తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 16th Episode: అత్తింట్లో అనామిక పంచాయితీ - క‌ళ్యాణ్ కోసం ఒక్క‌టైన దుగ్గిరాల కుటుంబం - రాజ్‌కు షాక్‌

Brahmamudi May 16th Episode: అత్తింట్లో అనామిక పంచాయితీ - క‌ళ్యాణ్ కోసం ఒక్క‌టైన దుగ్గిరాల కుటుంబం - రాజ్‌కు షాక్‌

16 May 2024, 7:06 IST

google News
  • Brahmamudi May 16th Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో కూతురు కాపురం విష‌యంలో క‌ళ్యాణ్‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను అనామిక త‌ల్లిదండ్రులు నిల‌దీస్తారు. క‌ళ్యాణ్ త‌ప్పుచేసిన‌ట్లుగా మాట్లాడుతారు. వారిపై దుగ్గిరాల కుటుంబ‌స‌భ్యులు ఫైర్ అవుతారు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi May 16th Episode: ఆఫీస్‌కు వెళ్లేది లేద‌ని అనామిక‌కు తేల్చిచెబుతాడు క‌ళ్యాణ్‌. త‌న‌పై మ‌రోసారి కేసు పెట్టిన భ‌య‌ప‌డ‌న‌ని, ఇంట్లో ఉంటే ఉండు లేదంటే వెళ్లిపో అంటూ అనామిక‌కు తెగేసి చెప్పేస్తాడు9. ఇక నుంచి త‌న‌కు మ‌న‌సుకు న‌చ్చిన ప‌నులే చేస్తాన‌ని, క‌విత‌లు రాసుకుంటూ ఉంటాన‌ని అంటాడు.

రుద్రాణి స‌ల‌హా...

క‌ళ్యాణ్ తీసుకున్న నిర్ణ‌యంతో అనామిక షాక‌వుతుంది. క‌ళ్యాణ్‌ను తిరిగి ఎలా ఆఫీస్‌కు పంపించాలో తెలియ‌క‌...రుద్రాణి స‌ల‌హా అడుగుతుంది. అనామిక తిరిగి త‌న ట్రాప్‌లో ప‌డ‌టంతో రుద్రాణి ఆనందంగా ఫీల‌వుతుంది. అనామిక చేత‌నే క‌ళ్యాణ్ శాశ్వ‌తంగా ఆఫీస్‌కు వెళ్ల‌కుండా ఇంట్లో ఉండేలా ప్లాన్ వేస్తుంది రుద్రాణి. అప్పుడే ఆఫీస్‌కు త‌న కొడుకు రాహుల్ ఎండీ అవుతాడ‌ని అనుకుంటుంది.

మాట త‌ప్పిన దుగ్గిరాల ఫ్యామిలీ...

క‌ళ్యాణ్‌తో పెళ్లి స‌మ‌యంలో నిన్ను కూతురిలా చూసుకుంటామ‌ని మీ త‌ల్లిదండ్రుల‌కు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ మాటిచ్చారు క‌దా అని అనామిక‌ను అడుగుతుంది రుద్రాణి. ఇప్పుడు అంద‌రూ మాట త‌ప్పారు.

మీ త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి క‌ళ్యాణ్‌తో పాటు దుగ్గిరాల పెద్ద‌ల‌ను ఈ విష‌య‌మై నిల‌దీయ‌మ‌ని అనామిక‌కు స‌ల‌హా ఇస్తుంది రుద్రాణి. ఆమె త‌ప్పుడు స‌ల‌హాను అర్థం చేసుకోలేని అనామిక వెంట‌నే త‌ల్లికి ఫోన్ చేసి అత్తింటికి ర‌మ్మ‌ని అంటుంది. మీరు ఇంటికి వ‌చ్చి నిల‌దీస్తేనే క‌ళ్యాణ్ ఆఫీస్‌కు వెళ‌తాడ‌ని చెబుతుంది.

మాయ అడ్రెస్ క‌నిపెట్టిన కావ్య‌...

మాయ అడ్రెస్ వెతుక్కుంటూ బ‌స్తీకి వ‌స్తుంది కావ్య‌. బ్యాంక్ అకౌంట్‌లో మాయ ఇచ్చిన ఇంటి అడ్ర‌స్ క‌నిపెడుతుంది. కానీ మాయ ఇక్క‌డ లేద‌ని, సొంత ఇళ్లు కొనుక్కొని సెటిలైంద‌ని ఇంటి ఓన‌ర్ కావ్య‌కు చెబుతుంది. మాయ కొత్త ఇంటి అడ్రెస్‌ను కావ్య‌కు ఇస్తుంది ఓన‌ర్‌. మ‌రోవైపు కావ్య‌ను కిడ్నాప్ చేసేందుకు కొంద‌రు రౌడీలు ఆమెను ఫాలో అవుతుంటారు.

రాజ్‌కు ట్విస్ట్‌...

మాయ అడ్రెస్ వెతుక్కుంటూ రాజ్ కూడా బ‌స్తీకి వ‌స్తాడు. రాజ్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన బేబీ డే కేర్ సెంట‌ర్ ఓన‌ర్ క‌నిపిస్తాడు. రాజ్‌ను చూసి కంగారు ప‌డ్డ అత‌డు పారిపోబోతాడు. అత‌డిని రాజ్ ప‌ట్టుకోగానే...కావాల‌ని త‌ప్పు చేయ‌లేద‌ని, కావ్య పోలీసుల‌ను తీసుకొచ్చి బెదిరించ‌డంతో మీ బిడ్డ కాద‌నే నిజం ఆమెకు చెప్పాన‌ని అంటాడు.

త‌న ద‌గ్గ‌ర పెరుగుతోన్న బిడ్డ‌...త‌న బాబు కాద‌నే నిజం కావ్య‌కు తెలిసింద‌న‌గానే రాజ్ షాక‌వుతాడు. ఆ బిడ్డ‌కు తండ్రి సుభాష్ అనే నిజం కూడా కావ్య‌కు తెలిసిందా? ఒక‌వేళ తెలిస్తే ఆమె ఎందుకు సైలెంట్‌గా ఉంటుంద‌ని రాజ్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు.

అనామిక పంచాయ‌తీ...

అనామిక కాపురం గురించి దుగ్గిరాల ఫ్యామిలీని నిల‌దీయ‌డానికి ఆమె త‌ల్లిదండ్రులు వ‌స్తారు. మీ కూతురు కాపురానికి వ‌చ్చిన క‌ష్టం ఏమిటి? అత్త పోరు ఉందా? ఆడ‌ప‌డుచు పోరు ఉందా? మా అబ్బాయి తాగుబోతా...తిరుగుబోతా...మీరు ప్ర‌త్యేకంగా వ‌చ్చి పంచాయ‌తీ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది అంటూ అనామిక త‌ల్లిదండ్రుల‌పై అప‌ర్ణ ఫైర్ అవుతుంది. అనామిక‌పై స్వ‌ప్న‌తో పాటు ప్ర‌కాశం కూడా పంచ్‌లు వేస్తారు. మా ఇంటికి చెత్త వ‌చ్చినందుకు నేనే మిమ్మ‌ల్ని పంచాయ‌తీ పిల‌వాలి అంటూ ప్ర‌కాశం అంటాడు.

క‌ళ్యాణ్‌పై కంప్లైంట్స్‌....

అనామిక జీవితం ఏమ‌వుతుందోన‌ని భ‌యంగా ఉంద‌ని ఆమె త‌ల్లిదండ్రులు అంటారు. మీ అబ్బాయి...అనామిక‌తో ప్రేమ‌గా ఉండ‌టం లేదంట అని క‌ళ్యాణ్‌పై కంప్లైంట్ ఇస్తారు ఆమె త‌ల్లిదండ్రులు.... కాపురానికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చిన్న చిన్న విష‌యాల‌కే పెద్ద గొడ‌వ‌లు చేస్తే ఏ మొగుడికి ప్రేమ‌గా ఉండాల‌ని అనిపిస్తుంద‌ని అనామిక త‌ల్లిదండ్రుల‌తో అంటాడు సుభాష్.

ఆఫీస్‌కు వెళ్ల‌కుండా క‌విత‌లు...

ఆఫీస్‌కు వెళ్ల‌కుండా క‌ళ్యాణ్‌ క‌విత‌లు రాయ‌డం బాగాలేద‌ని అంటారు. పెళ్లైన త‌ర్వాత కూడా క‌విత‌లు రాస్తా అంటే ఎలా అని అనామిక త‌ల్లిదండ్రులు క‌ళ్యాణ్‌పై కోప్ప‌డ‌తారు. క‌విత‌లు చూసే క‌ళ్యాణ్‌ను అనామిక ప్రేమించింది నిజం కాదా...అత‌డు రాసిన క‌విత్వం న‌చ్చే పెళ్లి చేసుకుంది నిజం కాదా అని ఇందిరాదేవి నిల‌దీస్తుంది. త‌న కొడుకు ఆఫీస్‌కు వెళ్లి క‌ష్ట‌ప‌డితేనే పూట గ‌డ‌వ‌ని స్థితిలో తాము లేమ‌ని ధాన్య‌ల‌క్ష్మి కోపంగా స‌మాధాన‌మిస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంద‌రూ ఒకేతాటిపై ఉండి అనామిక త‌ల్లిదండ్రుల‌ను చెడామ‌డా వాయిస్తారు.

అనామిక త‌ల్లి గొడ‌వ‌...

మీ అబ్బాయి...మా అమ్మాయి కోరుకున్న విధంగా ఉండ‌టం లేద‌ని అనామిక త‌ల్లి మ‌ళ్లీ గొడ‌వ‌ను పెద్ద‌ది చేయాల‌ని చూస్తుంది. ఉండ‌ను అని క‌ళ్యాణ్ గ‌ట్టిగా స‌మాధాన‌మిస్తాడు. నేను కోరుకున్న‌ట్లు నువ్వు ఉండ‌న‌ప్పుడు...నువ్వు కోరుకున్న‌ట్లు నేను ఉండాన‌ని అంటాడు. భ‌ర్త‌కు విలువ ఇచ్చే భార్య‌ను ఎవ‌రూ దూరం పెట్ట‌ర‌ని అనామిక‌తో అంటాడు.

అనామిక పోలీస్ కేసు..

అనామిక కోరుకున్న‌ట్లు క‌ళ్యాణ్ క‌విత‌లు రాయ‌డం ఆపేసి ఆఫీస్‌కు వెళ్లిన కూడా అనామిక పోలీస్ కేసు పెట్ట‌డంతో త‌న కొడుకు మ‌న‌సు విరిగిపోయింద‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. అప్పుతో తిరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటాన‌ని అనామిక అంటుంది. మ‌ధ్య‌లో అప్పు పేరు తీస్తే చెప్పు తెగుతుంది అని స్వ‌ప్న వార్నింగ్ ఇవ్వ‌బోతుంది. ఆమెను రుద్రాణి అడ్డుకుంటుంది.

ఇందిరాదేవి వార్నింగ్‌...

క‌ళ్యాణ్ ఉద్దేశం ఏమిటో...అప్పు వాళ్ల అక్క‌లు కోరుకుంటున్న‌ది ఏమిటో చెబితే...మేము చేయాల‌నుకున్న‌ది చేస్తామ‌ని అనామిక త‌ల్లి అంటుంది. ఆమె మాట‌ల‌తో ఇందిరాదేవి కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. ఎవ‌రిని బెదిరిస్తున్నావు..ముందు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని అనామిక త‌ల్లికి వార్నింగ్ ఇస్తుంది.

మేము త‌ల్చుకుంటే ఒక్క క్ష‌ణంలో మీరంద‌రూ జైలులో ఉంటారు. కూతురు, అల్లుడిని విడ‌దీయ‌డానికి వ‌స్తే క్ష‌ణం కూడా మా ఇంట్లో ఉండొద్దు. నీకు దిక్కున్న చోటు చెప్పుకో అంటూ అనామిక త‌ల్లిదండ్రుల‌ను హెచ్చ‌రిస్తుంది ఇందిరాదేవి. ఆమె మాట‌ల‌తో అనామిక త‌ల్లిదండ్రులు సైలెంట్ అవుతారు.

కావ్య కిడ్నాప్‌...

మాయ ఇంటి అడ్రెస్ వెతుక్కుంటూ వెళుతోన్న కావ్య‌ను దారి మ‌ళ్లిస్తుంది రౌడీ గ్యాంగ్ మెంబ‌ర్‌. ఎవ‌రు లేని ప్ర‌దేశానికి కావ్య‌ను తీసుకెళుతుంది. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన మిగిలిన‌ రౌడీ గ్యాంగ్ కావ్య‌ను కిడ్నాప్ చేస్తారు. ఆ సీన్ అప్పు చూస్తుంది. కావ్యను కిడ్నాప్ చేసి తీసుకెళుతోన్న కారును ఫాలో అవుతుంది. మ‌రోవైపు ఆఫీస్‌కు వ‌చ్చిన కావ్య తండ్రి సుభాష్ సూసైడ్‌కు ప్ర‌య‌త్నించిన వీడియో తాలూకు హార్డ్‌డిస్క్ తీసుకుపోయింద‌ని సెక్యూరిటీ గార్డ్ ద్వారా రాజ్ తెలుసుకుంటాడు. కావ్య‌కు నిజం తెలిసిపోయింద‌ని భ‌య‌ప‌డ‌తాడు.

తదుపరి వ్యాసం