Saindhav Hi Nanna Postpone: నాని, వెంక‌టేష్‌ల‌కు ప్ర‌భాస్ షాకిస్తాడా? సైంధ‌వ్‌, హాయ్ నాన్న పోస్ట్‌పోన్ కానున్నాయా?-venkatesh saindhav nani hi nanna will be out in december race if prabhas salaar aims in christmas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Hi Nanna Postpone: నాని, వెంక‌టేష్‌ల‌కు ప్ర‌భాస్ షాకిస్తాడా? సైంధ‌వ్‌, హాయ్ నాన్న పోస్ట్‌పోన్ కానున్నాయా?

Saindhav Hi Nanna Postpone: నాని, వెంక‌టేష్‌ల‌కు ప్ర‌భాస్ షాకిస్తాడా? సైంధ‌వ్‌, హాయ్ నాన్న పోస్ట్‌పోన్ కానున్నాయా?

Nelki Naresh Kumar HT Telugu
Sep 26, 2023 11:18 AM IST

Saindhav Hi Nanna Postpone: ప్ర‌భాస్ స‌లార్ మూవీ డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క్రిస్మ‌స్ బ‌రిలో ప్ర‌భాస్ నిలిస్తే వెంక‌టేష్ సైంధ‌వ్‌, నాని హాయ్‌నాన్న సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

వెంకటేష్ సైంధవ్
వెంకటేష్ సైంధవ్

Saindhav Hi Nanna Postpone: ప్ర‌భాస్ స‌లార్ రిలీజ్ డేట్‌పై స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది. తాజాగా ఈ సినిమా డిసెంబ‌ర్ 22న రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌ నీల్ వైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డిసెంబ‌ర్ 2023 ఎప్ప‌టిలా ఉండ‌దు అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో స‌లార్ డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ కావ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ఫిక్స్ అవుతోన్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మ‌రికొద్ది రోజుల్లో అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది. ఒక‌వేళ డిసెంబ‌ర్ 22న స‌లార్ రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేస్తే...వెంక‌టేష్ సైంధ‌వ్‌, నాని హాయ్ నాన్న‌తో పాటు నితిన్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యాన్ సినిమాల‌ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. హాయ్ నాన్న సినిమాను డిసెంబ‌ర్ 21న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.

డిసెంబ‌ర్ 22న సైంధ‌వ్‌, డిసెంబ‌ర్ 23న నితిన్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యాన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. స‌లార్ క్రిస్మ‌స్ బ‌రిలో నిలిస్తే ఈ మూడు సినిమాల్ని పోస్ట్‌పోన్ చేయ‌డం మిన‌హా మ‌రో మార్గం లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే మ‌రోసారి టాలీవుడ్‌లో రిలీజ్ డేట్స్ విష‌యంలో క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

సంక్రాంతి సినిమాలు కూడా ఫిక్స్ అయిన నేప‌థ్యంలో హాయ్‌నాన్న‌, సైంధ‌వ్‌ల‌కు కొత్త రిలీజ్ డేట్స్ దొర‌క‌డం క‌ష్టంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాంతో స‌లార్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ నిర్మాత‌లు కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. స‌లార్ సినిమాను సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ గ్రాఫిక్స్ వ‌ర్క్ అనుకున్న స్థాయిలో రాక‌పోవ‌డంతో సినిమాను పోస్ట్‌పోన్ చేశారు.

స‌లార్ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతిహాస‌న్, టీనూ ఆనంద్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024