Brahmamudi November 9th Episode: దుగ్గిరాల ఆస్తి ముక్కలు - చచ్చేదాకా ఇంటి గడప తొక్కనన్న కళ్యాణ్ - రుద్రాణి చిచ్చు
09 November 2024, 8:22 IST
Brahmamudi November 9th Episode: బ్రహ్మముడి నవంబర్ 9 ఎపిసోడ్‌లో బతుకుతెరువు కోసం కళ్యాణ్ ఆటోనడుపుతోన్న వీడియోను చూపించి దుగ్గిరాల ఇంట్లో గొడవలు సృష్టిస్తుంది రుద్రాణి. అప్పు వల్లే తన కొడుకు కష్టాలు పడుతున్నావని ధాన్యలక్ష్మి రచ్చచేస్తుంది.
బ్రహ్మముడి నవంబర్ 9 ఎపిసోడ్
Brahmamudi November 9th Episode: బొద్దింకను చూసి భయపడిన రాజ్ వీడియోను చూపించి అతడిని బ్లాక్‌మెయిల్ చేస్తుంది కావ్య. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తుంది. నా మెడలో హారం వేస్తే వదిలేస్తానని, లేదంటే వీడియోను వైరల్ చేస్తానని రాజ్‌తో అంటుంది కావ్య. కళావతి అన్నంత పని చేస్తుందని రాజ్ వణికిపోతాడు.
రుద్రాణి పంచ్‌లు...
రాజ్‌తో సీక్రెట్‌గా మాట్లాడాలని పక్కకు వెళ్లిన కావ్య ఒంటరిగా రావడం చూసి రుద్రాణి సెటర్లు వేస్తుంది. ఏదో సాధించాలని రాజ్ చేతి పట్టుకొని వెళ్లావు. ఇప్పుడు అందరి ముందు పరువు పోతుందని సెలైంట్ అయ్యావు. నీ మెడలో హారం వేయడానికి రాజ్ ఒప్పుకోలేదా అంటూ డైలాగ్‌లు కొడుతుంది.
వణికిపోయిన రాజ్...
అమాయకురాలిలా నటిస్తోన్న కావ్యను చూసి రాజ్ వణికిపోతుంటాడు. నాకు బొద్దింక కంటే కావ్యను చూస్తేనే భయమేస్తుందని మనసులో అనుకుంటాడు. కావ్య నన్ను పక్కకు తీసుకెళ్లి బతిమిలాడిందని, నాలో మానవత్వం పాళ్లు ఎక్కువే కాబట్టి హారం వేయడానికి ఒప్పుకున్నానని అంటాడు.
రాజ్‌కు జ్ఞానోదయం...
పక్కకు తీసుకెళ్లి రాజ్‌కు బాగానే జ్ఞానోదయం కలిగించావు...అంతగా ఏం చెప్పావని కావ్యను అడుగుతుంది అపర్ణ. కావ్య సమాధానం చెప్పకుండా రాజ్ అడ్డుకుంటాడు. హారం తీసుకొని కావ్య మెడలో వేస్తాడు. కావ్య ఆనందపడుతుంది. ఆ సీన్ చూసి అపర్ణ, ఇందిరాదేవి కూడా సంబరపడతారు. కళ్యాణ్ మెడలో అప్పు...స్వప్న మెడలో రాహుల్ హారం వేస్తారు.
కళ్యాణ్‌కు గిఫ్ట్...
కల్యాణ్‌కు పెన్ను గిఫ్ట్‌గా ఇస్తుంది కావ్య. మీ ఫేవరేట్ రైటర్ పెన్నుఅని, వేలం పాటలో నీకు గిఫ్ట్ ఇవ్వాలనే కొన్నానని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. వదిన మాటలు వినగానే కళ్యాణ్ సంబరపడిపోతాడు. కళ్యాణ్ రాసిన పాటలు బాగున్నాయని కావ్య మెచ్చుకుంటుంది. ఇంకా మరిన్ని మంచి పాటలు రాయాలని చెబుతుంది. కళ్యాణ్ సినిమాల్లో పాటలు రాస్తున్న సంగతి అందరికి చెబుతుంది అప్పు.
అది విని ప్రకాశం ఆనందపడతాడు. నువ్వు అనుకున్నది సాధించావని కళ్యాణ్‌ను రాజ్ మెచ్చుకుంటాడు. అమ్మ మీద రాసిన తాను రాసిన పాటను అందరికి వినిపిస్తాడు కళ్యాణ్. కొడుకు రాసిన పాట విని ధాన్యలక్ష్మి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పాట బాగుందని ధాన్యలక్ష్మి అంటుంది. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళ్యాణ్ పాటను మెచ్చుకుంటారు.
కావ్యను కౌగిలించుకున్న రాజ్...
ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి క్రాకర్స్ కాలుస్తారు. క్రాకర్స్ కాల్చడానికి రాజ్ భయపడతాడు. అందరూ కలిసి అతడి చేత బలవంతంగా క్రాకర్స్ కాల్పిస్తారు. బాంబ్ సౌండ్‌కు భయపడిన రాజ్ కావ్యను గట్టిగా పట్టుకుంటాడు. తన చుట్టూ అందరూ ఉన్న సంగతి మర్చిపోతాడు. బాంబులు పేల్చడం అయిపోయిందని ఇందిరాదేవి మనవడిపై ఆటపట్టిస్తుంది
టీవీ బాంబ్ పేల్చిన రుద్రాణి...
బయట బాంబులు ఏం పేల్చుతారు..టీవీలో ఇంకా పెద్ద బాంబు పేలుతుందని అందరిని ఇంట్లోకి పిలుస్తుంది రుద్రాణి. కళ్యాణ్ ఆటోనడుపుతోన్న వీడియోను చూపిస్తుంది. దుగ్గిరాల ప్రతిష్ట రోడ్డున పడిందని, సీతారామయ్య మనవడు కళ్యాణ్ బతుకుతెరువు కోసం ఆటో నడుపుకుంటున్నాడని వీడియోలో చూపిస్తారు. దుగ్గిరాల కుటుంబంలో చీలికలు మొదలయ్యాయని వీడియోలో చెబుతారు.
కొడుకుపై ధాన్యలక్ష్మి ఫైర్...
ఈ వీడియోను ధాన్యలక్ష్మి చూడలేకపోతుంది. రిమోట్ తీసి కిందపడేస్తుంది. అప్పును పెళ్లిచేసుకొని ఆమెను పోషించడానికి ఆటో నడుపుతున్నావా అంటూ కొడుకుపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. నీ కాళ్ల మీద నువ్వు నిలబడుతున్నానని చెప్పి నువ్వు చేసే పని ఇదా అంటూ కొప్పడుతుంది. ఆటో నడపటంలో తప్పు లేదని తల్లితో కళ్యాణ్ వాదిస్తాడు.
అప్పు వల్లే దరిద్రం...
నీకేం గతి లేదనుకున్నావా..అప్పు వల్లే నువ్వు పేదరికం అనుభవిస్తున్నావని, నిన్ను దరిద్రంలా పట్టుకుందని అప్పుపై ధాన్యలక్ష్మి నిందలు వేస్తుంది. ధాన్యలక్ష్మి మాటల్ని స్వప్న సహించలేకపోతుంది. కళ్యాణ్‌ను పెళ్లిచేసుకుంటానని అప్పు వెంటపడలేదని, కళ్యాణే... అప్పు మెడలో ఆవేశంతో తాళి కట్టాడని అంటుంది. మీ అక్క చెల్లెళ్ల గురించి నాకు చెప్పొద్దని, ముగ్గురు మా వంశానికి చెదలు పట్టుకున్నట్లు పట్టారని ధాన్యలక్ష్మి నోరుపారేసుకుంటుంది.
ధాన్యలక్ష్మి రాద్ధాంతం...
కళ్యాణ్ ఏం నేరం చేయలేదని, తన కాళ్ల మీద తాను నిలబడటానికి చూస్తున్నాడని, ఆ విషయంలో మీరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని అప్పు అంటుంది. నీకు నాతో మాట్లాడే ధైర్యం వచ్చిందా...నువ్వెంత నీ బతుకెంతా అంటూ అప్పుపై ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి.
అప్పు బతుకును తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనని, ఇంత అహంకారం పనికిరాదని ధాన్యలక్ష్మికి ధీటుగా బదులిస్తుంది కావ్య. మీ గయ్యాళితనం చూసే కొడుకు ఇళ్లు వదిలివెళ్లిపోయాడని స్వన్న కూడా ధాన్యలక్ష్మిపై కోప్పడుతుంది.
సర్ధిచెప్పిన రాజ్...
చివరకు ధాన్యలక్ష్మి రచ్చను రాజ్ ఆపేస్తాడు. కళ్యాణ్‌ను తిరిగి ఇంటికివచ్చేయమని అంటాడు. నువ్వు నాలాగే ఇంటి వారసుడివని, కష్టపడాల్సిన పనిలేదని చెబుతాడు. కానీ కళ్యాణ్ రానని బదులిస్తాడు. నా ముందే అప్పును..నువ్వెంత...నీ బతుకెంతా అని మాట్లాడింది అమ్మ. ఈ ఇంటికొస్తే ఏం జరుగుతుందో రెండో సారి రుజువైంది. ఇంటికొస్తే జీవితాంతం మా అమ్మ చేత అప్పు మాటలు పడాల్సివస్తుందని రాజ్‌తో అంటాడు అప్పు.
కల్యాణ్ ఇంటి వారసుడు...
ధాన్యలక్ష్మి మాటల్ని ఇందిరాదేవి తప్పుపడుతుంది. భార్యను పోషించడానికి ఆటో నడపటం నేరం కాదని అంటుంది. కళ్యాణ్ ఇంటి వారసుడు అయినప్పుడు రాజ్‌ను ఒకలా...కళ్యాణ్‌ను ఒకలా చూస్తే ఊరుకోనని ధాన్యలక్ష్మి మళ్లీ గొడవ మొదలుపెడుతుంది. ఈ గొడవలు ఆగిపోవడానికైనా అప్పుతో కలిసి తిరిగి ఇంటికొచ్చేయమని కళ్యాణ్‌ను రిక్వెస్ట్ చేస్తాడు రాజ్.
తనను ఏది చేతకానివాడిలా చూసింది. ఇంట్లోవాళ్ల ఆస్తిని అనుభవించడానికి తప్పు దేనికి పనికిరానని అవమానించింది. ఇప్పుడు అప్పు చేత కూడా ఆ మాట అనిపించుకోలేనని కళ్యాణ్ అంటాడు. నేను ఏదైనా సాధించగలనని రుజువు చేసుకోవడానికే ఇంటికి దూరమయ్యానని రాజ్‌కు బదులిస్తాడు కళ్యాణ్.
కోడలిగా ఒప్పుకోను...
చేసిన నిర్వాకం చాలని, అప్పు ముఖానా ఎంతో పడేస్తానని, ఆమెను వదిలిపెట్టి ఇంట్లోనే ఉండమని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యలక్ష్మి. చచ్చేదాకా అప్పును కోడలిగా ఒప్పుకోనని అంటుంది. ధాన్యలక్ష్మి మాటలతో కళ్యాణ్‌తో పాటు అందరూ షాకవుతారు. నువ్వు అప్పును కోడలిగా ఒప్పుకోవని నాకు తెలుసు...అందుకే నేను చచ్చేదాకా ఇంటికి రాకూడదని అనుకున్నానని తల్లికి బదులిస్తాడు కళ్యాణ్.
ఏం చేశైనా కళ్యాణ్ న్యాయం జరగాల్సిందేనని ధాన్యలక్ష్మి పట్టుపడుతుంది. ఆస్తిని ముక్కలు చేయమని అంటుంది. కళ్యాణ్ వాటా అతడికి ఇవ్వమని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.