Lal Salaam OTT: ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - ఓటీటీలోకి లాల్‌స‌లామ్ - రిలీజ్ ఎప్పుడంటే?-lal salaam ott issues clear rajinikanth action movie streaming on sun nxt soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Ott: ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - ఓటీటీలోకి లాల్‌స‌లామ్ - రిలీజ్ ఎప్పుడంటే?

Lal Salaam OTT: ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - ఓటీటీలోకి లాల్‌స‌లామ్ - రిలీజ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 01, 2024 12:27 PM IST

Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకులు మొత్తం క్లియ‌ర్ అయిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే లాల్‌స‌లామ్ ఓటీటీ ఆడియెన్స్ ముంద‌కు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

లాల్ స‌లామ్ ఓటీటీ
లాల్ స‌లామ్ ఓటీటీ

Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై మూడు నెల‌లు కావ‌స్తోన్న ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి 21 రోజుల ఫుటేజ్ మిస్స‌యిందంటూ ద‌ర్శ‌కురాలు ఐశ్వ‌ర్య‌ ర‌జ‌నీకాంత్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఫుటేజ్ వ‌ల్లే సినిమా అనుకున్న విధంగా రాలేదంటూ, థియేట‌ర్ల‌లో ఫ్లాప్ కావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మంటూ పేర్కొన్న‌ది.

ఆల‌స్యానికి కార‌ణం ఇదే...

ఆ ఫుటేజ్ మిస్సింగ్ వ‌ల్లే లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్ స‌మ‌స్య‌గా మారిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.అయితే లాల్‌స‌లామ్ మూవీకి సంబంధించిన ఓటీటీ అడ్డంకులు క్లియ‌ర్ అయిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

స‌న్ నెక్స్ట్ ద్వారా ర‌జ‌నీకాంత్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు చెబుతోన్నారు. మే సెకండ్ వీక్ లేదా మూడో వారంలో లాల్ స‌లామ్ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

ర‌జ‌నీకాంత్ గెస్ట్ రోల్‌...

లాల్ స‌లామ్ సినిమాలో ర‌జ‌నీకాంత్ ఎక్కువ నిడివి క‌లిగిన అతిథి పాత్ర‌లో క‌నిపించారు. కూతురు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఈ మూవీకి ద‌ర్శ‌కురాలు కావ‌డంతో ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించారు. ఈ స్పోర్ట్స్ బేస్‌డ్ యాక్ష‌న్ మూవీలో విష్ణువిశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టించారు.

దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సుభాస్క‌ర‌ణ్ నిర్మించిన ఈ మూవీ తొలిరోజు మొద‌టి ఆట నుంచే నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ అన్ని భాష‌ల్లో క‌లిపి 30 కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

లాల్ స‌లామ్ తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ రెండు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో తె లుగులో డ‌బ్ అయిన సినిమాల్లో అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా చెత్త రికార్డ్‌ను మూట‌గ‌ట్టుకుంది.

లాల్ స‌లామ్ క‌థ ఇదే...

క‌సుమూరుకు చెందిన మొయూద్దీన్ (ర‌జ‌నీకాంత్‌) గొప్ప బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్‌) క్రికెట‌ర్‌గా చూడాల‌న్న‌ది అత‌డి క‌ల‌. ఊళ్లో క్రికెట్ మ్యాచ్ లో జ‌రిగిన గొడ‌వ‌లో శంషుద్దీన్ చేయిని గురు (విష్ణు విశాల్‌) న‌రికేస్తాడు.క్రికెట్ గొడ‌వ ఊళ్లో మ‌త‌క‌ల్లోలానికి దారితీస్తుంది.

త‌న కొడుకు చేయిని న‌రికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు? గురును ఊరివాళ్లు ఎందుకు వెలివేశారు? ప్రాణ‌స్నేహితులుగా ఉన్న మొయిద్దీన్‌, గురు తండ్రి ఎందుకు శ‌త్రువులుగా మారారు అన్న‌దే లాల్ స‌లామ్ మూవీ క‌థ‌.

రెండు సినిమాలు...

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ త‌మిలంలో రెండు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో వెట్టైయాన్ మూవీ చేస్తోన్నాడు ర‌జ‌నీకాంత్‌. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. అలాగే ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబోలో కూలీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను ఇటీవ‌లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

IPL_Entry_Point

టాపిక్