తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 13th Episode: బ్రహ్మముడి- ఇంటి గడప దాటిన కావ్య- రాజ్ రెండో భార్య వెన్నెల ఎంట్రీ- రుద్రాణి ప్లాన్ ఫెయిల్

Brahmamudi April 13th Episode: బ్రహ్మముడి- ఇంటి గడప దాటిన కావ్య- రాజ్ రెండో భార్య వెన్నెల ఎంట్రీ- రుద్రాణి ప్లాన్ ఫెయిల్

Sanjiv Kumar HT Telugu

13 April 2024, 7:28 IST

  • Brahmamudi Serial April 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 13వ తేది ఎపిసోడ్‌లో స్కూల్ రీయూనియన్‌కు రావాలని కావ్యను చాలా బతిమిలాడుతాడు రాజ్. దాంతో కావ్య ఒప్పుకుంటుది. మరోవైపు స్వప్నపై వేసిన రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 13వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 13వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 13వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యను ధాన్యలక్ష్మీ, రుద్రాణి మాటలు అంటుంటే రాజ్ అడ్డుకుంటాడు. మీరు ఇంటి పరువు తీద్దామనుకున్నారు. కానీ కళావతి అబద్ధం చెప్పి ఇంటి పరువు పోకుండా చూసింది. ఇంట్లో జరిగింది చెప్పి పరువు తీద్దామనుకున్న నువ్ తప్పు పడుతున్నావా అత్త. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది అని రాజ్ అంటాడు.

ట్రెండింగ్ వార్తలు

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

సపోర్ట్ చేయడం వల్లే

కళావతి ఆస్తికోసం ఇక్కడ ఉండట్లేదని నా మనసుకు తెలుసు. తనకు ఆస్తి కావాలంటే స్వప్నకు ఆస్తి రాసిచ్చినట్లు కావ్య ఒక్క మాట అడిగితే ఈ ఇల్లే రాసిస్తాడు. అప్పుడు నువ్ నాలాగే ఇంట్లో అతిథిలాగా ఉండాల్సి వస్తుంది పిన్ని అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. దాంతో ఇద్దరూ సైలెంట్ అవుతారు. కాకపోతే ఇదంతా నీవల్లే.. నువ్ రాజ్‌కు సపోర్ట్ చేయడం వల్లే వాడు ఏ నిజం చెప్పట్లేదు అని మళ్లీ కావ్యను అంటుంది అపర్ణ.

నిజం ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది కదా. ఆ నిజాన్ని త్వరలోనే అందరూ తెలుసుకుంటారు అని కావ్య అంటుంది. మరోవైపు తల్లికి ఆర్డర్స్ వేస్తూ టిఫిన్ తింటుంది అప్పు. ఇంతలో కృష్ణమూర్తి వచ్చి ఏదో లెటర్ వచ్చిందని చెబుతాడు. పోలీస్ సెలక్షన్‌కు సంబంధించింది అయి ఉంటుందని అప్పు సంతోషపడుతుంది. కానీ, లెటర్ ఓపెన్ చేసి చూసిన అప్పు మొహం వాడిపోతుంది. ఏమైందని తల్లిదండ్రులు అడిగితే తాను సెలెక్ట్ కాలేదని బాధగా చెబుతుంది అప్పు.

నా వల్లే కష్టం

చాలా కష్టపడ్డావ్ కదే అని కనకం అంటే.. మన తలరాత అలా ఉంటే ఏం చేస్తాం అని వెళ్లిపోతుంది అప్పు. నా కూతురికి ఆ దేవుడు చాలా అన్యాయం చేస్తున్నాడు. చదువు దూరం చేశాడు. ప్రేమించివాన్ని దూరం చేశాడు. ఇప్పుడు ఇది. ప్రేమ నుంచి బయటపడుతుంది అనుకుని పోలీస్ అవుదామనుకుంటే అది కాకుండా చేశాడు. ఇదంతా అది నాకు కూతురిగా పుట్టడం వల్లే. నా ఇద్దరు కూతుళ్లు నాకు దూరంగా ఉన్నాకే సంతోషంగా ఉన్నారు అని కనకం అంటుంది.

ఇది ఇంకా ఇక్కడే ఉంది కాబట్టి బాధలు పడుతుంది. పెళ్లి చేసుకోమ్మంటే చేసుకోదు అని కనకం బాధగా అంటుంది. నువ్వే బాధపడితే తనను ఎవరు ఓదార్చుతారు అని కృష్ణమూర్తి నచ్చజెప్పుతాడు. మరోవైపు కావ్య పని చేసుకుంటే రాజ్ వచ్చి మొహమాటపడుతుంటాడు. ఏం చేస్తున్నావ్ అని రాజ్ అడిగితే.. కావ్య పంచ్‌లు వేస్తుంది. ఇది ఫన్నీగా ఉంటుంది. రీ యూనియన్ గురించి చెప్పడం గురించి మొహమాట పడుతున్నట్లు ఉన్నారు. దొరికారు అనుకుంటుంది కావ్య.

బతిమిలాడిన రాజ్

ఏదో అడగడానికి వచ్చినట్లు ఉన్నారు అని కావ్య అంటే.. రాజ్ ఏం లేదని అంటాడు. ఇంతలో కావ్యకు శ్వేత కాల్ చేస్తుంది. అది తెలిసి రాజ్ సంతోషిస్తాడు. తన పని శ్వేత చేస్తున్నందుకు సంతోషిస్తాడు. కానీ, కావ్య కావాలనే డ్రామా చేస్తుంది. తాను రీయూనియన్‌కు రానని గట్టిగా అంటుంది. తెగెదాకా లాగొద్దని శ్వేత చెబుతుంది. నేను రాను అని తేల్చి చెప్పి కాల్ కట్ చేస్తుంది కావ్య. అందరూ భార్యలతో వస్తున్నారు. నాతో నువ్ కూడా రా అని రాజ్ అంటాడు.

నేను ఎలా రావాలి. రెండో భార్యగా రావాలా. సవతి తల్లిగా రావాలా. పిచ్చిదానిలా, వెర్రిదానిలా ఎలా రావాలి. ఇందాకా ఎంత గొడవ అయిందో చూశారు. కదా. నేను వస్తే మళ్లీ నన్ను ఎన్ని మాటలు అంటారో తెలుసా. కన్నది మీరు అనేది నన్నా అని కావ్య డైలాగ్‌లు కొడుతుంది. దాంతో చేతులు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఇది రిక్వెస్ట్. నువ్ రాకుంటే ఫోన్‌లా మీద ఫోన్‌లు వస్తాయి. రా తల్లి అని రాజ్ బతిమిలాడుతాడు. అయినా బెట్టు చేస్తుంది కావ్య.

కలుసుకున్న కల్యాణ్ అప్పు

కానీ, రాజ్ మాత్రం ఇంత డ్రామా వద్దు.. రా ప్లీజ్ అని అడుక్కున్నంతపని చేస్తాడు. తర్వాత వస్తానని కావ్య చెబితే.. థ్యాంక్యూ థ్యాంక్యూ అని హమ్మయ్యా అని అనుకుంటాడు రాజ్. మరోవైపు కల్యాణ్, అప్పు కలుసుకుంటారు. తను సెలెక్ట్ కాకపోవడంపై కల్యాణ్ ఫీల్ అవుతాడు. అప్పును పెళ్లి చేసుకోమని చెబుతాడు. దానికి కోప్పడుతుంది అప్పు. తాను కూడా ఇష్టం లేని పని చేయడం కష్టంగా ఉందంటాడు. అయితే ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామని అని అప్పు అంటుంది.

మా అన్నయ్య అన్ని సమస్యలు పూర్తి చేసుకుని రాకుంటే ఆ నదిలో పడిపోయి కొట్టుకుపోయేలా ఉన్నాను అని కల్యాణ్ అంటాడు. నెక్ట్స్ ఏంటీ, ఏం చేద్దామనుకుంటాన్నావ్ అని అప్పుని అడిగితే.. పోలీస్ అవుతానని చాలా ఆశలు పెట్టుకున్నాను. ఫెయిల్ అయ్యాకా ఏ ఆలోచన రావట్లేదని బదులిస్తుంది. ఆలోచనలు ఆగిపోవద్దని కల్యాణ్ అంటే.. ఆటో వెనుక రాసుకో అని వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు జ్యూస్‌లో మత్తుమందు కలుపుతుంది రుద్రాణి.

నాకంటే ముదురు

ఇది తాగి అది పడుకుంటే వేలు ముద్రలు తీసుకుని ఆ ఆస్తిపై అప్పు తెచ్చుకుంటాను అని రుద్రాణి అనుకుంటుంది. మరోపక్క బిర్యాని ఎక్కువగా తిన్నానని, వికారంగా ఉందని అవస్థ పడుతుంటుంది. జ్యూస్ తాగమని ప్రేమగా మాట్లాడుతుంది రుద్రాణి. ఏంటీ ఇంత ప్రేమ చూపిస్తున్నావ్. బిడ్డపైనా లేకుంటే నా వెనుక ఉన్న ఆస్తిపైనా అని స్వప్న అనుమానిస్తుంది. దొంగమొహంది.. నాకంటే ముదురు కనిపెట్టేసింది అని రుద్రాణి అనుకుంటుంది

రుద్రాణి ఎంత అడిగినా జ్యూస్ తాగదు. బయటకు పంపించేస్తుంది. దాంతో రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంత సడెన్‌గా ప్రేమ పుట్టికొచ్చిందేంటి.. దీంతో ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలని స్వప్న అనుకుంటుంది. మరోవైపు కృష్ణుడికి మొరపెట్టుకుంటుంది కావ్య. నువ్ నా భర్త ఇద్దరు మగాళ్లే కదా. ఇద్దరూ సమాధానం చెప్పరు. అందుకే నా ఉనికి కోసం నేనే పోరాటం చేస్తున్నాను. ఆయన నిజంగానే ఆ బిడ్డను కన్నారో. లేకుంటే నన్ను వదులుకోడానికి అబద్ధం చెబుతున్నారో తెలియదు అని కావ్య అంటుంది.

ఇంటి గడపదాటుతున్నాను

కావ్య మాటలు ఇందిరాదేవి వింటూ ఉంటుంది. ఆయన అన్నట్లు నిజంగానే వెన్నెల అనే అమ్మాయి ఆయన జీవితంలో ఉండి ఆ బిడ్డకు తండ్రి ఆయనే అని తెలిస్తే మాత్రం నేను ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే. నువ్ నోరు తెరిచి మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ, మా ఇద్దరికి వేసిన బ్రహ్మముడికి సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది. మేమిద్దరం జీవితాంతం ఉండాల వద్దా. నేను తిరిగి ఇంటికి రావాల వద్ద అనేది నీ చేతుల్లోనే ఉంది అని కావ్య అంటుంది.

నిన్ను నమ్మి ఇంటి గడపదాటుతున్నాను. ఒడ్డున చేరుస్తావో. నట్టేట ముంచుతావో నీ ఇష్టం. ఇప్పుడు నేను చేస్తున్న యుద్ధం ఓ నిజం కోసం. దానికి నీ సాయం వద్దు. న్యాయం చేయి చాలు అని కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది కావ్య. అది చూసి బాధపడుతుంది ఇందిరాదేవి. ఇంతటితో బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో స్కూల్ రీయూనియన్‌లో వెన్నెల కోసం ఎదురుచూస్తుంటుంది కావ్య. మరోవైపు కారులో ఫోన్ మాట్లాడుతూ వెన్నెల వస్తుంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం