Babu No 1 Bull Shit Guy Review: బాబు నెం 1 మూవీ రివ్యూ - బిగ్‌బాస్ అర్జున్ కళ్యాణ్, కుషిత రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
Babu No 1 Bull Shit Guy Review: బిగ్‌బాస్ అర్జున్ కళ్యాణ్, కుషిత జంటగా నటించిన బాబు నెం 1 మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వహించాడు.
Babu No 1 Bull Shit Guy Review:హీరోహీరోయిన్లు - అర్జున్ కళ్యాణ్, కుషిత, లక్ష్మణ్‌వర్మ, సోనాలి పాణిగ్రాహి
నిర్మాత - దండు దిలీప్ కుమార్ రెడ్డి
దర్శకుడు - MLR (లక్ష్మణ వర్మ)
కెమెరామెన్- మణికర్ణన్
సంగీత దర్శకుడు - పవన్
బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు జంటగా... లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. యాక్షన్, కామెడీ, డ్రామాగా శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే...
సొంత ఇంట్లోనే బంధీగా...
కార్తిక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుంటాడు. కరోనా ప్రభావం పెరుగుతోన్న టైమ్‌లో ఇండియాకు వస్తాడు. సిటీకి దూరంగా ఉన్న తమ విల్లాలో తన ప్రియురాలు కుషిత(కుషిత కల్లపు)తో కొన్నాళ్లు సరదాగా గడపాలని కార్తిక్ ప్లాన్ చేస్తాడు. సోంబాబు(లక్ష్మణ్ వర్మ) అనే వ్యక్తి ఎంట్రీ కార్తిక్, కుషిత జీవితాలు మొత్తం తారుమారుఅవుతాయి.
తమ ఇంట్లోనే వారు బంధీలుగా మారాల్సివస్తుంది. కార్తిక్, కుషితలను సోంబాబు ఎందుకు కిడ్నాప్ చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు కార్తిక్ ఏం చేశాడు? వారి ప్రయత్నం ఫలించిందా? లేదా? ఫ్లంబర్‌గా అడుగుపెట్టిన సోంబాబు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడుఅన్నదే ఈ సినిమా కథ.
క్రైమ్ కామెడీ మూవీ...
కిడ్నాప్ డ్రామా చుట్టూ అల్లుకున్న క్రైమ్ కామెడీ మూవీ ఇది. పేద, ధనిక లైఫ్‌స్టైల్ మధ్య ఉండే అంతరాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు లక్ష్మణ్ వర్మ బాబు నంబర్ వన్ సినిమాను రూపొందించాడు.
రెండు జంటల ప్రేమకథలతో ఈ సినిమా సాగుతుంది. ఓ లవ్ స్టోరీ కంప్లీట్ క్లాస్‌గా సాగితే...మరో లవ్ స్టోరీ మాస్ కోణంలో ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ చివరలో ఓ చిన్న సందేశంతో దర్శకుడు సినిమాను ఎమోషనల్‌గా ఎండ్ చేశాడు. కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఓ సామాన్యుడు ఎలాంటి రిస్క్ తీసుకున్నాడన్నది కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఈ సినిమాలో చూపించాడు.
సింపుల్ పాయింట్...
సింపుల్ పాయింట్‌తో ఆడియన్స్ ను థియేటర్‌లో రెండు గంటలపాటు కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. రెండు లవ్ స్టోరీస్, వాటి నేటివిటీని ఫస్ట్ హాఫ్ ను... సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలు నడిపించాడు డైరెక్టర్. సెకెండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్... యాక్షన్ అంశాల చుట్టూ సాగుతుంది.
రొమాంటిక్ లవ్ స్టోరీ...
అర్జున్ కల్యాణ్, కుషిత కెమిస్ట్రీ, వారిపై చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ యూత్ ను ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మీద తీసిన సాంగ్ లో గ్లామర్ డోసు కాస్త పెరిగినట్లుగానే అనిపిస్తుంది. బాబు పాత్రలో లక్ష్మణ్ వర్మ కనిపించాడు. కుటుంబమే ప్రాణంగా బతికే వ్యక్తిగా అతడి నటన నాచురల్‌గా ఉంది.
అతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి కనిపించింది. భద్రం, మురళీధర్, జబర్ధస్థ్ అప్పారావు కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. బాబు నెం వన్ యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన మూవీ. సందేశం కూడా ఓకే అనిపిస్తుంది.
రేటింగ్:2.5/5
టాపిక్