Manika Batra Won Bronze Medal: ఆసియా కప్‌లో మనికా బత్రా సంచలనం - బ్రాంజ్ మెడల్ సొంతం
Manika Batra Won Bronze Medal: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో ఇండియన్ ప్లేయర్ మనికా బాత్రా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నది. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించింది.
Manika Batra Won Bronze Medal: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో ఇండియన్ ఉమెన్స్ ప్లేయర్ మనికా బత్రా సంచలనం సృష్టించింది. బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకొని ఈ ఘనతను సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచింది. శనివారం జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో వరల్డ్ సిక్త్స్ ర్యాంకర్ మూడు సార్లు ఆసియా ఛాంపియన్ హిన హయతపై మనికా బాత్రా విజయాన్ని అందుకున్నది.
ట్రెండింగ్ వార్తలు
ఈ గెలుపుతో ఐటీటీఎఫ్ - ఏటీటీయూ ఆసియా కప్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్‌లో మనికా, హిన హయతా గెలుపు కోసం హోరాహోరీగా పోరాడారు.
11 -6, 6 -11, 11-7, 12-10, 4-11, 11 -2 తేడాతో హిన హయతాను మనికా ఓడించింది. ఆసియా కప్ ఫస్ట్ రౌండ్‌లో వరల్డ్ ఏడో నంబర్ ర్యాంకర్‌పై అద్భుత విజయాన్ని సాధించి ప్రశంసలు అందుకున్నది మనికా.
అసమాన విజయాలతోసెమీస్ చేరుకున్నది. కానీ సెమీఫైనల్‌లో మిమా ఇటో చేతిలో పరాజయం పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకొని బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో సత్తా చాటింది.