Prabhas Kalki 2898 AD: ప్ర‌భాస్ క‌ల్కి.. మేకిన్ ఇండియా మూవీగా చేయాల‌నుకున్నా కానీ - నాగ్ అశ్విన్ కామెంట్స్ వైర‌ల్‌-nag ashwin interesting comments on prabhas kalki 2898 ad movie vfx and graphics work ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Kalki 2898 Ad: ప్ర‌భాస్ క‌ల్కి.. మేకిన్ ఇండియా మూవీగా చేయాల‌నుకున్నా కానీ - నాగ్ అశ్విన్ కామెంట్స్ వైర‌ల్‌

Prabhas Kalki 2898 AD: ప్ర‌భాస్ క‌ల్కి.. మేకిన్ ఇండియా మూవీగా చేయాల‌నుకున్నా కానీ - నాగ్ అశ్విన్ కామెంట్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 31, 2023 01:26 PM IST

Prabhas Kalki 2898 AD: ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌పై డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మేకిన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకున్నాన‌ని, కానీ కుద‌ర‌లేద‌ని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు.

ప్రభాస్, దీపికా పడుకోణ్
ప్రభాస్, దీపికా పడుకోణ్

Prabhas Kalki 2898 AD: ప్ర‌భాస్ క‌ల్కి గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌పై డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ మొత్తం ఇండియాలోనే చేయాల‌ని అనుకున్నామ‌ని, మేకిన్ ఇండియా మూవీగా క‌ల్కి 2898 ఏడీ ను తెర‌కెక్కించాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు.

కానీ క‌థ‌, సినిమా గ్రాఫ్‌తో పాటు ఎక్స్‌పెక్టేష‌న్స్ కార‌ణంగా హాలీవుడ్ కంపెనీస్‌తో క‌లిసి గ్రాఫిక్స్ వ‌ర్క్ చేయాల్సివ‌చ్చింద‌ని తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వ‌ర్క్ ఇండియాలోనే చేశామ‌ని తెలిపాడు యానిమేష‌న్‌, గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ విష‌యంలో భ‌విష్య‌త్తులో హాలీవుడ్ సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపాడు.

హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థ‌లు ఇండియాలోనే ఉన్నాయ‌ని తెలిపాడు. క‌ల్కి 2898 ఏడీ వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ గురించి హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ యానిమేష‌న్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

పురాణాల‌కు యాక్ష‌న్, గ్రాఫిక్స్ హంగుల‌ను మేళ‌వించి క‌ల్కి 2898 ఏడీ సినిమా రూపొందుతోంది. ఇందులో క‌ల్కి అనే సూప‌ర్ హీరో పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు. క‌మ‌ల్‌హాస‌న్‌ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ సంస్థ క‌ల్కి 2898 ఏడీ మూవీని తెర‌కెక్కిస్తోంది. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా క‌ల్కి నిల‌వ‌నుంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రాజెక్ట్ కే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మొద‌లుపెట్టారు. క‌థానుగుణంగా క‌ల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.