Brahmamudi April 10th Episode: కావ్యను పుట్టింటికి వెళ్లపోమన్న రాజ్ - ఆఫీస్‌లో అనామిక, స్వప్న రచ్చ - అపర్ణ ఫైర్
Brahmamudi April 10th Episode: వెన్నెల అడ్రెస్ కనిపెట్టి భర్త రాజ్‌ను సమస్యల వలయం నుంచి బయటపడేయాలని కావ్య నిర్ణయించుకుంటుంది. వెన్నెలను కలవడానికి శ్వేత సహయంతో ఓ ప్లాన్ వేస్తుంది కావ్య. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi April 10th Episode: కళ్యాణ్, రాహుల్ ఆఫీస్‌కు వెళ్లడంతో వారి కోసం అనామిక, స్వప్న లంచ్ బాక్స్‌లు సిద్ధం చేస్తుంటారు. ఇద్దరు పోటీపడి క్యారేజీ సైజ్‌లు పెంచేస్తారు. అది చూసి కావ్య షాకవుతుంది. ఆఫీస్‌కు లంచ్ తీసుకెళుతున్నారా? అన్నదానం చేయడానికి వెళుతున్నారా అంటూ సెటైర్స్ వేస్తుంది. మేనేజర్ భార్య అంత పెద్ద బాక్స్ తీసుకెళుతుంటే ఎండీ భార్యను నేను ఎంత పెద్ద క్యారేజీ తీసుకెళ్లాలి అంటూ స్వప్నకు పోటీకి వస్తుంది అనామిక.
నా కంటే నువ్వే లంచ్ బాక్స్‌లో ఎక్కువ అన్నం పెట్టావని స్వప్న బదులిస్తుంది. నువ్వు ఏం తక్కువ కాదు అంటూ అనామిక దెప్పిపొడుస్తుంది. ఇద్దరి గొడవను ఆపుతుంది స్వప్న. మీరు ఇలాగే గొడవలు పడితే కళ్యాణ్, రాహుల్ బయటినుంచి లంచ్ తెప్పించుకుంటారని అంటుంది. దాంతో వాళ్లు హడావిడిగా ఆఫీస్‌కు వెళ్లిపోతారు.
రుద్రాణి సెటైర్స్...
అన్నం మొత్తం స్వప్న, అనామిక తీసుకెళ్లడంతో కావ్యకు తినడానికి ఏం మిగలదు. నీళ్లు తాగి తన రూమ్‌లోకి వెళ్లబోతుంది. రుద్రాణి ఆమెను అడ్డుకుంటుంది. బాలింతరాలివి అంటూ కావ్యపై సెటైర్లు వేస్తుంది రుద్రాణి.
ఒకప్పుడు రాజ్ కోసం ఆఫీస్‌కు క్యారేజీ తీసుకెళ్లేదానికి. ఇప్పుడు స్వప్న, అనామిక క్యారేజీ తీసుకెళితే బాధ అనిపించడం లేదా? రాజ్ ప్లేస్‌లో కళ్యాణ్ కూర్చోవడం నామోషీగా లేదా కావ్యను అడుగుతుంది రుద్రాణి. నా భర్త స్థానం ఎప్పటికీ మారదు. రాముడు రాముడే...భరతుడు భరతుడే ఆ మాట కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు కదా అని రుద్రాణికి బదులిస్తుంది కావ్య.
కావ్య పంచ్...
రాజ్ ఓ బిడ్డను ఇంటికి తీసుకొచ్చిన నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటున్నావో తెలుసుకోవచ్చా అని కావ్యను అడుగుతుంది రుద్రాణి. దిక్కులేక, గతిలేక నేను ఇక్కడ ఉంటున్నానని మీరే అనుకుంటున్నారు కదా...అలాగే అనుకోండి నాకేం ఇబ్బంది లేదని రుద్రాణికి పంచ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. కావ్యతో రుద్రాణి వాదనను దూరం నుంచి రాజ్ చూస్తుంటాడు. కానీ ఏం మాట్లాడలేక సైలెంట్‌గా ఉండిపోతాడు.
శృతిని లైన్‌లో...
ఆఫీస్‌కు వచ్చిన మొదటిరోజే శృతిని లైన్‌లో పడేసేందుకు ప్లాన్స్ వేస్తుంటాడు రాజ్. కానీ అతడికి మాటకు మాట సమాధానం చెప్పి క్యాబిన్ నుంచి జారుకుంటుంది శృతి. వారంలోపు శృతిని తన ఒడిలో పడేలా చేసుకోవాలని రాహుల్ ఫిక్సవుతాడు.
స్వప్న, అనామిక గొడవ...
అప్పుడే లంచ్ బాక్స్‌లు తీసుకొని అనామిక, స్వప్న ఆఫీస్‌లో అడుగుపెడతారు. వారికి ఎదురు వెళ్లిన శృతి స్వప్నను విష్ చేస్తుంది. దాంతో ఎండీ భార్యను నాకు కాకుండా మేనేజర్ భార్యకు ఎందుకు విష్ చేశావని శృతితో గొడవపడుతుంది అనామిక. కిచెన్ గొడవను అనామిక, స్వప్న ఆఫీస్ వరకు తీసుకురావడంతో తలపట్టుకుంటుంది శృతి. కళ్యాణ్ ఎలా పని చేస్తున్నాడని శృతిని అడుగుతుంది అనామిక.
బాగానే చేస్తున్నాడని సమాధానమిస్తుంది. మా ఆయన సంగతి ఏంటి...గోకడంలో ఎక్స్‌పెర్ట్ కదా. నిన్నేమైనా ఏడిపించాడా శృతిని అడుగుతుంది స్వప్న. అవునని శృతి అంటుంది. రాహుల్ బుద్దే అంతా అని శృతితో అంటుంది స్వప్న. రాహుల్ మోసగాడని తెలిసి అతడిని ఎలా పెళ్లిచేసుకున్నారని స్వప్నను అడుగుతుంది శృతి. తప్పక అని మనసులోనే సమాధానం ఇస్తుంది. కానీ బయటకు మాత్రం చెప్పదు.
కళ్యాణ్ సీరియస్...
కళ్యాణ్ ఆఫీస్ వర్క్‌లో మునిగిపోతాడు. క్యారేజీ తీసుకొని అతడి క్యాబిన్‌లోకి అడుగుపెడుతుంది అనామిక. ఆమెను చూసి చిరాకు పడతాడు కళ్యాణ్. కాస్తంత ప్రేమగా మాట్లాడితే ఏం పోతుంది అని కళ్యాణ్ తో అంటుంది అనామిక. మీ కోసం కష్టపడి వంట చేశానని అంటుంది. లైఫ్‌లో అన్ని దొరకవు.
ప్రేమ కావాలంటే పని చేయలేను. పని చేయాలంటే ప్రేమ దొరకదు అంటూ అనామికకు సీరియస్‌గా సమాధానమిస్తాడు. వంట చేయడానికి నువ్వేం పెద్దగా కష్టపడ్డది ఏం లేదని కోపంగా అంటాడు. ఇద్దరు గొడవ పడతారు. గొడవను పక్కనపెట్టి భోజనం చేయమని కళ్యాణ్‌ను అడుగుతుంది అనామిక. తనకు మూడ్ లేదని, ఇప్పుడు తిననని కళ్యాణ్ బదులిస్తాడు.
రాహుల్‌కు క్లాస్...
వచ్చి రావడంతోనే రాహుల్‌పై విరుచుకుపడుతుంది స్వప్న. ఆఫీస్‌లో అడుగుపెట్టి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే అమ్మాయిల జోలికి వెళ్లడం మొదలుపెట్టావా అంటూ క్లాస్ పీకుతుంది. నీకు కొంచెం కూడా సిగ్గులేదా.. మంచి అవకాశం దొరికితే దానిని వాడుకోవడం మానేసి ఈ చిల్లర పనులు ఏంటి? అంటూ రాహుల్ గాలి తీసేస్తుంది.
అప్పుడే అక్కడకు వచ్చిన అనామిక..ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఇప్పటికిప్పుడు మార్చుకోవాలంటే కష్టమే అంటూ రాహుల్‌ను అవమానిస్తుంది. దాంతో రాహుల్ క్యారేజీ తీసుకోకుండా కోపంగా తన క్యాబిన్‌లోకి వెళ్లిపోతాడు. ఆఫీస్‌లోనే స్వప్న, అనామిక గొడవలు పడతారు. ఒకరినొకరు తిట్టుకుంటారు.
రుద్రాణి, ధాన్యలక్ష్మి ఎగతాళి...
రాజ్ తన బిడ్డను ఆడిస్తుంటాడు. అతడిపై ధాన్యలక్ష్మి, రుద్రాణి సెటైర్స్ వేస్తారు. బాబుకు నామకరణం చేశారో లేదో కనుక్కున్నారా అంటూ అపర్ణను ఎగతాళి చేస్తుంది రుద్రాణి.. వాళ్లు జరిపించకపోతే మనం జరిపిద్ధాం అని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ బిడ్డ తల్లి వస్తే కావ్య పరిస్థితి ఏమిటంటావని ధాన్యలక్ష్మిని అడుగుతుంది రుద్రాణి. నచ్చితే కలిసి ఉంటారు.
లేదంటే విడిపోతారని ధాన్యలక్ష్మి సమాధానమిస్తారు. కావ్యకు కోర్టుకు వెళ్లిన వెలుతుందని ధాన్యలక్ష్మి అంటుంది. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్నందుకు రాజ్‌ను అరెస్ట్ చేసినా చేస్తారని అంటుంది. అపర్ణను వినిబడేలానే ఇవన్నీ ఇద్దరు మాట్లాడుతుంటారు. మీరు బంధువులా...రాబందులా అంటూ వారిపై అపర్ణ ఫైర్ అవుతుంది.
వెన్నెల అడ్రెస్ కోసం ప్లాన్...
శ్వేతను కలుస్తుంది కావ్య. రాజ్ కొడుకును తీసుకొని ఇంటికి వస్తాడని ఊహించలేదని శ్వేత అంటుంది. రాజ్ అంటే వెన్నెలకు చాలా ఇష్టమని, వెన్నెల ఫ్యామిలీ కష్టాల్లో ఉండటంతో రాజ్ వారికి సాయం చేశాడని చెబుతుంది. అయితే వెన్నెల ఫ్యామిలీ ఆ తర్వాత కనిపించకుండా పోయిందని కావ్యతో అంటుంది శ్వేత.
వెన్నెల అడ్రెస్ ఎలాగైనా కనిపెట్టాలని కావ్య, శ్వేత ఫిక్సవుతారు. రాజ్‌కు తెలియకుండా వెన్నెల అడ్రెస్ కనిపెట్టాలని అనుకుంటారు. టెన్త్ క్లాస్ మేట్స్ అందరం కలిసి రీయూనియన్ అవుతున్నట్లు ఓ పార్టీ అరెంజ్ చేయమని శ్వేతకు ఐడియా ఇస్తుంది కావ్య. ఆ పార్టీకి వెన్నెల వచ్చే అవకాశం ఉందని కావ్య అంటుంది. కావ్య ఐడియాను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకుంటుంది.
కావ్యకు షాక్...
రాజ్ వల్ల నిజంగా నీకు అన్యాయం జరిగితే ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు. ఈ ఐశ్వర్యం వదులుకోలేకా? అందరూ అనుకుంటున్నట్లు మీ పుట్టింకి గతిలేకా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. రాజ్ కూడా తట్టికే సపోర్ట్ చేస్తాడు. కావ్యను పుట్టింటికి వెళ్లమని అంటాడు. కావ్య అందుకు ఒప్పుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.