Gandeevadhari Arjuna Teaser: మెగా హీరోతో వ‌ర్క్ చేయ‌డం క‌ష్టం అంటోన్న హీరోయిన్ - స్టైలిష్‌గా గాంఢీవ‌దారి అర్జున టీజ‌ర్‌-gandeevadhari arjuna teaser out varun tej spy drama is treat for action lovers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gandeevadhari Arjuna Teaser: మెగా హీరోతో వ‌ర్క్ చేయ‌డం క‌ష్టం అంటోన్న హీరోయిన్ - స్టైలిష్‌గా గాంఢీవ‌దారి అర్జున టీజ‌ర్‌

Gandeevadhari Arjuna Teaser: మెగా హీరోతో వ‌ర్క్ చేయ‌డం క‌ష్టం అంటోన్న హీరోయిన్ - స్టైలిష్‌గా గాంఢీవ‌దారి అర్జున టీజ‌ర్‌

HT Telugu Desk HT Telugu

Gandeevadhari Arjuna Teaser: వ‌రుణ్‌తేజ్ గాంఢీవ‌ధారి అర్జున టీజ‌ర్ సోమ‌వారం రిలీజైంది. హై ఇంటెన్స్ యాక్ష‌న్ సీక్వెన్స్‌, ఛేజింగ్ సీన్స్‌తో టీజ‌ర్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

వ‌రుణ్‌తేజ్ గాంఢీవ‌ధారి అర్జున

Gandeevadhari Arjuna Teaser: వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తోన్న గాంఢీవ‌దారి అర్జున ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్ ఛేజింగ్ ఎపిసోడ్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌తో టీజ‌ర్ స్టైలిష్‌గా సాగింది.

దేశానికి ఎదురైన రిస్కీ సిట్యూవేష‌న్‌ను ఎదుర్కొనే గూఢ‌చారి అర్జున్‌గా ఈ మూవీలో వ‌రుణ్‌తేజ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు. అత‌డికి అసిస్టెంట్‌గా ఉండ‌లేను...అత‌డితో వ‌ర్క్ చేయ‌డం చాలా క‌ష్టం అంటూ వ‌రుణ్‌తేజ్ గురించి హీరోయిన్ చెబుతోన్న డైలాగ్ ఈ టీజ‌ర్‌లో హైలైట్‌గా నిలుస్తోంది.

ఈ ప‌రిస్థితుల్లో అర్జున్‌ను మాత్ర‌మే న‌మ్మ‌గ‌ల‌ను అంటూ ఓ వ్య‌క్తి చెప్ప‌గానే స్టైలిష్ లుక్‌లో టీజ‌ర్‌లో వ‌రుణ్‌తేజ్ ఎంట్రీ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. కొన్ని ల‌క్ష‌ల కోట్ల వ్యాపారం ఇది అంటూ నాజ‌ర్ చెప్పే టీజ‌ర్‌లోని డైలాగ్ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సినిమాలో మెయిన్ పాయింట్ ఏమిట‌న్న‌ది రివీల్ కాకుండా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లో టీజ‌ర్‌ను క‌ట్ చేశారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది.

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ మూవీగా గాంఢీవ‌దారి అర్జున తెర‌కెక్కుతోంది. యూరోపియ‌న్ కంట్రీస్‌తో పాటు యూఎస్ఏలోని డిఫ‌రెంట్ లొకేష‌న్స్‌లో ఈ మూవీని షూట్ చేశారు. ఇందులో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎఫ్ 3 స‌క్సెస్ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న మూవీ ఇది. మ‌రోవైపు నాగార్జున ది ఘోస్ట్ ను తెర‌కెక్కించిన ప్ర‌వీణ్ స‌త్తారు మ‌రోసారి యాక్ష‌న్ క‌థ‌ను న‌మ్ముకొని గాంఢీవ‌ధారి అర్జున సినిమా చేస్తోన్నాడు.