ష్మీ ఉరేసుకుంటూ కనిపిస్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. అందరూ వస్తారు. ప్రకాశం వచ్చి ఏంటే ఇది అని అడుగుతాడు.
న్యాయం చేయరు
నేను మిమ్మల్ని చేసుకున్నందుకు, ఈ ఇంటికి కోడలు అయినందుకు నాకు నేను వేసుకున్న శిక్ష అని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ ధాన్యలక్ష్మీ. ఏం కావాలి అని రుద్రాణి అడుగుతుంది. నాకు న్యాయం కావాలి. నా ఇంటి వారసుడు అయిన కల్యాణ్‌కు అన్యాయం జరిగింది. ఈ ఇంటి పెద్దవాళ్లు ఎప్పటికీ వాడికి న్యాయం చేయరు. నేను చస్తే అయినా వీళ్లు మనసు మార్చుకుంటారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ధాన్యలక్ష్మీని ఆపి కిందకు దించుతారు. ధాన్యలక్ష్మీని అపర్ణ ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది. అక్కా అని ధాన్యలక్ష్మీ అరిస్తే.. నీ కొడుక్కి ఎవరు అన్యాయం చేశారు. నీ కొడుకు కాపురం ముక్కలు కావడానికి కారణం నువ్వు, వాడు బయటకు వెళ్లాడనికి కారణం నువ్వు, ఇంత ఆస్తిని పూచికపుల్లల చూడటానికి కారణం నువ్వు అని అపర్ణ అంటుంది. అవును, నువ్ నీ కోడలిని కోడలిగా ఒప్పుకుంటే వాడెందుకు బయటకు వెళ్తాడు. నీ దగ్గర తప్పు పెట్టుకుని చచ్చి ఏం సాధిస్తావ్ అని ఇందిరాదేవి అంటుంది.
మీరు ఇలాగే నా నోరు మూయిస్తారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీరు రాజ్‌కు పట్టం కడతారు. పుట్టింటికి వెళ్లిన కావ్యను తీసుకొచ్చి సీఈఓగా చేస్తారు. ఏం చేయలేక చచ్చిపోదామనుకుంటే చెంప పగులగొడతారు, నోరు మూయిస్తారు అని రుద్రాణి అంటుంది. ఇంకో మాట మాట్లాడితే ఇదే ఉరి నీకు వేసి చంపేస్తాను. మేము వచ్చేలోపు ధాన్యలక్ష్మీ ఎంత ఎక్కించావో ఊహించగలం అని అపర్ణ అంటుంది.
ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నువ్వే మూలకారణం అని తెలిసినా నిన్ను బయటకు గెంటేయంది ఆడ పడుచువి అని కాదు. నమ్మకంగా పని చేసిన మీ నాన్నకు మావయ్య గారు ఇచ్చిన చివరి మాట ఎక్కడ పోతుందో అని. నీ దరిద్రపుగొట్టు సలహాలు విని నిజంగానే ధాన్యలక్ష్మీ ప్రాణాలు తీసుకుంటే అని అపర్ణ అంటుంది. నీకు ఎలాగు సొంత తెలివితేటలు లేవు. ఎవరిని బెదిరించడానికి చస్తానని బెదిరింపులు. అందరం వచ్చేదాకి ఆగి చావాలని చూశావ్. ఇదంతా డ్రామా కాదా అని ప్రకాశం ఫైర్ అవుతాడు.
పక్షపాతం చూపించి
మీరు సరిగ్గా ఉంటే నా కొడుకు ఆటో ఎందుకు నడుపుతాడు. ఇంట్లో ఎప్పుడు పక్షపాతమే చూపించారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. నోర్మూయ్. పక్షపాతం చూపించి ఎవరికి దోచిపెట్టాం. కావ్యను సీఈఓ చేసింది రాజ్‌కు బుద్ధి చెప్పడానికి అంతేకానీ ఆస్తి ఇవ్వడానికి కాదు. తప్పు నీ దగ్గర పెట్టుకుని అందరిని అంటావేంటీ. నువ్వేం చేశావ్ నీ కొడుక్కి. ఇష్టపడి తీసుకొచ్చిన అమ్మాయని కోడలిగా చూశావా. ముందు అప్పును కోడలిగా చూడు. నీ కొడుకు ఇంటికి వస్తాడు అని అపర్ణ అంటుంది.
రుద్రాణి మాటలు విని మొండిగా మాట్లాడుతున్నావ్. రాజ్‌కు ఎంత హక్కుందో కల్యాణ్‌కు ఉంది. వాడి నిర్ణయాన్ని మార్చలేకేగా సైలెంట్‌గా ఉన్నాం అని సుభాష్ అంటాడు. కల్యాణ్‌కు ఎప్పటికీ అన్యాయం జరగదు. వాడే గెలవలాని పోరాడుతున్నాడు. గెలవని. వాడి ఆస్తి ఎక్కడికి పోదు. ఆస్తి ముక్కలు చేయడం ఎంతసేపు. చేస్తే ఎవరికి వారు అయిపోతారని ఆలోచిస్తున్నాం అని ఇందిరాదేవి అంటుంది. దాంతో చాలు.. అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఇల్లు ముక్కలవుతుందని చెప్పి ఈ ఇంటి వారసుడుని దూరం పెట్టి మీరంత ఒక్కటై నన్ను ఒక్కదాన్నే దూరం పెడుతున్నారని అర్థమైంది. ఇక్కడిదాకా వచ్చాకా నేను ఊరుకోను. ఇప్పుడు నేను కొంగుచాచి అర్జంచను. నేను డిమాండ్ చేస్తున్నాను. మర్యాదగా నా కొడుకు సగభాగం రాసి ఇస్తారా లేదా. ఒకవేళ ఇప్పుడు గానీ నిర్ణయం తీసుకోకుంటే నేను కచ్చితంగా ప్రాణం తీసుకుంటాను. ఈ ఇంట్లో అందరూ బాధ్యులు కావాల్సి వస్తుంది అని ఉరేసుకోడానికి స్టూల్ ఎక్కుతుంది ధాన్యలక్ష్మీ.
సీతారామయ్యకు గుండెపోటు
అంతా దాన్ని ఆపేందుకు ట్రై చేస్తుంటారు. అక్కడ జరిగేదంతా చూసిన బాధపడిన సీతారామయ్య గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. సీతారామయ్య కర్ర కిందపడేయడంతో ఆ సౌండ్ విని ఇందిరాదేవి చూస్తుంది. అంతా సీతారామయ్య దగ్గరికి వెళ్తారు. ఇలా జరిగిదేంటీ అని రుద్రాణి తల పట్టుకుంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఐసీయూ వద్ద ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటే కావ్య ఓదారుస్తుంది.
ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా. నీ అహంభావం తగ్గిందా. ఇన్నాళ్లు అంతా నావాళ్లు అని ఆయన ఎంత తాపత్రయపడ్డారో. కుటుంబం అంతా కలిసి ఉండాలని, ఉమ్మడి ఆస్తిగా ఉండి విడిపోయి ఒకరు దుబారా ఖర్చు చేసి, మరొకరు బాగుండటం చూడలేక ఆయన కలిసి ఉండాలని చూశారు అని ఇందిరాదేవి ధాన్యలక్ష్మీతో అంటుంది. రుద్రాణి వంటి విషపురుగు మాట విని ఇంటి పెద్ద మనిషి ఛిద్రమైపోయేలా చేశావ్. చెట్టంత మనిషి కుప్పకూలిపోయేలా చేశావ్. ఏం సాధించావ్ అని ఇందిరాదేవి అంటుంది.
కావ్యకు పరీక్ష
ధాన్యలక్ష్మీ చేసిందాంట్లో ఏం తప్పుంది. తను అడిగిన ఆస్తి రాసి ఇస్తే అయిపోయేది కదా అని రుద్రాణి అంటుంది. నువ్ ఒక్క మాట మాట్లాడితే చంపేస్తాను అని అపర్ణ అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కావ్య ఎవరు, నీతో మాట్లాడతానని అంటున్నారని చెబుతాడు. దాంతో కావ్య లోపలికి వెళ్తుంది. ఇకనుంచి నీకు ప్రతిరోజు ఒక పరీక్షలాగే ఉండొచ్చు, రాజ్ దురుసుగా ప్రవరిస్తాడు. నీ ఓర్పుతో అన్ని చక్కబెడతానని, అలిగి ఇల్లు వదిలిపోనని నాకు మాట ఇవ్వమ్మా అని సీతారామయ్య అంటాడు. అది రాజ్ చూస్తాడు. ఇక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్