Prabhas Hanu Raghavapudi Movie: ప్ర‌భాస్, హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ టైటిల్ ఇదేనా - జోనర్ కన్ఫామ్ చేసిన డైరెక్టర్-prabhas hanu raghavapudi movie titled as fauji genre revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Hanu Raghavapudi Movie: ప్ర‌భాస్, హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ టైటిల్ ఇదేనా - జోనర్ కన్ఫామ్ చేసిన డైరెక్టర్

Prabhas Hanu Raghavapudi Movie: ప్ర‌భాస్, హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ టైటిల్ ఇదేనా - జోనర్ కన్ఫామ్ చేసిన డైరెక్టర్

Nelki Naresh Kumar HT Telugu
Apr 09, 2024 11:54 AM IST

Prabhas Hanu Raghavapudi Movie: ప్ర‌భాస్‌, హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోపై అఫీషియ‌ల్‌గా క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌భాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు హ‌ను రాఘ‌వ‌పూడి తెలిపాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీ ఉంటుంద‌ని చెప్పాడు.

ప్ర‌భాస్‌
ప్ర‌భాస్‌

Prabhas Hanu Raghavapudi Movie: ప్ర‌స్తుతం క‌ల్కి 2898 ఏడీ, రాజాసాబ్ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్‌. వీటితో పాటు స‌లార్ పార్ట్‌2ను అంగీక‌రించాడు. తాజాగా ప్ర‌భాస్ మ‌రో మూవీపై అఫీషియ‌ల్‌గా క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌భాస్ హీరోగా సీతారామం ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్‌స్టోరీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబోపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. దాంతో ఈ మూవీ ఉంటుందో? లేదోన‌నే సందేహం అభిమానుల్లో ఇన్నాళ్లు ఉంది.

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా...

తాజాగా సీతారామం త‌ర్వాత త‌న నెక్స్ట్ మూవీ ప్ర‌భాస్‌తోనే చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి పేర్కొన్నాడు. వ‌రంగ‌ల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఈవెంట్‌కు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఈ ఈవెంట్‌లో ప్ర‌భాస్ సినిమాపై హ‌ను రాఘ‌వ‌పూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ప్ర‌భాస్ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు తెలిపాడు. ఓ చారిత్ర‌క సంఘ‌ట‌న‌తో ముడిప‌డి ఈ క‌థ సాగుతుంద‌ని తెలిపాడు. ప్ర‌భాస్ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే మూడు పాట‌ల కంపోజింగ్ పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించాడు. హ‌ను రాఘ‌వ‌పూడి కామెంట్స్ వైర‌ట్ అవుతోన్నాయి.

టైటిల్ ఇదేనా...

ఈ హిస్టారిక‌ల్ ల‌వ్‌స్టోరీకి ఫౌజీ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. సీతారామం త‌ర‌హాలోనే ప్ర‌భాస్‌, హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ కూడా ఇండియ‌న్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగ‌నున్న‌ట్లు తెలిసింది. ఇందులో ప్ర‌భాస్ ఆర్మీ సోల్జ‌ర్‌ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు.

ఈ ల‌వ్‌స్టోరీలో ప్ర‌భాస్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దుల్క‌ర్ స‌ల్మాన్ గెస్ట్ రోల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టైటిల్‌తో పాటు సినిమా షూటింగ్‌, హీరోహీరోయిన్ల వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

25 కోట్ల బ‌డ్జెట్‌...90 కోట్ల క‌లెక్షన్స్‌...

హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీతారామం మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 25 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 90 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి టేకింగ్‌తో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీతోనే కెరీర్‌లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి.

క‌ల్కి మే 9న రిలీజ్‌...

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న క‌ల్కి 2898 ఏడీ మే 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా తెర‌కెక్కుతోన్న క‌ల్కి మూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. క‌ల్కిలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర చేస్తోన్నాడు.

ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రాజా సాబ్ షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. సూప‌ర్ నాచుర‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. గ‌త డిసెండ‌ర్‌లో రిలీజైన ప్ర‌భాస్ స‌లార్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 600 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

IPL_Entry_Point