Prabhas: శంకర్ డైరెక్షన్‌లో ప్రభాస్, కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్ చేయాల్సిన మూవీ ఎందుకు ఆగిపోయిందంటే?
Prabhas Kamal Haasan: కల్కి కంటే ముందు కమల్‌హాసన్, ప్రభాస్ కలిసి ఓ భారీ బడ్జెట్ మూవీ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ మూవీ ఆగిపోయింది. ఆ సినిమా ఏదంటే?
Prabhas Kamal Haasan: ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి మూవీలో కమల్‌హాసన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సూపర్ హీరో మూవీలో ప్రభాస్ హీరోయిజానికి ధీటుగా కమల్ విలనిజం ఉంటుందని అంటున్నారు. దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు.భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ కల్కి మూవీ రిలీజ్ కాబోతోంది. మే9న కల్కి 2898 ఏడీని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కల్కి కంటే ముందు...
కాగా కల్కి కంటే ముందు కమల్‌హాసన్, ప్రభాస్ కలిసి ఓ పాన్ ఇండియన్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కాంట్రవర్షీయల్ స్టోరీ కావడంతో ఈ మూవీని నిర్మించడానికి ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో సినిమా ఆగిపోయింది. 2008లో తలైవాన్ ఇరుక్కిరాన్ పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీని స్వీయ దర్శకత్వంలో కమల్‌హాసన్ అనౌన్స్‌చేశాడు.
ఈ సినిమాలో మోహన్‌లాల్, వెంకటేష్, రిషికపూర్‌తో పాటు తాను కూడా హీరోగా నటించబోతున్నట్లు కమల్‌హాసన్ వెల్లడించాడు. ఏఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. త్రిష, శ్రియా సరన్ హీరోయిన్లుగా నటించనున్నట్లు కమల్‌హాసన్ ప్రకటించాడు. అనివార్య కారణాల వల్ల ప్రీ ప్రొడక్షన్ పనులతోనే ఈ మూవీ ఆగిపోయింది.
జాకీచాన్ కూడా...
ఆ తర్వాత 2012 మరోసారి తలైవాన్ ఇరుక్కిరాన్ కథను సిల్వర్‌స్క్రీన్‌పైకి తీసుకురావాలని కమల్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో సక్సెస్ అందుకున్న ప్రభాస్‌ను ఓ హీరోగా ఫైనలైజ్ చేశాడు. ఇతర కీలక పాత్రల కోసం సల్మాన్ ఖాన్‌తో పాటు హాలీవుడ్ స్టార్‌హీరో జాకీచాన్‌ను తీసుకోవాలని కమల్ ప్రయత్నాలు చేశాడు. డైరెక్టర్‌గా శంకర్ పేరు తెరపైకి వచ్చింది. అమర్ హై అంటూ ఈ సినిమా హిందీ టైటిల్‌ను కూడా కమల్ అనౌన్స్‌చేశాడు.
పొలిటికల్ అంశాలతో…
పాలిటిక్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో పాటు అండర్‌వరల్డ్ మాఫియాను టచ్ చేస్తూ ఈ మూవీ ఉంటుందని స్టోరీ లైన్ గురించి కమల్ అప్పట్లో వెల్లడించారు. కానీ అప్పటిరాజకీయాలపై సెటైర్స్ వేస్తూ కమల్ హాసన్ రాసిన ఈ కథను నిర్మించడానికి ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాలేదు. తలైవాన్ ఇరుక్కిరాన్‌ను తెరపైకి తీసుకురావడానికి చాలా ఏళ్ల పాటు కమల్ ప్రయత్నించాడు. కానీ అవేవి వర్కవుట్ కాకకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేశాడు కమల్. కమల్‌హాసన్, ప్రభాస్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసే ఛాన్స్ అప్పుడు మిస్సయినా కల్కితో అది తీరబోతుంది.
దీపికా పడుకోణ్ హీరోయిన్…
కల్కిలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్‌బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కల్కితోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
కల్కి 2898 ఏడీ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తోన్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ 180 కోట్ల వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. 200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో రిలీజై కల్కి రికార్డులు క్రియేట్ చేయబోతున్నట్లు చెబుతోన్నారు.