Kalki 2898ad Release Date: ప్ర‌భాస్ క‌ల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? - అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?-kalki 2898 ad release date prabhas superhero movie arriving on theaters on june 27th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898ad Release Date: ప్ర‌భాస్ క‌ల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? - అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

Kalki 2898ad Release Date: ప్ర‌భాస్ క‌ల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? - అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 27, 2024 08:04 AM IST

Kalki 2898ad Release Date: ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ
ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ

Kalki 2898ad Release Date: ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీ వాయిదాప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు కొత్త రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. నాగ్ అశ్విన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా క‌ల్కి కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ డైరెక్ట‌ర్ బ‌ర్త్‌డే రోజు క‌ల్కికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో అభిమానులు డిస‌పాయింట్ అయ్యారు.

కొత్త రిలీజ్ డేట్ ఇదే...

తాజాగా క‌ల్కి రిలీజ్ డేట్‌కు సంబంధించి కొత్త వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌ల్కి 2898ఏడీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 27న (నేడు) అఫీషియ‌ల్‌గా సినిమా యూనిట్ అనౌన్స్‌చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌...

సూప‌ర్ హీరో క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ల్కి మూవీతోనే దీపికా ప‌డుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

క‌ల్కి అవ‌తారం స్ఫూర్తితో...

పురాణాల్లోని క‌ల్కి అవ‌తారం గాథ‌ నుంచి స్ఫూర్తి పొందుతూ మోడ్ర‌న్ స్టైల్‌లో హాలీవుడ్‌కు ధీటుగా డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా క‌ల్కి తెర‌కెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీని షూట్ చేశారు. త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డంతో పాటు ఇంగ్లీష్ భాష‌ల్లోకి డ‌బ్ చేసి విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

బాక్సాఫీస్ రికార్డులు...

స‌లార్ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తోన్న క‌ల్కి మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాక్సాఫీస్ ప‌రంగా ఇండియ‌న్ సినిమా రికార్డ‌ల‌న్నింటిని క‌ల్కి అధిగ‌మించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో భైర‌వ అనే పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతుండ‌గా...అశ్వ‌త్థామ‌గా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్నారు. క‌ల్కి కోసం క‌మ‌ల్‌హాస‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్‌ విల‌న్‌గా మార‌డం ద‌క్షిణాది వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌ల్కి మూవీకి ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు.

స‌లార్ సీక్వెల్‌...

డిసెంబ‌ర్ రిలీజైన ప్ర‌భాస్ స‌లార్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 600 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది. స‌లార్ 2 శౌర్యంగ‌ప‌ర్వం పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాదే సెట్స్‌పైకి రానుంది. స‌లార్ సీక్వెల్‌తో పాటు డైరెక్ట‌ర్ మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. రాజా సాబ్ ఈ ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. కల్కి రిలీజ్ తర్వాతే రాజా సాబ్ విడుదల తేదీని వెల్లడిస్తారని సమాచారం.

IPL_Entry_Point