Brahmamudi April 25th Episode: దుగ్గిరాల వారసుడిని పరిచయం చేసిన అపర్ణ - అబద్ధం చెప్పిన కావ్య - రుద్రాణి రగడ
Brahmamudi April 25th Episode: రాజ్ చేతుల్లో ఉన్న బిడ్డ ఎవరు అని మీడియా వాళ్లు పదే పదే అడగటంతో తన కొడుకేనని కావ్య బదులిస్తుంది. ఆ బిడ్డ దుగ్గిరాల ఇంటి వారసుడు అని అపర్ణ కూడా అబద్ధం ఆడుతుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi April 25th Episode: రాజ్, కావ్య చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరగకుండా అడ్డుకునేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్ చేస్తారు. అనామికను పావుగా వాడుకుంటుంది రుద్రాణి. ఆమె చెప్పుడు మాటలు నిజమని నమ్మిన అనామిక...రాజ్ వ్యక్తిత్వాన్నిఅవమానిస్తుంది. మరో మాట మాట్లాడితే ఇంటి గడప కూడా తొక్కనివ్వనని ఇందిరాదేవి వార్నింగ్ ఇవ్వడంతో అనామిక సైలెంట్ అవుతుంది.
కనకం సెటైర్...
కనకాన్ని రెచ్చగొట్టి దుగ్గిరాల ఫ్యామిలీపై గొడవకు దిగేలా చేయాలని రుద్రాణి అనుకుంటుంది. నీ అల్లుడు ఓ బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. రేపొద్దున నీ కూతురికి సవతిని తీసుకొచ్చిన కూడా ఏం అడగకుండా సైలెంట్‌గా ఉంటావా అంటూ కనకంతో అంటుంది రుద్రాణి.
ఆస్తి కోసం నీ కూతురికి సవతి వచ్చినా పట్టించుకోవా అని కనకాన్ని అడుగుతుంది రుద్రాణి. ఆస్తి కోసం మొగుడిని వదిలేసి పుట్టింటికి వచ్చి అడుక్కుంటున్నా నీ గతి చూశాకా...నా కూతురికి ఆ గతి పట్టనివ్వను. నువ్వే మాకు ఆదర్శం అని రుద్రాణిపై సెటైర్ వేస్తుంది కనకం.
అనామిక డౌట్...
అక్కడే ఉన్న అనామిక ఆస్తి కోసం నిజంగానే మీ భర్తను వదిలేశారా అంటూ అనుమానంగా రుద్రాణిని అడుగుతుంది. నిజం కాదని చెప్పబోతుంది రుద్రాణి. మీరు వదిలేయకపోతే మరి మావయ్య ఎక్కడున్నాడు సన్యాసుల్లో కలిసిపోయాడా...ఈవిడ చరిత్ర విన్న..చదివిన అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయని రుద్రాణిని అవమానిస్తూ మాట్లాడుతుంది స్వప్న. కనకంతో పాటు స్వప్న మాటలతో రుద్రాణి కోపం పట్టలేకపోతుంది.
రాహుల్ ప్లాన్...
మీడియా వాళ్లను టెంపుల్‌కు రుద్రాణి, రాహుల్ పిలుస్తారు. రాజ్ బిడ్డ గురించి మీడియా ద్వారా బయటపెట్టి దుగ్గిరాల ఫ్యామిలీ పరువు మొత్తం తీయాలని ప్లాన్ చేస్తారు. రాజ్‌కు మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, ఆమె ద్వారానే రాజ్ బిడ్డను కన్నట్లు మీడియా వాళ్లకు చెబుతాడు రాహుల్. దాంతో రాజ్‌కు పుట్టిన బిడ్డ గురించి అతడిని అడగాలని మీడియా వాళ్లు ఎదురుచూస్తుంటారు. వారి ప్లాన్‌ను అప్పు కనిపెడుతుంది. ఈ విషయం కళ్యాణ్‌కు చెబుతుంది.
కళ్యాణ్ కంగారు...
మీ ఇంట్లో వాళ్లే ఎవరో మీడియాకు రప్పించారని, రాజ్‌కు పుట్టిన బిడ్డ గురించిన రహస్యం బయటపెట్టడానికే వచ్చారన్న సంగతి చెబుతుంది. బాబు కారణంగా ఇంటి పరువు పోతే అపర్ణ పెద్దమ్మ రాజ్‌ను అసలు క్షమించదని కళ్యాణ్ కూడా కంగారు పడతాడు. మీడియా వారు అడిగే ప్రశ్నల నుంచి రాజ్‌ను కాపాడేందుకు కళ్యాణ్, అప్పు ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటారు.
అప్పు ఫ్యామిలీకి అవమానం...
కళ్యాణ్ చేయి పట్టుకొని అప్పు క్లోజ్‌గా మాట్లాడటం అనామిక సహించలేకపోతుంది. గుడి అని చూడకుండా నా మొగుడితో సరసాలు ఆడుతున్నావా అంటూ అప్పుపై ఫైర్ అవుతుంది. ఓ అక్కకడుపు అయ్యాక పెళ్లిచేసుకుంది. మరో అక్క సవతి బిడ్డను తెచ్చిన ఆస్తి కోసం సరిపెట్టుకుంటుంది. ఏం బతుకులే మీవి అంటూ అప్పు ఫ్యామిలీని కించపరుస్తుంది.
కళ్యాణ్ సర్ధిచెప్పిన అనామిక వినదు. మీ అన్నయ్య పెళ్లయ్యాక మరో అమ్మాయితో బిడ్డను కన్నాడు. నువ్వు కూడా అప్పుతో బిడ్డను కని భుజాన వెనుకొని తిరుగుతావా అంటూ కళ్యాణ్‌తో అంటుంది అనామిక. ఆమె మాటలతో కోపం పట్టలేకపోతాడు కళ్యాణ్. గట్టిగా ఓ చెంపపై ఒక్కటిస్తాడు. నన్నే కొడతావా ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటానని కోపంగా అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఫ్యామిలీని టార్గెట్ చేయద్దు...
రాహుల్ ప్లాన్‌లో భాగంగా వచ్చిన మీడియా వాళ్లను తమ ఫ్యామిలీని టార్గెట్ చేయద్దని కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాళ్లు మాత్రం కళ్యాణ్ మాటలు వినరు. ఇప్పటివరకు రాజ్ బిడ్డ గురించి మాకు కొన్ని డౌట్స్ ఉండేవి. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్న తీరు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోందని మీడియా వాళ్లు అంటారు. తమ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అడుకోవద్దని అంటే వినకుండా వాళ్లు వెళ్లిపోతారు.
మీడియా ప్రశ్నలు...
రాజ్‌ను తొందరగా గుడి నుంచి తీసుకెళ్లేందుకు కళ్యాణ్ ప్రయత్నిస్తాడు. కానీ మీడియా వాళ్లు వచ్చి వారిని అడ్డుకుంటారు. రాజ్‌కు కళ్యాణం జరిపించే అర్హత లేదని మీ ఇంటి కోడలు గొడవ చేసిందట నిజమేనా అని అడుగుతారు.
మీ బిడ్డ కావ్యకు పుట్టిన బిడ్డ కాదని, మీరు మరొకరితో సంబంధం పెట్టుకున్నారని అంటున్నారు నిజమేనా అని రాజ్‌ను నిలదీస్తారు. మిమ్మల్ని ఆఫీస్ బాధ్యతల నుంచి తొలగించాని అంటున్నారు అని రాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజ్, కావ్య మౌనంగా ఉండిపోతారు.
కళ్యాణ్ సమాధానం...
రాజ్ బదులుగా కళ్యాణ్ మీడియా వాళ్లకు సమాధానమిస్తాడు. మా కుటుంబంలో తప్పు జరిగే అవకాశం లేదని, పుకార్లను నమ్మొద్దని చెబుతాడు. ఒకవేళ మా అన్నయ్య మరో అమ్మాయితో బిడ్డను కంటే ఇంకా మా కుటుంబంలో సభ్యుడిగా ఎలా ఉంటాడు.
సీతారాముల కళ్యాణంలో మా వదిన కూడా అన్నయ్యతో ఎందుకు కూర్చుంటుందని చెబుతాడు. ఆఫీస్‌లో అన్నయ్య స్థానంలో తాను బాధ్యతలు స్వీకరించిన మాట అబద్ధమని అంటాడు. అన్నయ్య కిందనే తాను పనిచేస్తున్నానని చెబుతాడు.అయినా మీడియా వాళ్లు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు.
కనకం బూతులు...
కావ్య ఓపిక నశిస్తుంది. ఉన్నవి లేనట్లు...జరగనివి జరిగినట్లు చాలా కథలు అల్లారు. కానీ ఒక్కటి కూడా ఆధారం లేని ఆరోపణలు అని మీడియా వాళ్లకు చెబుతుంది. తమ కుటుంబం మొత్తం కలిసే ఉందని, ఒకటిగానే ఉందని. అందుకు రుజువు ఈ సీతారాముల కళ్యాణం అని కావ్య మీడియా వాళ్లతో చెబుతుంది.
ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో చెబితే వాళ్ల పని పడతామని కనకం, స్వప్న అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిపై కనకం బూతులు మొదలుపెడుతుంది. ఈ బిడ్డ నాకు, నా భర్తకు పుట్టిన బిడ్డ అని ప్రకటిస్తుంది కావ్య. ఆ చిన్నారి తన కొడుకే అని చెబుతుంది. దుగ్గిరాల కుటుంబానికి వారసుడు అని చెబుతుంది. ఆమె మాటలతో రాజ్‌తో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ షాకవుతారు.
అపర్ణ అబద్ధం...
ఆ బాబు మీ మనవడేనా అపర్ణను గుచ్చిగుచ్చి అడుగుతారు మీడియా వాళ్లు. వారి ప్రశ్నలు భరించలేకపోతుంది అపర్ణ. ఆ బిడ్డ నా మనవడే అని చెబుతుంది. దుగ్గిరాల ఇంటి వారసుడు అని చెబుతుంది. ఆ తర్వాత కోపంగా రాజ్‌వైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నీకు వారం రోజులు గడువు ఇచ్చాను. ఆ గడువులో ఇంక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ రెండు రోజుల్లో ఆ బిడ్డ ఎవరన్నది చెప్పకపోతే కన్న కొడుకు అని చూడకుండా ఇంట్లో నుంచి గెంటేస్తానని రాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.