Smart TV : 55 అంగుళాల స్మార్ట్‌ టీవీలు.. ఈ టాప్ 3 మోడళ్లపై మంచి డిస్కౌంట్లు-best 55 inch smart tvs with discount under 25000 rupees choose from these 3 top models ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Tv : 55 అంగుళాల స్మార్ట్‌ టీవీలు.. ఈ టాప్ 3 మోడళ్లపై మంచి డిస్కౌంట్లు

Smart TV : 55 అంగుళాల స్మార్ట్‌ టీవీలు.. ఈ టాప్ 3 మోడళ్లపై మంచి డిస్కౌంట్లు

Anand Sai HT Telugu
Nov 06, 2024 09:30 AM IST

Smart TV Discount : ఇంట్లో పెద్ద టీవీ ఉండాలని కోరుకునేవారి కోసం కొన్ని ఆఫర్లు నడుస్తు్న్నాయి. 55 అంగుళాల స్మార్ట్ టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.

25వేల లోపు ధరలో స్మార్ట్ టీవీలు
25వేల లోపు ధరలో స్మార్ట్ టీవీలు

మీరు పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీని ఇంటికి కొనాలి అనుకుంటే బడ్జెట్ ధరలోనే తెచ్చుకోవవచ్చు. బడ్జెట్ ఎక్కువగా లేకుంటే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఉత్తమ డీల్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు 55 అంగుళాల డిస్‌ప్లే కలిగిన స్మార్ట్ టీవీల కొనుగోలు చేయవచ్చు. రూ.25,000 కంటే తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ఈ టీవీల్లో పెద్ద డిస్‌ప్లేలతో పాటు గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, 4కే రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆ జాబితా ఓసారి చూడండి..

కొడాక్ 7ఎక్స్‌ప్రో అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో 4కే డిస్ ప్లేతో పాటు 40వాట్ కెపాసిటీ స్పీకర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీలో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. బెజెల్ లెస్ డిజైన్‌తో పాటు హెచ్‌డీఆర్ 10ప్లస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ప్రైమ్ వీడియో నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వరకు యాప్స్‌ను యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చు.

సోలిక్ బెజెల్-లెస్ 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఇడి-టీవీ 55ఎస్యుహెచ్డీ 23పై వినియోగదారులు అమెజాన్ నుండి డిస్కౌంట్ పొందవచ్చు. ఈ టీవీని కేవలం రూ .24,890కు కొనుగోలు చేయవచ్చు. బెజెల్ లెస్ డిజైన్‌తో పాటు 4కే డిస్ ప్లే, 2 జీబీ ర్యామ్‌తో 16 జీబీ స్టోరేజ్‌ను ఈ టీవీ కలిగి ఉంది. ఇది 40 వాట్ అవుట్ పుట్‌తో స్పీకర్లను పొందుతుంది. 6 సౌండ్ మోడ్‌లను పొందుతుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మిరాకాస్ట్ నుండి గూగుల్ ప్లే స్టోర్ వరకు కనెక్టివిటీ ఆప్షన్స్ అందిస్తుంది.

టీసీఎల్‌ 64 అల్ట్రా హెచ్‌డీ (4కె) ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ .25,999 ధరకు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే దీని ధర రూ .25 వేల కంటే తక్కువ. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 4కే రిజల్యూషన్‌తో 55 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇది 24 వాట్ల సామర్థ్యం గల డాల్బీ ఆడియో సపోర్ట్ స్పీకర్లను కలిగి ఉంది. అనేక ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Whats_app_banner