Teja Sajja Mirai: మ‌రోసారి సూప‌ర్ హీరోగా తేజా స‌జ్జా - మిరాయ్ గ్లింప్స్ వ‌చ్చేసింది - రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు!-teja sajja mirayi glimpse unveiled historical super hero movie hit the screen on 2025 april 18th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Teja Sajja Mirai: మ‌రోసారి సూప‌ర్ హీరోగా తేజా స‌జ్జా - మిరాయ్ గ్లింప్స్ వ‌చ్చేసింది - రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు!

Teja Sajja Mirai: మ‌రోసారి సూప‌ర్ హీరోగా తేజా స‌జ్జా - మిరాయ్ గ్లింప్స్ వ‌చ్చేసింది - రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు!

Nelki Naresh Kumar HT Telugu
Apr 18, 2024 01:02 PM IST

Teja Sajja Mirai: హ‌నుమాన్ త‌ర్వాత మిరాయ్ పేరుతో హీరో తేజా స‌జ్జా పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోన్నాడు. మిరాయ్ వీడియో గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు.

తేజా స‌జ్జా
తేజా స‌జ్జా

Teja Sajja Mirai: హ‌నుమాన్ త‌ర్వాత మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజా స‌జ్జా. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

మిరాయ్ అనౌన్స్‌మెంట్ వీడియో గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ఈ 18న మిరాయ్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ గ్లింప్స్‌లో పోరాట‌యోధుడిగా తేజా స‌జ్జా క‌నిపిస్తోన్నాడు. మిరాయ్ మూవీకి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మిస్తున్నాడు.

చారిత్ర‌క అంశాల‌తో...

చారిత్ర‌క అంశాల‌తో ఈ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా మారింది. అన‌గ‌న‌గా ఓ సామ్రాట్‌...సామ్రాట్ అశోక్‌...చ‌రిత్ర‌లో మ‌ర‌క‌గా మిగిలిన అత‌డి క‌ళింగ‌యుద్ధం అనే డైలాగ్‌తో ఆస‌క్తిక‌రంగా ఈ గ్లింప్స్ ప్రారంభ‌మైంది.

ఆ ప‌శ్చాత్తాపం నుంచి నుంచి వెలుగు చూసిన ఓ దేవ ర‌హ‌స్యం...అదే మ‌నిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం...త‌రాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది యోధుల నియామ‌కం...అలాంటి జ్ఞానానికి చేరువ అవుతోన్న ఓ గ్ర‌హ‌ణం...ఆ గ్ర‌హ‌ణాన్ని కాపాడే ఓ జ‌న‌నం అంటూ ఓ బుద్ధిస్ట్ మాంక్ చెప్పిన డైలాగ్‌తో యోధుడిగా ఈ గ్లింప్స్‌లో తేజా స‌జ్జా ఎంట్రీ ఇవ్వ‌డం హైలైట్‌గా అనిపిస్తోంది.

యుద్ధాలు, యాక్ష‌న్ సీక్వెన్‌ల‌తో ఈ గ్లింప్స్ విజువ‌ల్ వండ‌ర్‌గా క‌నిపిస్తోంది. ఈ గ్లింప్స్‌లోని విజువ‌ల్స్‌, లొకేష‌న్స్‌, బీజీఎమ్ గూస్ బంప్స్‌ను క‌లిగిస్తోన్నాయి. యుద్ధ‌వీరుడిగా తేజా స‌జ్జా లుక్‌, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోతున్నాయి. సూప‌ర్ హీరో త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో తేజా స‌జ్జా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

సూప‌ర్ యోధ క్యాప్ష‌న్‌...

జ‌పాన్ ఫాంట్‌లో మిరాయ్ అనే టైటిల్‌ను రివీల్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. మిరాయ్ అన‌గా భ‌విష్య‌త్తు అని అర్థం. మిరాయ్ టైటిల్ కింద ఉన్న సూప‌ర్ యోధ అనే క్యాప్ష‌న్ కూడా ఆక‌ట్టుకుంటోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఆయా భాష‌ల‌కు చెందిన గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. 2డీతో పాటు త్రీడీలో మిరాయ్ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. మిరాయ్‌లో రితికా నాయ‌క్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రితికానాయ‌క్‌. తెలుగులో ఆమె చేస్తోన్న సెకండ్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

మంచు మ‌నోజ్ విల‌న్‌...

మిరాయ్ మూవీలో మంచు మ‌నోజ్ విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌డి రోల్‌ను గ్లింప్స్‌లో చూపించ‌లేదు. మేక‌ర్స్ కూడా విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ప్ర‌క‌టించ‌లేదు. మంచు మ‌నోజ్‌తో పాటు మ‌ల‌యాళం స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. మిరాయ్ మూవీకి హ‌నుమాన్ ఫేమ్ హ‌రి గౌర మ్యూజిక్ అందిస్తున్నాడు.

హనుమాన్ కలెక్షన్స్…

తేజా స‌జ్జా గ‌త సినిమా హ‌నుమాన్ పాన్ ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 330 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

IPL_Entry_Point