Prasanth Varma: ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ మూవీ - హ‌నుమాన్‌కు మించి ఐదింత‌ల బ‌డ్జెట్-prasanth varma to team up with ranveer singh for big budget bollywood movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma: ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ మూవీ - హ‌నుమాన్‌కు మించి ఐదింత‌ల బ‌డ్జెట్

Prasanth Varma: ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ మూవీ - హ‌నుమాన్‌కు మించి ఐదింత‌ల బ‌డ్జెట్

Nelki Naresh Kumar HT Telugu
Apr 17, 2024 12:26 PM IST

Prasanth Varma: హ‌నుమాన్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ఓ మూవీ చేయ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు తెలిసింది.

Prasanth Varma
Prasanth Varma

Prasanth Varma: హ‌నుమాన్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వర్మ‌. కేవ‌లం న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ తెలుగు మూవీ 330 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి స‌త్తాచాటింది. భ‌క్తి ఎలిమెంట్‌కు సూప‌ర్ హీరో పాయింట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించారు. హ‌నుమాన్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ టేకింగ్‌,మేకింగ్‌తో పాటు తేజా స‌జ్జా యాక్ష‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు...

హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు స్టార్ హీరోలు సిద్ధ‌మ‌వుతోన్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్ నుంచి ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. తాజాగా ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ర‌ణ్‌వీర్‌సింగ్‌తో...

బాలీవుడ్ స్టార్‌హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్ సినిమా చూసి ర‌ణ్‌వీర్‌సింగ్ ఇంప్రెస్ అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ఓ సినిమా చేయ‌డానికి ఇంట్రెస్ట్‌ను చూపుతున్న‌ట్లు మాచారం. హ‌నుమాన్ త‌ర‌హాలోనే మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో పీరియాడిక‌ల్ డ్రామాగా ర‌ణ్‌వీర్‌సింగ్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

200 కోట్ల బడ్జెట్…

ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపు 200 కోట్ల‌కుపైనే ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ స్థాయిలో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ భారీ బ‌డ్జెట్ మూవీ గురించి ర‌ణ్‌వీర్‌సింగ్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ ప‌లుమార్లు క‌లిసిన‌ట్లు స‌మాచారం. ర‌ణ్‌వీర్‌సింగ్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ మూవీపై తొంద‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

జై హ‌నుమాన్‌...

ప్ర‌స్తుతం హ‌నుమాన్‌కు సీక్వెల్‌గా జై హ‌నుమాన్ అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఈ సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో ఓ స్టార్ హీరో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. తేజా స‌జ్జా కూడా గెస్ట్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. మార్వెల్ త‌ర‌హాలో హ‌నుమాన్ మూవీని ఫ్రాంచైజ్‌లా తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ ఉన్నాడ‌ని అంటున్నారు.

శ్రీరామ‌న‌వ‌మి కానుక‌గా...

శ్రీరామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకొని బుధ‌వారం జైహ‌నుమాన్ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీరాముడి చేయిని హ‌నుమంతుడు ప‌ట్టుకున్న‌ట్లుగా చూపించారు. హ‌నుమంతుడికి చేయికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు, గాయాలు ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లోనే జై హ‌నుమాన్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. లాంఛింగ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నాని సినిమాతో...

హీరో నాని నిర్మించిన అ! సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ క‌ల్కి, తేజా స‌జ్జాతో జాంబీరెడ్డి సినిమాలు చేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. జాంబీరెడ్డి హిట్ట‌యింది. తాజాగా హ‌నుమాన్ స‌క్సెస్‌తో పాన్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు.

IPL_Entry_Point