Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ మంగళవారం మూవీ తర్వాత ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మధ్యే మూవీ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా బుధవారం (మే 15) ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు.
పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్ పాత్రలే కాదు.. ఛాలెంజింగ్ పాత్రలను కూడా పోషించగలనని మంగళవారం మూవీ ద్వారా నిరూపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే ఆమె కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న రక్షణ సినిమాలో పాయల్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని బుధవారం (మే 15) మేకర్స్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇవి పూర్తి కాగానే సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టనున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్ లో వచ్చే సినిమాలు ఆసక్తి రేపుతాయి. ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సాగే ఈ మూవీస్ ప్రేక్షకులను ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఇప్పుడీ రక్షణ మూవీ కూడా అలాంటి కథతోనే రాబోతోంది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా రక్షణ తెరకెక్కడం విశేషం.
ఈ మధ్యే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ మెప్పించబోతున్నారు.
రక్షణ టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ తన అభిప్రాయం చెప్పారు. "రక్షణ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది" అని డైరెక్టర్ ప్రణదీప్ ఠాకోర్ తెలిపారు.
"ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని రక్షణ దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ పేర్కొన్నారు.
రక్షణ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛాయాగ్రహణం అనిల్ బండారి, సంగీతం మహతి స్వర సాగర్, సౌండ్ డిజైనర్ జె.ఆర్. ఎతిరాజ్, ఎడిటర్ గ్యారి బి హెచ్, స్టంట్స్ వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైన్ రాజీవ్ నాయర్, రైటర్ తయనిధి శివకుమార్, స్టిల్స్ ఎ. దాస్, పబ్లిసిటీ డిజైనర్ రమాకాంత్, వీఎఫ్ఎక్స్ అలగర్‌సామి, మయాన్- ప్రదీప్ పుడి బాధ్యతలు చేపట్టారు.