Brahmamudi Today Episode:కళ్యాణ్‌కు ఐ లవ్ యూ చెప్పిన అప్పు - స్వప్నకు మురళి షాక్ - దుగ్గిరాల ఫ్యామిలీ ధూమ్‌ధామ్
Brahmamudi Today Episode: మురళి చేస్తోన్న కుట్రలను బయపెట్టాలని అతడి చేత ట్రూత్ సిరప్ తాగిస్తుంది స్వప్న. కానీ తెలివిగా ట్రూత్ సిరప్ కలిపిన జ్యూస్‌ను మార్చేస్తాడు మురళి. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi Today Episode: మురళీ నిజస్వరూపం తెలిసి విక్కీ ఫైర్ అవుతాడు. తన కళ్ల ముందే అక్క అరుంధతికి అన్యాయం జరగడం సహించలేకపోతాడు. అరుంధతిని అడ్డం పెట్టుకొని అతడు చేస్తోన్న కుట్రలను చూస్తూ సహించలేకపోతాడు. కానీ నువ్వు నన్నుఏం చేయలేవని విక్కీకే రివర్స్ వార్నింగ్ ఇస్తాడు మురళి.
విక్కీని కొట్టినందుకు బాధపడుతుంది అరుంధతి. కన్నీళ్లు పెట్టుకుంటుంది. విక్కీ నా ఊపిరి అయితే..భర్త నా ప్రాణమని చెబుతుంది. విక్కీ భర్త కాలర్‌ను పట్టుకోవడంతో కోపం ఆపుకోలేక అతడిని కొట్టానని అరుంధతి ఎమోషనల్ అవుతుంది ఆమెను పద్మావతి, కావ్య కలిసి ఓదార్చుతారు.
రాజ్ సలహా...
బావ విషయంలో అరుంధతి తనను తప్పుగా అర్థం చేసుకుంటుందని రాజ్‌తో అంటాడు విక్కీ. అక్కకు క్షమాపణలు చెప్పమని విక్కీకి చెబుతాడు రాజ్. మురళీ చేస్తోన్న తప్పులు ఈ రోజు కాకపోయినా రేపయినా బయటపడతాడని, ఆ రోజు తన భర్త నిజ స్వరూపం అక్క తెలుసుకుంటుందని విక్కీకి రాజ్ సలహా ఇస్తాడు . రాజ్ మాటలకు విక్కీ కన్వీన్స్ అవుతాడు.
మరోవైపు జరిగిన వాటిలో తప్పొప్పుల్ని పక్కనపెట్టి విక్కీతో ప్రేమలో మాట్లాడితే గొడవలు మొత్తం సమసిపోతాయని అరుంధతిని కన్వీన్స్ చేస్తారు కావ్య, పద్మావతి. దాంతో గొడవను మర్చిపోయి అరుంధతి, విక్కీ కలిసిపోతారు. మళ్లీ మన మధ్య గొడవలు ఎప్పటికీ రానివ్వనని అరుంధతికి మాటిస్తాడు విక్కీ. అరుంథతి, విక్కీ కలిసి పావడంతో కావ్య, పద్మావతి, రాజ్ హ్యాపీగా ఫీలవుతారు.
సుభాష్, నారాయణ సీక్రెట్ పార్టీ...
ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియకుండా సుభాష్, నారాయణ, ప్రకాశం కూల్ డ్రింక్స్‌లో మందు కలుపుకొని తాగుతుంటారు. అక్కడికి అనామిక తండ్రితో పాటు మార్వాడీ వస్తాడు. కూల్‌డ్రింక్ అనుకొని పొరపడి మార్వాడీ కూడా ఆ డ్రింక్ తాగుతాడు.
కళ్యాణ్, అనామిక పెళ్లి సంగీత్ వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసే బాధ్యతను కావ్య, పద్మావతి తీసుకుంటారు. రుద్రాణి ఫస్ట్ డ్యాన్స్ చేయాలని వేదికపై అనౌన్స్ చేస్తుంది కావ్య. పిల్లా మెల్లగా వచ్చిందే పాటకు రుద్రాణి స్టెప్పులు వేస్తుంది. ఆ తర్వాత అపర్ణ, సుభాష్ కూడా జంటగా డ్యాన్స్ చేస్తారు.
ట్రూత్ సిరప్...
పద్మావతికి హెల్ప్ చేయాలని కావ్య, స్వప్న భావిస్తారు. ట్రూత్ సిరప్‌ను జ్యూస్‌లో కలిపి మురళీ చేత తాగించాలని అనుకుంటారు. ఆ సిరప్ వల్ల తాను చేస్తోన్న కుట్రల గురించి మురళీ స్వయంగా వెల్లడిస్తాడని అనుకుంటారు. తెలివిగా అతడితో జ్యూస్ తాగిస్తుంది స్వప్న.
మురళీ చేత ట్రూత్ సిరప్ తాగించిన విషయం పద్మావతికి చెబుతుంది కావ్య. వారి మాటలు విని పద్మావతి టెన్షన్ పడుతుంది. మురళీ చెడ్డవాడు అని తెలిస్తే అరుంధతి ప్రాణాలు పోతాయని భయపడుతుంది. అరుంధతి ప్రాణాలను కాపాడుకోవాలనే మురళీ నిజ స్వరూపం గురించి తెలిసినా ఇన్నాళ్లు ఆమెకు చెప్పలేకపోయామని పద్మావతి అంటుంది.
మురళి టెన్షన్...
స్టేజ్‌పైకి వచ్చిన మురళీ...పద్మావతి చేతిలోని మైక్ తీసుకుంటాడు. నేను నీకు ద్రోహం చేశానని, తాను దేవుడిని కాదని రాక్షసుడినని అరుంధతితో చెబుతాడు. నీకు తెలియకుండా నీకు ఒక్కమాట చెప్పకుండా ...మాటలను ఆపేస్తాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ మాట పెగలదు. అతడు ఏం చెబుతాడోనని పద్మావతి, కావ్య, స్వప్న భయంగా ఎదురుచూస్తుంటారు. కానీ నీకు చెప్పకుండా పార్టీలో మందుతాగానని చెప్పి వారందరికి షాకిస్తాడు.
అనామిక, కళ్యాణ్ డ్యాన్స్...
ట్రూత్ సిరప్ కలిపిన తర్వాత ఫోన్ వస్తే తాను పక్కకు వెళ్లానని, ఆ సమయంలోనే మురళీ ఏదో చేసి ఉంటాడని స్వప్న అనుకుంటుంది. ట్రూత్ సిరప్ కలిపిన జ్యూస్ ఎవరూ తాగారో తెలిరయ కంగారు పడతుంది. ఆ తర్వాత కళ్యాణ్, అనామిక డ్యాన్స్ చేయాలని పద్మావతి, కావ్య స్టేజ్‌పై అనౌన్స్‌చేస్తారు.
తమతో పాటు అప్పు కూడా డ్యాన్స్ చేయాలని కళ్యాణ్ పట్టుపడతాడు. కానీ అప్పు రానని అంటుంది. అప్పు మనసులో ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి స్వప్న చెప్పిన ట్రూత్ సిరప్‌ను అప్పు చేత తాగిస్తుంది పద్మావతి. ఆ జ్యూస్ తాగిన అప్పు... కళ్యాణ్, అనామిక డ్యాన్స్‌ను ఆపేస్తుంది. తాను కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ చేయడానికి స్టేజ్‌పైకి వస్తుంది.
అప్పు ఐ లవ్ యూ...
కళ్యాణ్, అప్పు, అనామిక ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారు. అప్పు ట్రూత్ సరిప్ కలిపిస జ్యూస్ తాగిన విషయం తెలిసి కనకం కంగారు పడుతుంది. అప్పు మనసులో ఉన్నది కళ్యాణ్ అని...ఇప్పుడు ఆమె నిజం చెబితే కళ్యాణ్, అనామిక పెళ్లి ఆగిపోతుందని అంటుంది. జ్యూస్ మత్తులో కళ్యాణ్‌కు ఐ లవ్ యూ చెబుతుంది అప్పు. అతడిని కౌగిలించుకుంటుంది. ఆ సీన్ చూసి అనామికతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ షాకవుతారు.