Brahmamudi November 7th Episode: త‌ల్లిదండ్రుల‌కు క‌ళ్యాణ్ గిఫ్ట్ -ధాన్య‌ల‌క్ష్మి ఎమోష‌న‌ల్ -కావ్య‌కు బోన‌స్ ఇచ్చిన రాజ్-brahmamudi november 7th episode rudrani feels jealous on duggirala family gives importance to kavya star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 7th Episode: త‌ల్లిదండ్రుల‌కు క‌ళ్యాణ్ గిఫ్ట్ -ధాన్య‌ల‌క్ష్మి ఎమోష‌న‌ల్ -కావ్య‌కు బోన‌స్ ఇచ్చిన రాజ్

Brahmamudi November 7th Episode: త‌ల్లిదండ్రుల‌కు క‌ళ్యాణ్ గిఫ్ట్ -ధాన్య‌ల‌క్ష్మి ఎమోష‌న‌ల్ -కావ్య‌కు బోన‌స్ ఇచ్చిన రాజ్

Nelki Naresh Kumar HT Telugu
Nov 07, 2024 07:58 AM IST

Brahmamudi November 7th Episode: బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 7 ఎపిసోడ్‌లో రాజ్ తో మాట్లాడ‌టానికి అత‌డి రూమ్‌కు వెళుతుంది కావ్య‌. త‌న రూమ్‌లోకి రావోద్ద‌ని, ఏదున్నా బ‌య‌టే ఉండి మాట్లాడ‌మ‌ని కావ్య‌కు రాజ్ ఆర్డ‌ర్‌వేస్తాడు. త‌న మొద‌టి సంపాద‌న‌తో క‌ళ్యాణ్ త‌ల్లిదండ్రుల‌కు బ‌ట్ట‌లు తీసుకుంటాడు.

బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 7 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 7 ఎపిసోడ్‌

Brahmamudi November 7th Episode: కంపెనీ ఎంప్లాయ్స్‌కు బోన‌స్‌లు ఇచ్చే ప‌నిని రాజ్ చేతుల మీదుగా జ‌రిపిస్తేనే బాగుంటుంద‌ని ఇందిరాదేవితో వాదిస్తుంది కావ్య‌. రాజ్‌కు పోటీగా ఇవ‌న్నీ చేస్తుండ‌టం త‌ప్పుచేసిన‌ట్లుగా ఫీల‌వుతుంది. నేను సీఈవో అయినందుకే నాపై ఈ ఇంట్లో చాలా మందికి కోపంగా ఉంద‌ని, ఎంప్లాయ్స్‌కు నేనే బోన‌స్ చెక్‌లు అందిస్తే చూస్తూ ఊరుకుంటారా అని భ‌య‌ప‌డుతుంది. మ‌హా అయితేకుళ్లుకుంటారు...ఇంకా ఎక్కువైతే ఏడుస్తారు..అంతేకానీ వాటివ‌ల్ల నీకు ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌ద‌ని కావ్య భ‌యాల‌ను కొట్టిప‌డేస్తుంది ఇందిరాదేవి.

రాజ్ మ‌న‌సుకు బాధ‌...

తాను చేసే ఈ ప‌ని వ‌ల్ల రాజ్ మ‌న‌సు కూడా బాధ‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని కావ్య అంటుంది. రాజ్ మాత్రం నీ మ‌న‌సును బాధ‌పెట్టొచ్చా...తాళి క‌ట్టిన భార్య‌ను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌న‌డం ఎంత అవ‌మాన‌మో రాజ్‌కు అర్థం కావాలి.. రాజ్ కోల్పోయింది ఏమిటో అత‌డికి తెలిసిరావాల‌నే ఇదంతా చేస్తున్నామ‌ని ఇందిరాదేవి చెబుతుంది.

కావ్య ఏదో చెప్ప‌బోతుంటే నోరు మూసుకొని చెప్పింది చేయ‌మ‌ని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. అవ‌కాశం ఇస్తే ప్ర‌తి ఒక్క‌రూ స్పీచ్‌లు ఇచ్చేయ‌డ‌మే, పెద్ద‌వాళ్ల మాట అంటే లెక్క‌లేకుండాపోయింద‌ని కోప్ప‌డి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

రూమ్ లోప‌లికి ఎందుకొచ్చావు...

ఇందిరాదేవి త‌న మాట విన‌క‌పోవ‌డంతో రాజ్‌తో మాట్లాడి ఈ చెక్‌ల‌ను ఎంప్లాయ్స్‌కు అత‌డి చేతులు మీదుగా ఇచ్చేలా ఒప్పించాల‌ని కావ్య ఫిక్స‌వుతుంది. రాజ్ రూమ్‌లోకి వ‌స్తుంది. ఏంటి లోప‌లికి వ‌చ్చావు...ఏదున్నా గ‌ది బ‌య‌టే ఉండి మాట్లాడ‌మ‌ని కావ్య‌పై ఫైర్ అవుతాడు రాజ్‌. నీతో మాట్లాడాల‌ని కావ్య అంటుంది.నువ్వు ఏం మాట్లాడిన...నీ మాట‌ల‌కు క‌రిగిపోయి ప‌డిపోయే ర‌కాన్ని కాద‌ని, స్టోన్‌లా రాటుదేలిపోయాన‌ని రాజ్ అంటాడు.

జ‌రిగింది మ‌ర్చిపోయి...

జ‌రిగింది మ‌ర్చిపోయి గొడ‌వ‌లు వ‌ద‌లిపెట్టి మ‌న క‌లుసుకొని సంతోషంగా కాపురం చేద్దామ‌ని న‌న్ను బ‌తిమిలాడ‌టం త‌ప్పు నువ్వు నాకు ఏం చెబుతావ‌ని రాజ్ వెట‌కారంగా కావ్య‌తో అంటాడు. నేను మిమ్మ‌ల్ని బ‌తిమిలాడుతాన‌ని ఎలా అనుకున్నార‌ని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌.

నువ్వు మా అమ్మ విష‌యంలో త‌ప్పు చేశావు...ఆ త‌ప్పును క‌ప్పిపుచ్చుకోవ‌డానికి మీ అమ్మ చేత క్యాన్స‌ర్ నాట‌కం ఆడించావ‌ని మ‌ళ్లీ కావ్య‌ను అపార్థం చేసుకుంటాడు రాజ్‌. మీరు జీవితాంతం ట్రై చేసినా న‌న్ను అర్థం చేసుకోలేర‌ని అర్థ‌మైంద‌ని భ‌ర్త‌తో అంటుంది కావ్య‌.

దానం తీసుకోను...

కంపెనీ ఎంప్లాయ్స్‌కు బోన‌స్ ఇవ్వ‌మ‌ని త‌న చేతికి తాత‌య్య చెక్‌లు ఇచ్చార‌ని ...అది మీ చేతుల మీదుగా జ‌రిగితే బాగుంటుంద‌ని రాజ్‌కు చెబుతుంది కావ్య‌. తాత‌య్య ఇచ్చిన చెక్‌ల‌ను నాకు దానం చేస్తున్నావా అని కావ్య‌ను త‌ప్పుప‌డ‌తాడు రాజ్‌. దానం కాద‌ని ఇది ఇది మీ హ‌క్కు అని కావ్య అంటుంది.

ఎప్ప‌టికైనా కంపెనీ నాదే...ఆ సీఈవోను నేనే...నువ్వు ఆకాశంలో మ‌బ్బు లాంటిదానివి...వ‌ర్షాకాలం అయిపోగానే మ‌బ్బులు వెళ్లిపోయిన‌ట్లుగా నువ్వు ఏదో రోజు కంపెనీ వ‌దిలిపెట్టిపోతావు..నేను ఆకాశం లాంటోడిని ఎప్ప‌టికీ ఇక్క‌డే ఉంటాన‌ని బిల్డ‌ప్‌లు ఇస్తాడు రాజ్‌. కావ్య ఇచ్చిన చెక్‌ల‌ను తీసుకోన‌ని అంటాడు.

అప్పు, క‌ళ్యాణ్ ఎంట్రీ...

క‌ళ్యాణ్, అప్పు దుగ్గిరాల ఇంటికొస్తారు. గ‌డ‌ప‌లోప‌ల అడుగుపెట్ట‌డానికి అప్పు సంశ‌యిస్తుంది. ఏం కాద‌ని స‌ర్ధిచెప్పి క‌ళ్యాణ్ భార్య‌ను లోప‌లికి తీసుకొస్తాడు. జ‌ర‌గాల్సింది అంతా జ‌రిగిపోయింది. ఇంకా కోడ‌లి మీద కోపం పెంచుకొని ఏం సాధిస్తావ‌ని మంచిదానిలా మారిపోయిన‌ట్లుగా డైలాగ్‌లు కొడుతుంది రుద్రాణి.

ఒక్క‌సారి క్ష‌మించేశాంటే మ‌న‌సులో ఉన్న కోపం మొత్తంతొల‌గిపోయి అంద‌రం హ్యాపీగా క‌లిసుండొచ్చున‌ని అంటుంది. రుద్రాణిలో వ‌చ్చిన మార్పు చూసి స్వ‌ప్న షాక‌వుతుంది. విడ‌గొట్ట‌డం, గొడ‌వ‌లుపెట్ట‌డం నీ స్టైల్ కానీ...నువ్వు క‌లిసుండ‌టం గురించి మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని స్వ‌ప్న అంటుంది.

కొడుకుకు మాత్ర‌మే...

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌కాశం ఏదో బ‌య‌టివాళ్ల‌లా ఇంత ఆల‌స్యంగా వ‌చ్చారేంటి అని క‌ళ్యాణ్,అప్పుల‌తో అంటాడు. తోడికోడ‌ళ్లు నీ తోబుట్టువులే క‌దా ఎందుకు ఇంత మొహ‌మాటం అని అప్పు భ‌యాన్ని పొగొట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. కావ్య లోప‌ల ఉంద‌ని, ఆమెను క‌ల‌వ‌మ‌ని చెబుతాడు.

ముందు క‌ళ్యాణ్‌ను టిఫిన్ పెట్ట‌మ‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. అప్పుకు టిఫిన్ పెట్టాల్సిన అవ‌స‌రం లేదా అని స్వ‌ప్న అడుగుతుంది. నీ చెల్లిలిని ఎలా చూసుకోవాలా నా కంటే నీకే బాగా తెలుసు అంటూ తెలివిగా ధాన్య‌ల‌క్ష్మి స‌మాధాన‌మిస్తుంది.

ఏడుపు మొహం చూడ‌లేక‌పోతున్నా...

ధాన్య‌ల‌క్ష్మిగా చిరాకుగా క‌నిపించ‌డంతో నీ ఏడుపు మొహం చూడ‌లేక‌పోతున్నాన‌ని ప్ర‌కాశం వెట‌కారంగా అంటాడు. కొడుకు ఇంటికి వ‌చ్చినా ఎప్ప‌టికీ ఉండ‌టానికి రాలేదుగా అని ధాన్య‌ల‌క్ష్మి భ‌ర్త‌కు స‌మాధాన‌మిస్తుంది. వాళ్లు ఉంటాన‌ని అన్న నువ్వు ఉండ‌నివ్వ‌వుగా...అప్పును కోడ‌లిగా ఒప్పుకుంటావా అని ప్ర‌కాశం అడుగుతాడు. అది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. అయితే క‌ళ్యాణ్, అప్పు కూడా ఇక్క‌డ ఉండ‌టం జ‌ర‌గ‌ద‌ని ప్ర‌కాశం అంటాడు.

కొత్త బ‌ట్ట‌లు కొన్న క‌ళ్యాణ్‌...

క‌ళ్యాన్ క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో త‌ల్లిదండ్రుల‌కు బ‌ట్ట‌లు కొంటాడు. ఆ బ‌ట్ట‌ల‌ను ఇద్ద‌రం క‌లిసే త‌ల్లిదండ్రుల‌కు ఇద్దామ‌ని అప్పుతో చెబుతాడు క‌ళ్యాణ్. ధాన్య‌ల‌క్ష్మిని భాద‌పెట్ట‌డం ఇష్టంలేక తాను రాన‌ని చెబుతుంది. మాట్లాడ‌కుండా దూరంగా ఉంటే ఇంకా దూర‌మ‌వుతార‌ని, అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడితే త‌ప్ప‌కుండా ద‌గ్గ‌ర‌వుతావ‌ని అప్పును బ‌ల‌వంతంగా తీసుకుపోతాడు.

ధాన్య‌ల‌క్ష్మి ఎమోష‌న‌ల్‌...

నా మొద‌టి సంపాద‌న‌తో మీకు బ‌ట్ట‌లు తీసుకున్నాన‌ని ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మితో అంటాడు క‌ళ్యాణ్. కొడుకు మాట‌లు ధాన్య‌ల‌క్ష్మి ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌ళ్యాణ్ ఇచ్చిన చీర‌ను తీసుకోకుండా అలాగే నిల్చుంటుంది ధాన్య‌ల‌క్ష్మి. ఇలాంటి అవ‌కాశం అంద‌రికి ద‌క్క‌ద‌ని, కోట్ల ఆస్తి ఉన్నా ఈ ఆనందాన్ని పొంద‌డం సాధ్యం కాద‌ని ధాన్య‌ల‌క్ష్మిలోని అనుమానాల్ని తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తుంది అప‌ర్ణ‌.

క‌ళ్యాణ్ ఎవ‌రి సాయం లేకుండాత‌న క‌ష్టంతో సంపాదించిన డ‌బ్బుతో నీకు బ‌ట్ట‌లు తీసుకున్నాడు. త‌ల్లిగా ఇంత‌కంటే సంతోష‌క‌ర‌మైన విష‌యం ఇంకోటి ఉండ‌ద‌ని ధాన్య‌ల‌క్ష్మితో అప‌ర్ణ అంటుంది.

నిజ‌మైన ఆనందం...

అప‌ర్ణ మాట‌ల‌తో కొడుకు ఇచ్చిన చీర‌ను అందుకుంటుంది ధాన్య‌ల‌క్ష్మి. ప్ర‌కాశానికి అప్పు బ‌ట్ట‌లు ఇస్తుంది. ఇద్ద‌రు క‌లిసి ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి ఆశీర్వాదం తీసుకుంటారు. నేను పుట్టిన‌ప్ప‌టి నుంచి నీలో నిజ‌మైన ఆనందం ఇప్పుడే చూస్తున్నాన‌ని క‌ళ్యాణ్ అంటాడు. నీ కొడుకు కూడా అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌డ‌ని నిరూపించ‌డానికే ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాన‌ని క‌ళ్యాణ్ చెబుతాడు.

అప్పుకు బ‌ట్ట‌లు కొన‌లేదు...

మీరు కూడా క‌ళ్యాణ్, అప్పుల‌కు బ‌ట్ట‌లు తీసుకున్నారుగా అవి కూడా పెట్ట‌మ‌ని ఇందిరాదేవి అంటుంది. నేను క‌ళ్యాణ్‌కు మాత్ర‌మే బ‌ట్ట‌లు తీసుకున్నాన‌ని ధాన్య‌ల‌క్ష్మి చెబుతుంది. అదేంటి కోడ‌లు విష‌యం మ‌ర్చిపోయావా అని ఇందిరాదేవి నిల‌దీస్తుంది.

ఈవిడ గారు చీర‌క‌ట్టుకుంటుందో...ప్యాంట్ ష‌ర్ట్ వేసుకుంటుందో తెలియ‌దుగా అందుకే తీసుకోలేద‌ని ధాన్య‌ల‌క్ష్మి వెట‌కారంగా బ‌దులిస్తుంది. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావ‌ని తెలిసే అప్పు కోసం తాను చీర కొన్నాన‌ని ప్ర‌కాశం అంటాడు. ప్ర‌కాశం తెచ్చిన చీర‌ను త‌న చేతులు మీదుగా కోడ‌లికి అంద‌జేస్తుంది ధాన్య‌ల‌క్ష్మి. ప్ర‌కాశం తెలివిగా ఇందిరాదేవి మురిసిపోతుంది.

రుద్రాణి అస‌హ‌నం...

ధాన్య‌ల‌క్ష్మి, అప్పు క‌లిసిపోవ‌డం చూసి రుద్రాణి స‌హించ‌లేక‌పోతుంది. వెంట‌నే అనామిక‌కు ఫోన్ చేసి డాక్యుమెంట‌రీ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చెప్ప‌మ‌ని అడుగుతుంది. వాళ్ల‌కు ఈ ఆనందం ఎక్కువ సేపు మిగ‌ల‌ద‌ని, న్యూస్ వాళ్లు టెలికాస్ట్ టైమ్ చెప్ప‌గానే తానే ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తాన‌ని రుద్రాణితో అనామిక అంటుంది.

కావ్య హార‌తి...

కావ్య‌, స్వ‌ప్న‌, అప్పు క‌లిసి దీపావ‌ళి పూజ చేస్తారు. కావ్య‌కు దుగ్గిరాల ఫ్యామిలీ ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి ధాన్య‌ల‌క్ష్మి త‌ట్టుకోలేక‌పోతుంది. ఎంప్లాయ్స్‌కు బోన‌స్‌లు నాతో ఇప్ప‌స్తే స‌రిపోయేదిగా అని రాహుల్ అంటాడు. క‌వ‌ర్‌లోని స‌గం డ‌బ్బులు నువ్వే నొక్కేస్తావుగా అని కొడుకుతో అంటుంది రుద్రాణి. ఎంటి త‌ల్లికొడుకులు అసూయ‌తో ర‌లిగిపోతున్నార‌ని రుద్రాణితో అంటుంది స్వ‌ప్న‌. కావ్య ఇచ్చిన హార‌తి తీసుకోవ‌డానికి రాజ్ ఇష్ట‌ప‌డ‌డు. ఇందిరాదేవి చెప్ప‌డంతో త‌ప్ప‌నిస‌రిగా హార‌తి తీసుకుంటాడు.

రాజ్ చేతుల మీదుగా...

ఆ త‌ర్వాత కంపెనీ ఎంప్లాయ్స్‌కు బోన‌స్‌ల‌ను కావ్య త‌న చేతుల మీదుగా అంద‌జేస్తుంది. సీఈవో కూడా కంపెనీ ఎంప్లాయ్ కిందే లెక్క అని రాజ్ అంటాడు. ఛైర్మ‌న్‌గారి మ‌న‌వ‌డిగా కావ్య‌కు తాను బోన‌స్ ఇస్తాన‌ని ప్ర‌క‌టిస్తాడు. చెప్పిన‌ట్లుగానే కావ్య‌కు చెక్ ఇస్తాడు. రాజ్ చేతుల మీదుగా ఆనందంగా చెక్‌ను అందుకుంటుంది కావ్య‌. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner