Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌-pawan kalyan hari hara veera mallu movie teaser out now bobby deol director krish nidhii agerwal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 09:06 AM IST

Pawan Kalyan Hhvm Teaser: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ గురువారం రిలీజ్ అయ్యింది. ప‌వ‌న్ స్టైల్ మేన‌రిజ‌మ్స్‌తో పాటు చారిత్ర‌క అంశాలు, యాక్ష‌న్ సీక్వెన్‌ల‌తో టీజ‌ర్ అదిరిపోయింది. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెడింగ్ అవుతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్
ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్

Pawan Kalyan Hhvm Teaser: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిజం, యాక్ష‌న్ అంశాల‌తో ఈ టీజ‌ర్ మెగా అభిమానుల‌తో పాటు తెలుగు సినీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది.

మొఘ‌లుల కాలం నాటి క‌థ‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు క్రిష్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీని తెర‌కెక్కించాడు. ఈ టీజ‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్‌, బాడీలాంగ్వేజ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌నపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను అల‌రిస్తోన్నాయి. రిలీజైన కొద్ది నిమిషాల్లో సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ ట్రెండింగ్‌గా మారింది. ఏఎమ్ జ్యోతికృష్ణ కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

పోరాట యోధుటిగా...

మొఘ‌లుల కాలంలో సామాన్యులు ఎదుర్కొన్న క‌ష్టాల‌తో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మైంది. మ‌న ప్రాణానికి విలువే లేదా నాన్న అంటూ ఓ చిన్నారి చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌తి వాడిని వాడి పై వాడు దోచుకుంటాడు.

మ‌న‌ల్ని దొర దోచుకుంటే..దొర‌ను గోల్కోండ న‌వాబు దోచుకుంటాడు. గోల్కోండ న‌వాబును ఢిల్లీలో ఉండే మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తి దోచుకుంటాడు అనే డైలాగ్‌తో బాబీడియోల్ విల‌నిజాన్ని పీక్స్‌లో చూపించారు. మ‌న పైనున్నఈ దొంగ‌ల‌దంద‌రిని దోచుకోవ‌డానికి ఓ భ‌గ‌వంతుడు ఖ‌చ్చితంగా ఒక‌రిని పంపిస్తాడు.

ప‌వ‌న్ హీరోయిజం...

వాడొచ్చి దొంగ దొర‌ల లెక్క‌లు స‌రిచేస్తాడు అనే డైలాగ్ రాగానే టీజ‌ర్‌లోకి ప‌వ‌న్ ఎంట్రీ ఇవ్వ‌డం టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో ప‌వ‌న్ హీరోయిజం ఈ సినిమాలో ఏం రేంజ్‌లో ఉంటుంద‌న్న‌ది టీజ‌ర్‌లోనే డైరెక్ట‌ర్ క్రిష్ హింట్ ఇచ్చేశారు. మొఘుల్ రాజుల అన్యాయాల్ని ఎదురించే పోరాట యోధుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాను రెండు పార్ట్‌లు తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ ద్వారా మేక‌ర్స్ మ‌రోసారి హింట్ ఇచ్చేశారు. ఫ‌స్ట్ పార్ట్‌ను స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ చేస్తోన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

నిధి అగ‌ర్వాల్‌, నోరా ఫ‌తేహి...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. హీరోయిన్ల‌ను టీజ‌ర్‌లో చూపించ‌లేదు. యానిమ‌ల్‌ ఫేమ్ బాడీడియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీతోనే బాబీ డియోల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తోన్నాడు.

2019లో అనౌన్స్‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీని 2019లో అనౌన్స్‌చేశారు. 2020 షూటింగ్ మొద‌లైంది. దాదాపు నాలుగేళ్లుగా షూటింగ్ కొన‌సాగుతూనే ఉంది. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌లుపెట్టిన బ్రో, భీమ్లానాయ‌క్ తో పాటు మ‌రికొన్ని సినిమాలు రిలీజ‌య్యాయి. కానీ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీ మాత్రం రిలీజ్ కాలేదు.

ఈ హిస్టారిక‌ల్ మూవీ ఆగిపోయిన‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇత‌ర సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టం, మ‌రోవైపు క్రిష్ కూడా అనుష్క‌తో ఓ మూవీని అనౌన్స్‌చేయ‌డంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని ఫ్యాన్స్ అనుకున్నారు. గురువారం టీజ‌ర్ రిలీజ్‌తో ఈ పుకార్ల‌కు మేక‌ర్స్ పుల్‌స్టాప్ పెట్టారు. మెగాసూర్య ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్‌ర‌త్నం హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ మూవీ చేస్తోన్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ 70 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. ఓజీతో పాటు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీ చేస్తోన్నాడు ప‌వ‌న్‌. త‌మిళం బ్లాక్‌బ‌స్ట‌ర్ తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తెర‌కెక్కుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ బ‌రిలో నిల‌వ‌డంతో కొన్నాళ్ల పాటు షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చాడు ప‌వ‌న్‌.

IPL_Entry_Point