VD12 Update: వంద కోట్ల బ‌డ్జెట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ - గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ - ప్రొడ్యూస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌-vd 12 update vijay deverakonda gowtam tinnanuri movie budget revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vd12 Update: వంద కోట్ల బ‌డ్జెట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ - గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ - ప్రొడ్యూస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

VD12 Update: వంద కోట్ల బ‌డ్జెట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ - గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ - ప్రొడ్యూస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

HT Telugu Desk HT Telugu
Oct 03, 2023 06:46 AM IST

VD12 Update: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్ననూరి సినిమా బ‌డ్జెట్‌ను నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రివీల్ చేశాడు. వంద కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శ్రీలీల‌
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శ్రీలీల‌

VD12 Update: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో ఓ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీడీ 12 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా బ‌డ్జెట్‌పై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. వంద‌కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో విజ‌య్‌, గౌత‌మ్ తిన్న‌నూరి మూవీని తెర‌కెక్కిస్తున్నామ‌ని తెలిపాడు.

డైరెక్ట‌ర్‌ గౌత‌మ్ తిన్న‌నూరితో పాటు జోన‌ర్‌పై ఉన్న న‌మ్మ‌కంతో బ‌డ్జెట్‌ విష‌యంలో రాజీప‌డ‌టం లేద‌ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ చెప్పాడు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడ‌ని, త‌న మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌, షేఫ్ మార్చే కెపాసిటీ అనిరుధ్‌కు ఉంద‌ని తెలిపాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న పాపులారిటీ, క్రేజ్‌కు సినిమా కు హిట్ అనే టాక్ వ‌స్తే స‌రిపోతుంద‌ని... రెవెన్యూ ఎంతైనా రాబ‌ట్టే స్టామినా అత‌డికి ఉంద‌ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అన్నాడు.

శ్రీలీల‌నే హీరోయిన్… ర‌ష్మిక కాదు...

మ‌రోవైపు డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ నుంచి శ్రీలీల త‌ప్పుకున్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె స్థానాన్ని ర‌ష్మిక మంద‌న్న‌తో భ‌ర్తీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ పుకార్ల‌ను ప్రొడ్యూస‌ర్ కొట్టిప‌డేశాడు. శ్రీలీల ఈ సినిమా నుంచి వైదొలిగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నాడు. ర‌ష్మిక మంద‌న్న‌ను హీరోయిన్‌గా తీసుకున్నామ‌నే వార్త‌లు అబ‌ద్ధ‌మ‌ని చెప్పాడు. ప్రస్తుతం వీడీ 12 మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.