Hanuman OTT Official: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన.. ఇంకాస్తా లేటుగా స్ట్రీమింగ్-hanuman movie ott streaming on zee5 from march 8 officially announced teja sajja hanuman ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott Official: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన.. ఇంకాస్తా లేటుగా స్ట్రీమింగ్

Hanuman OTT Official: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన.. ఇంకాస్తా లేటుగా స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu
Published Mar 01, 2024 12:31 PM IST

Hanuman OTT Streaming Date: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించింది సదరు డిజిటల్ ఫ్లాట్ ఫామ్.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన.. ఇంకాస్తా లేటుగా స్ట్రీమింగ్
హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన.. ఇంకాస్తా లేటుగా స్ట్రీమింగ్

Hanuman OTT Official Release Date: చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారాడు తేజ సజ్జా. మెగాస్టార్ చూడాలని ఉంది సినిమాలో బాల నటుడిగా ఆకట్టుకున్న తేజ సజ్జా ఆ తర్వాత ఎంతోమంది అగ్ర హీరోల పక్కన నటించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంద్ర మూవీలో చిన్నప్పటి చిరంజీవిగా అదరగొట్టాడు. మెగాస్టార్‌తో పాటు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించిన తేజ అద్భుతం సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

స్టార్ హీరోలతో పోటీ

అనంతరం ఇష్క్, జాంబీ రెడ్డి సినిమాలతో ఆకట్టుకున్న తేజ సజ్జా హనుమాన్ మూవీతో ఏకంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బాలనటుడిగా ఎవరితో అయితో తేజ నటించాడో వారితోనే ఈ ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా నిలిచాడు. జనవరి 12న తేజ సజ్జా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా విడుదలైంది. అలాగే వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలు కూడా తర్వాత రిలీజయ్యాయి.

పాన్ వరల్డ్ మూవీగా

వీటన్నింటిలో హనుమాన్ మూవీనే భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ పొంది భారీ విజయం సాధించింది. తెలుగుతోపాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లో రిలీజ్ చేసిన పాన్ వరల్డ్ మూవీగా రిలీజైన హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఇప్పుడు మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మార్చి 1నే రిలీజ్, కానీ

అయితే, హనుమాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇక హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అప్పటికీ ప్రేక్షకులు థియేటర్‌లలో హనుమాన్‌ను చూడటంతో మార్చి నెలకు వాయిదా వేశారు. మొదట మార్చి 1 లేదా 2వ తారీఖున హనుమాన్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

శివరాత్రి, మహిళా దినోత్సవం

దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ రెండు తేదీలు కాకుండా మరో తేదీని అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ. హనుమాన్ మూవీని ఇంకాస్తా లేటుగా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది జీ5. మార్చి 8న మహాశివరాత్రి పండుగతోపాటు ఆరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వీటి సందర్భంగా ఆరోజు నుంచి ఓటీటీలో హనుమాన్ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది జీ5.

11 కోట్లకు తెలుగు వెర్షన్

ఇదిలా ఉంటే, హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు భారీ ధరకు జీ5 కొనుగోలు చేసినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇన్ సైడ్ టాక్. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వచ్చినట్లు ఇదివరకు ప్రచారం జరిగింది. కాగా హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేస్తే వినయ్ రాయ్ విలన్‌గా చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

Whats_app_banner