GoudSaab Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ప్ర‌భాస్ క‌జిన్ - గౌడ్ సాబ్ మూవీ లాంఛ్ - ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశీస్సుల‌తో షురూ-prabhas cousin virat raj to make his tollywood debut with goud saab movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Goudsaab Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ప్ర‌భాస్ క‌జిన్ - గౌడ్ సాబ్ మూవీ లాంఛ్ - ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశీస్సుల‌తో షురూ

GoudSaab Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ప్ర‌భాస్ క‌జిన్ - గౌడ్ సాబ్ మూవీ లాంఛ్ - ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశీస్సుల‌తో షురూ

Nelki Naresh Kumar HT Telugu
Apr 10, 2024 10:02 AM IST

GoudSaab Movie: ప్ర‌భాస్ క‌జిన్ విరాట్‌రాజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గౌడ్‌సాబ్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. బుధ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

విరాట్‌రాజ్ గౌడ్‌సాబ్ మూవీ
విరాట్‌రాజ్ గౌడ్‌సాబ్ మూవీ

GoudSaab Movie: టాలీవుడ్‌లోకి వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డం కొత్తేమీ కాదు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చాలా మంది వార‌స‌త్వం ట్యాగ్‌తోనే హీరోలుగా మారారు. తాజాగా ప్ర‌భాస్ ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త వార‌సుడు టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌భాస్ క‌జిన్ విరాట్‌రాజ్ హీరోగా మారాడు. గౌడ్‌సాబ్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. బుధ‌వారం లాంఛ‌నంగా ఈ మూవీ మొద‌లైంది.

గౌడ్‌సాబ్ మూవీతో కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ మాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతోన్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ కూడా ఓపెనింగ్ ఈవెంట్‌కు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ వారు వేడుక‌కు హాజ‌రుకాలేదు. ప‌వ‌న్ అశీస్సుల‌తో ఈ మూవీ మొద‌లైన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

టైటిల్ పోస్ట‌ర్‌...

గౌడ్ సాబ్ టైటిల్ పోస్ట‌ర్‌ను సుకుమార్ లాంఛ్ చేశాడు. పాత‌గోడ‌పై గౌడ్‌సాబ్ అని పేరు రాసి ఉండ‌టం, పార్క్ చేసి ఉన్న పాత బైక్‌పై అమ్మాయి ఓణి వాలుతున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్‌లో చూపించారు. గౌడ్‌సాబ్ మూవీ టైటిల్‌తో పాటు పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ అంశాల‌తో పాటు బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ కూడా ఉంటుంద‌ని తెలిపారు. త్వరలోనే గౌడ్ సాబ్ మూవీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.

కొత్త హీరోయిన్…

ఈ సినిమాలో విరాట్‌రాజ్ రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని, హీరోగా అత‌డికి మంచి డెబ్యూ మూవీ అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. గౌడ్ సాబ్ మూవీతో కొత్త హీరోయిన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరోయిన్ తో పాటు మిగిలిన నటీనటుల పేరును త్వరలోనే అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.

వెంగీ మ్యూజిక్‌...

గౌడ్ సాబ్ మూవీకి వెంగీ మ్యూజిక్ అందిస్తోన్నాడు.ఎస్ఆర్ క‌ళ్యాణ‌మంట‌పం సినిమాను నిర్మించిన రాజు, వెంక‌ట ర‌మ‌ణ‌, సాయికృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

భీమ్లానాయ‌క్‌, అల‌వైకుంఠ‌పుర‌ములో...

ఢీ రియాలిటీ షో ద్వారా ఫేమ‌స్ అయిన గ‌ణేష్ మాస్ట‌ర్ అల వైకుంఠ‌పుర‌ములో, భీమ్లానాయ‌క్‌, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తో పాటు ప‌లు తెలుగు సినిమాలో కొరియోగ్ర‌ఫీ గా ప‌నిచేశాడు. ఏడాది కాలంగా గౌడ్ సాబ్ క‌థ ను గ‌ణేష్ మాస్ట‌ర్ సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point

టాపిక్