Asia Cup 2024 Schedule: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది - ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Asia Cup 2024 Schedule: ఆసియా కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. జూలై 19 నుంచి 28 వరకు శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరుగనుంది.
Asia Cup 2024 Schedule: ఆసియా కప్ ఉమెన్స్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. ఈ సారి ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 19 నుంచి జూలై 28 వరకు మొత్తం పది రోజుల పాటు ఆసియా కప్ ఉమెన్స్ టోర్నీ జరుగనుంది. ఈ మ్యాచ్‌లు అన్నింటికి శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, నేపాల్, థాయిలాండ్, మలేషియా... మొత్తం ఎనిమిది జట్లు ఆసియా కప్‌లో పాల్గొననున్నాయి. దాయాది దేశాలు ఇండియా పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్‌తో పాటు యూఏఏ, నేపాల్ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా చోటు దక్కించుకున్నాయి.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
జూలై 19న తొలి మ్యాచ్‌లో ఇండియాతో యూఏఈ, పాకిస్థాన్‌తో నేపాల్ తలపడనున్నాయి. జూలై 21న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జూలై 28న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సారి ఉమెన్స్ ఆసియా కప్ టీ20 ఫార్మెట్‌లో నిర్వహించబోతున్నారు. 2018 ఆసియా కప్‌లో కేవలం ఆరు టీమ్స్ మాత్రమే పాల్గొన్నాయి. 2022లో ఏడు టీమ్స్ బరిలో దిగగా ఈ సారి మరో టీమ్ పెరిగింది. థాయిలాండ్ తొలిసారి ఆసియా కప్ ఆడనుంది.
ఎనిమిదో టైటిల్‌పై గురి...
ఇప్పటివరకు ఉమెన్స్ ఆసియా కప్ ఎనిమిది సార్లు జరిగింది. ఇందులో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడుసార్లు టైటిల్ నెగ్గి చరిత్రను సృష్టించింది. బంగ్లాదేశ్ ఒకసారి టైటిల్ గెలుచుకున్నది. ఆసియా కప్‌లో టీమిండియాకు తిరుగులేని రికార్డ్ ఉండటంతో ఎనిమిదో సారి కూడా టైటిల్ నెగ్గడం ఖాయమని అభిమానులు అంటోన్నారు.
ఆసియా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇండియా బరిలో దిగుతోంది. 2022లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో ఫైనల్‌లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఫైనల్‌లో శ్రీలంక ఇరవై ఓవర్లలో కేవలం 65 పరుగులే చేయగా ఎనిమిది ఓవర్లలోనే టీమిండియా ఈ టార్గెట్‌ను ఛేదించింది.
టాపిక్