Jai Hanuman: అయోధ్యతోపాటు మిగతా ఆలయాలకు విరాళం.. జై హనుమాన్ వంద రెట్లు ఉంటుంది: ప్రశాంత్ వర్మ-prasanth varma about jai hanuman in hanuman gratitude meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jai Hanuman: అయోధ్యతోపాటు మిగతా ఆలయాలకు విరాళం.. జై హనుమాన్ వంద రెట్లు ఉంటుంది: ప్రశాంత్ వర్మ

Jai Hanuman: అయోధ్యతోపాటు మిగతా ఆలయాలకు విరాళం.. జై హనుమాన్ వంద రెట్లు ఉంటుంది: ప్రశాంత్ వర్మ

Sanjiv Kumar HT Telugu
Jan 28, 2024 11:41 AM IST

Prasanth Varma About Jai Hanuman Movie: జై హనుమాన్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్‌‌లో జై హనుమాన్ గురించి ప్రశాంత్ వర్మ కామెంట్స్ చేశాడు. హనుమాన్ మూవీ కంటే వంద రెట్లు ఎక్కువగా జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ తెలిపాడు.

అయోధ్యతోపాటు మిగతా ఆలయాలకు విరాళం.. జై హనుమాన్ వంద రెట్లు ఉంటుంది: ప్రశాంత్ వర్మ
అయోధ్యతోపాటు మిగతా ఆలయాలకు విరాళం.. జై హనుమాన్ వంద రెట్లు ఉంటుంది: ప్రశాంత్ వర్మ

Prasanth Varma Hanuman Gratitude Meet: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించించి ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్‌ని నిర్వహించింది. హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాస్ మహారాజా రవితేజకు థ్యాంక్స్ చెబుతూ ఆయన ఒప్పుకుంటే సినిమాటిక్ యూనివర్స్‌లో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. హనుమాన్ మూవీలో చేసిన కోతి పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. అదే పాత్రతో సినిమా చేయాలని ఉన్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

ఇంకా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. "హనుమాన్ సినిమాకు శివేంద్ర గారి వర్క్ చేయడం మంచి అనుభూతి. వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. వీఎఫ్ ఎక్స్ టీమ్స్‌కు ధన్యవాదాలు. నాగేంద్ర గారు అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ చేశారు. కృష్ణ శౌరబ్ సిస్టర్ సెంటిమెంట్ పాటని అద్భుతంగా చేశారు. అనుదీప్ దేవ్, హరి గౌర చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా విజయం కోసం పని చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. డైరెక్షన్, రైటింగ్ టీంకి థాంక్స్" అని తెలిపాడు.

"ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్‌లో ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌ని పరిచయం చేయాలనేది మా ఉద్దేశం. ఫిల్మ్ మేకింగ్ చాలా కష్టమైన పని. ఒక విజయం చాలా మంది జీవితాలకు ఫుడ్ పెడుతుంది. ఎన్నో క్లోజింగ్ థియేటర్స్ ఈ సినిమా వలన ఓపెన్ అయ్యాయని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మూడో వారంలో కూడా హౌస్ ఫుల్ బోర్డ్ చూడటం ఒక ఫిలిం మేకర్‌కి గొప్ప తృప్తిని ఇస్తుంది. మా టీం హార్డ్ వర్క్‌తో పాటు హనుమంతుల వారి ఆశీస్సులు ఈ చిత్రంపై ఉన్నాయి" అని ప్రశాంత్ వర్మ అన్నాడు.

"మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌కి థాంక్స్. హనుమాన్‌కి సంబధించి చాలా వేడుకలు ఉండబోతున్నాయి. యాభై రోజుల వేడుకలో సినిమాకి పని చేసిన అందరికీ గిఫ్ట్స్ ఉండబోతున్నాయి. ప్రేక్షకులు హనుమాన్ సినిమాని ఒక దేవాలయంగా ఫీలౌతున్నారు. ప్రేక్షకులకు తెలియకుండానే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరానికి ఐదు రూపాయిలు డొనేట్ చేస్తున్నారు. ఇది నిర్మాత నిరంజన్ గారి వలనే సాధ్యపడింది. అయోధ్యతో పాటు మిగతా ఆలయాలకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు" అని ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

"హనుమాన్ సినిమా నుంచి వస్తున్న లాభాలు దేవులవారికి, సినిమాలు తీయడానికే ఖర్చుపెడతాం. హనుమాన్ ఇంకా చాలా రోజులు ఆడుతుంది. ఈ సినిమాలో పని చేసిన 24 విభాగాల వారికీ పేరుపేరునా ధన్యవాదాలు. మాకు ఎంతగానో ప్రోత్సహించిన మీడియాకు ధన్యవాదాలు. ఈ సినిమా విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు. సినిమాని వెన్నుముకలా నడిపించిన హనుమంతుల వారికీ రాముల వారికి ప్రేక్షకులకు ఈ విజయాన్ని ఆపాదిస్తున్నాను" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.

"మీ అందరి రుణం జై హనుమాన్‌తో తీర్చుకోబోతున్నాను. జై హనుమాన్ మూవీ హను మాన్‌కి వందరెట్లు ఉండబోతుంది. ఇంటర్ నేషనల్‌లో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్‌కి వచ్చి చూసే సినిమాల్లా చాలా బాధ్యతగా తీస్తాను. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యతను పెంచింది. మంచి సినిమాలు తీసి పరిశ్రమ మేలుకు నా వంతు కృషి చేస్తాను. జై శ్రీరామ్.. జై హనుమాన్" అని ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

IPL_Entry_Point