Highest Budget Movies: హయ్యెస్ట్ బడ్జెట్ ఇండియన్ మూవీస్ - ఈ లిస్ట్‌లో ఉన్న ప్రభాస్ సినిమాలు ఏవంటే?
Highest Budget Movies: ఇండియా వైడ్‌గా అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన టాప్ 15 సినిమాల లిస్ట్‌లో ప్రభాస్ సినిమాలే ఆరు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
Highest Budget Movies: పాన్ ఇండియన్ కల్చర్ కారణంగా సినిమాల మధ్య భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. తెలుగు సినిమాలు కోలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంటాయి. జవాన్, యానిమల్‌తో పాటు పలు బాలీవుడ్ సినిమాలు తెలుగులో యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రికార్డులు నెలకొల్పాయి.
ప్రేమలు, 2018 వంటి మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయిన ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. పాన్ ఇండియన్ కల్చర్ కారణంగా సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది. స్టార్ హీరో సినిమాల కోసం ప్రొడ్యూర్లు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా సినిమాల కోసం బడ్జెట్ వెచ్చిస్తోన్నారు.
తెలుగు సినిమాలే టాప్...
ఇండియా వైడ్‌గా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఇండియన్ సినిమాల్లో తెలుగు మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్ లిస్ట్‌లో రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ మూవీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
2022లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను దక్కించుకున్న రెండో సినిమాగా నిలిచి చరిత్రను సృష్టించింది.
ప్రభాస్ సినిమాలు ఆరు...
కాగా ఇండియా వైడ్‌గా అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన టాప్ 15 సినిమాల్లో ప్రభాస్ మూవీస్ ఆరు ఉన్నాయి. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఇండియాలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల జాబితాలో ప్రభాస్ ఆదిపురుష్ చోటు దక్కించుకున్నది. రామాయణగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్ లిస్ట్‌లో మూడో స్థానంలో రజనీకాంత్, శంకర్ రోబో 2.ఓ (400 కోట్ల బడ్జెట్), నాలుగో ప్లేస్‌లో రణ్‌భీర్‌కపూర్ బ్రహ్మస్త్ర (375 కోట్లు) ఉన్నాయి.
ఐదో స్థానంలో సాహో...
ఈ జాబితాలో ప్రభాస్ సాహో ఐదో ప్లేస్‌ను దక్కించుకున్నది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ 350 కోట్లకుపైనే బడ్జెట్‌తో రూపొందింది. మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ రాధేశ్యామ్ ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నది. 270 కోట్ల బడ్జెట్‌తో సలార్ 11 ప్లేస్‌ను దక్కించుకోగా...బాహుబలి 2 మూవీ 250 కోట్లతో 12వ స్థానంలో ఉంది.
కల్కి బడ్జెట్ ఆరు వందల కోట్లు...
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న కల్కి మూవీ బడ్జెట్ కూడా దాదాపు ఆరు వందల కోట్లకుపైనే అని నిర్మాణ వర్గాలు చెబుతోన్నాయి. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన టాప్ త్రీ ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా నిలవడం ఖాయమని అంటున్నారు. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తోన్నాడు. అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో దీపికా పడుకోణే హీరోయిన్‌గా నటిస్తోంది.
కల్కి మూవీ మే 8న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ, ఆడియో, శాటిల్ హక్కులు కలిపి దాదాపు మూడు వందల కోట్లకుపైనే అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.