Manjummel Boys Telugu Release: మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రేమలు మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!-manjummel boys telugu dubbing release date confirmed can repeat premalu magic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys Telugu Release: మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రేమలు మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

Manjummel Boys Telugu Release: మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రేమలు మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

Manjummel Boys Telugu Release: ముంజుమ్మల్ బాయ్స్ చిత్రం తెలుగులో థియేటర్లలోకి రానుంది. మలయాళం రిలీజైన సుమారు నెలన్నర తర్వాత తెలుగులోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదల కానుందంటే..

Manjummel Boys Telugu Release: మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రేమలు మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

Manjummel Boys Telugu Release: మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది. మలయాళ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రం తెలుగు రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రం తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఖరారైంది.

తెలుగు రిలీజ్ డేట్ ఇదే..

మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. డబ్బింగ్ పనులు తుది దశకు వచ్చాయి. దీంతో ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్‍ను ఆ ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. మంజుమ్మల్ బాయ్స్ చిత్రం తెలుగులో ‘ఏప్రిల్ 6వ తేదీన’ థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయంపై నేడు (మార్చి 26) అధికారిక ప్రకటన వచ్చింది.

“మలయాళంలో అత్యధిక గ్రాసింగ్ చిత్రంగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ కానుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ నేడు ట్వీట్ చేసింది. తెలుగు పోస్టర్ కూడా షేర్ చేసింది.

మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రానుందంటూ కొంతకాలంగా సమాచారం వస్తోంది. అయితే, డబ్బింగ్ పనులు ఆలస్యమవుతూ వచ్చాయని టాక్. అందుకే మలయాళంలో రిలీజైన సుమారు నెలన్నర తర్వాత ఈ చిత్రం తెలుగు రానుంది. ఎట్టకేలకు ఏప్రిల్ 6న ఈ చిత్రం తెలుగులో థియేటర్లలో అడుగుపెట్టనుంది.

ప్రేమలు మ్యాజిక్ సాధ్యమేనా..

మలయాళ మూవీ ప్రేమలు.. తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. ఈ లవ్ రొమాంటిక్ కామెడీ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన ప్రేమలు.. మార్చి 8న తెలుగులో విడుదలైంది. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేమలు సినిమా తెలుగులో ఏకంగా రూ.12 కోట్లు సాధించినట్టు అంచనా. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న మలయాళ డబ్బింగ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇక, మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి మంచి బజ్ ఉంది. దీంతో తెలుగులోనూ ఈ మూవీకి మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ప్రేమలు చిత్రం హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలుగులో డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. కాగా, మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ కావటం, యానివర్సల్ సబ్జెక్ట్ కావటంతో తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రేమలు రేంజ్‍లో తెలుగులో వసూళ్లను రాబట్టగలదో లేదో చూడాలి. 

చిదంబరం దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ మూవీ రికార్డులను బద్దలుకొడుతోంది. రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన తొలి మలయాళం మూవీగా చరిత్ర సృష్టించింది. ఇంకా వసూళ్ల జోరు చూపిస్తోంది. తమిళ వెర్షన్ కూడా భారీ వసూళ్లను దక్కించుకుంటోంది.

మంజుమ్మల్ బాయ్స్ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుషీన్ శ్యాం సంగీతం అందించారు.