Brahmamudi December 17th Episode: ఆస్తి కోసం కోర్టుకు వెళ్తానన్న ధాన్యలక్ష్మి -ఇంటి బాధ్యతలు వద్దన్న కావ్య
17 December 2024, 7:44 IST
Brahmamudi December 17th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 17 ఎపిసోడ్‌లో సీతారామయ్య పెట్టి ష్యూరిటీ సంతకం తాలూకు డబ్బుల కోసం బ్యాంకు వాళ్లు దుగ్గిరాల ఇంటికొస్తారు. ఆస్తిని బ్యాంకు వాళ్లకు రాసివ్వడానికి రుద్రాణి, ధాన్యలక్ష్మి ఒప్పుకోరు. ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు వెళతామని అంటారు.
బ్రహ్మముడి డిసెంబర్ 17 ఎపిసోడ్
Brahmamudi December 17th Episode: సీతారామయ్య ఓ పేద యువకుడిని చదివిస్తుంటాడు. సీతారామయ్య హాస్పిటల్‌లో ఉన్న విషయం తెలియక డబ్బు సహాయం కోసం ఆ కుర్రాడితో కలిసి అతడి తల్లిదండ్రులు దుగ్గిరాల ఇంటికి వస్తాడు. వారిని చూడగానే చిరాకు పడుతుంది రుద్రాణి. డైరెక్ట్‌గా లోపలికి ఎలా వస్తారని కోప్పడుతుంది.
మా అబ్బాయికి ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చిందని, చదువు కోసం డబ్బు సాయం చేస్తానని సీతారామయ్య రమ్మన్నాడని ఆ అబ్బాయి తండ్రి రుద్రాణితో చెబుతాడు. సీతారామయ్య హాస్పిటల్‌లో కోమాలో ఉన్నాడని, బతుకుతాడో లేదో తెలియదని రుద్రాణి అంటుంది. ఆయకే లక్షలు ఖర్చవుతున్నాయని, మీకేం ఇస్తాడని అవమానించి వెళ్లగొడుతుంది.
రుద్రాణికి రాజ్ క్లాస్...
సీతారామయ్య కోలుకొని క్షేమంగా తిరిగివస్తే తప్పకుండా డబ్బులు ఇస్తాడని వాళ్లు మాట్లాడుకుంటూ వెళ్లిపోతుండగా రాజ్ వింటాడు. రాజ్ కోపంగా ఇంట్లోకి వచ్చి వాళ్లు ఎవరని రుద్రాణిని అడుగుతాడు.
మీ తాతయ్య ఆ పిల్లాడిని చదివిస్తున్నాడట...లక్షలు అడగటానికి వచ్చారని, డబ్బులు ఇవ్వడం కుదరదని వెళ్లిపొమ్మన్నానని రుద్రాణి అంటుంది. తాతయ్య ఇచ్చిన మాటను కాదంటే ఆయన్ని అవమానించినట్లేనని రుద్రాణిపై రాజ్ కోప్పడుతాడు. ఇంకోసారి నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదని వార్నింగ్ ఇస్తాడు.
రాహుల్‌ను ఎవరు చదివించారు...
రాహుల్‌ను ఎవరు చదివించారు సుభాష్‌ను అడుగుతుంది స్వప్న. నాన్న లేడు...అమ్మకు దిక్కులేకపోవడంతో సీతారామయ్య చదివించారని సుభాష్ సమాధానమిస్తాడు. గతిలేని వాళ్లందరిని ఇంట్లో పెట్టుకొని చదివించినప్పుడు దారిన పోయే దానయ్యలను చదివిస్తే తప్పేంటని రుద్రాణి గాలి తీస్తుంది స్వప్న.
వాళ్లు మేము ఒక్కటేనా అని స్వప్నతో గొడవపడబోతుంది రుద్రాణి. పేద కుర్రాడికి విద్యాదానం చేస్తుంటే మీ భర్త సొమ్ము ఏదో దోచిపెడుతున్నట్లు ఎందుకు ఫీలవుతున్నావని రుద్రాణికి క్లాస్ ఇస్తుంది స్వప్న.
తాతయ్య మాట నిలబెట్టిన రాజ్...
ఆ కుర్రాడిని చదివించడానికి అవసరమైన ఐదు లక్షలను రాజ్, కావ్య కలిసి ఇస్తారు. తాతయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టి ఆయనకు సరైన వారసుడికి అనిపించుకున్నావని వాళ్లు రాజ్‌ను మెచ్చుకుంటారు.
రాహుల్‌ను ఎవరు చదివించారు...
మతి ఉండే ఇన్నేసి లక్షలు దానం చేస్తున్నారా అంటూ రాజ్,కావ్యాలపై రుద్రాణి విరుచుకుపడుతుంది. నీ సొమ్ము దోచిపెట్టడం లేదు కదా ప్రకాశం అంటాడు. నాన్న పేరు ప్రతిష్టల్ని దిగజార్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారని రుద్రాణిని నిలదీస్తాడు సుభాష్. ఈ ఇంటి ఆడ పడుచుగా అని రుద్రాణి సమాధానం ఇవ్వబోతుండగా ఇందిరాదేవి ఆపేస్తుంది.
ముందు స్వప్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి మాట్లాడమని అంటుంది. రాహుల్‌ను ఎవరు చదివించారు..ఇంతవాడిని ఎవరు చేశారని రుద్రాణిని ఇందిరాదేవి ప్రశ్నిస్తుంది.
రోడ్డున పడాల్సివస్తుంది...
ఆ కుర్రాడు...నా కొడుకు ఒక్కటేనా రుద్రాణి అడుగుతుంది. ఒక్కటే..అది ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని రుద్రాణిని తీసిపడేస్తుంది ఇందిరాదేవి. దానధర్మాల కోసం సీతారామయ్య తన యావదాస్తిని వదులుకోవడానికి సిద్ధపడ్డ ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని ఇందిరాదేవి చెబుతుంది. అప్పుడు అందరం రోడ్డున పడాల్సివస్తుందని రుద్రాణి అంటుంది.
రాజ్ మంచితనం...
నా కొడుకులు మనవలు చేతకానీ దద్దమ్మలు కాదని, మళ్లీ సంపాదిస్తారని రుద్రాణితో ఇందిరాదేవి సవాల్ చేస్తుంది. అంతేకానీ పిరికివాళ్లలా బెదిరిపోరని చెబుతుంది. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే తాతయ్య ఇచ్చిన మాటను నిలబెడతానని రాజ్ అంటాడు. ఒక్క క్షణం నువ్వు రావడం ఆలస్యమైతే తాతయ్య ఇచ్చిన మాట పోయేదని, ఈ కుటుంబం పరువు నిలబెట్టావని రాజ్ మంచితనాన్ని మెచ్చుకుంటుంది ఇందిరాదేవి.
అప్పు టెన్షన్...
హాస్పిటల్‌లో తాతయ్య బాగోగులు చూస్తుంటాడు కళ్యాణ్. అప్పు అతడికి ఫోన్ చేస్తుంది. కట్టుకున్న పెళ్లాం ఏదో సాధించాలని దూరంగా వెళితే...ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక్క ఫోన్ కూడా చేయవా అని కళ్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అప్పు. కానీ కళ్యాణ్ పొడిపొడిగా సమాధానమిస్తాడు.
ఎక్కడున్నావని కళ్యాణ్‌ను అడుగుతుంది అప్పు. అతడు సమాధానం చెప్పడానికి తడబడతాడు. పక్కనున్న వ్యక్తి డాక్టర్ అని అరవడంతో ...ఏమైంది నువ్వు ఎందుకు హాస్పిటల్‌లో ఉన్నావని టెన్షన్ పడుతూ కళ్యాణ్‌ను అడుగుతుంది అప్పు. తనకు ఏం కాలేదని, లిరిసిస్ట్‌కు జ్వరం వస్తే హాస్పిటల్‌కకు తీసుకొచ్చానని అబద్ధం చెబుతాడు కళ్యాణ్. నీకు ఏమైనా అయితే ట్రైనింగ్ వదలుకొని వస్తానని అప్పు అంటుంది. అందుకే నిజం చెప్పలేదని మనసులో కళ్యాణ్ అనుకుంటాడు.
రాహుల్ బ్లాక్‌మెయిల్
తమకు డబ్బులు కావాలని సుభాష్, ప్రకాశం అడుగుతారు. వాళ్లు అడిగినంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. వారు వెళ్లిపోగానే రాహుల్ డబ్బుల కోసం కావ్య దగ్గరకు వస్తాడు. యాభై వేలు కావాలని అంటాడు. ఎందుకు డబ్బులు కావాలని రాహుల్‌ను నిలదీస్తుంది కావ్య.
కారణాల చెప్పాల్సిన అవసరం లేదని రాహుల్ అంటాడు. కారణాలు కావాలంటే మా చిన్నత్తయ్యను పిలుస్తానని చెబుతాడు. ధాన్యలక్ష్మి పేరు వినగానే కావ్య భయపడిపోతుంది. అనవసరమైన గొడవలు ఎందుకని రాహుల్ అడిగిన డబ్బు ఇచ్చేస్తుంది.
ఖజానా ఖాళీ...
నాకు భయపడకపోయినా మా ధాన్యలక్ష్మి అత్తయ్యకు భయపడ్డావు అది చాలని రాహుల్ అనుకుంటూ వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లు అడిగినింత మొత్తం ఇచ్చుకుంటూ పోతే ఖజానా ఖాళీ అవుతుందని, లెక్కలు అడిగితే బుక్కయ్యేది తానేనని కావ్య భయపడిపోతుంది. ఆ లోపే రాజ్‌కు ఇంటి బాధ్యతల్ని అప్పగించేయాలని ఫిక్సవుతుంది.
రాజ్‌చిరాకు...
కాఫీ కప్‌తో రాజ్ రూమ్‌లోకి అడుగుపెడుతుంది కావ్య. బ్యాంకు వాళ్లకు చెల్లించాల్సిన వంద కోట్ల గురించి రాజ్ ఆలోచిస్తుంటాడు. ఈ ష్యూరిటీ గురించి కుటుంబసభ్యులకు తెలిసేలోపు సమస్యను ఎలాగైనాసాల్వ్ చేయాలని అనుకుంటాడు. కాఫీ తాగితే మీ బుర్ర కూల్ అవుతుందని రాజ్‌తో కావ్య అంటుంది.
కాఫీ అక్కరలేదని కావ్యకు చిరాకుగా సమాధానమిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని కసురుకుంటాడు. కాఫీ తాగమన్నందుకు ఇంతలా అరవాలా అని కావ్య అంటుంది. మీరు వద్దని అంటే ఎవరు తాగుతారు అని అడుగుతుంది.
కాఫీ తాగకపోతే ఫైన్ వేస్తావా...లక్షలు, కోట్లు ఎంత కట్టాలి చెప్పు అని కోప్పడుతారు. ఫైన్ ఏంటి లక్షలు, కోట్లు ఏంటి...ఏమైంది అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. చెప్పిన నువ్వు ఏం చేయలేవని వెళ్లిపొమ్మని కావ్యను కసుకుంటాడు రాజ్.
బరువు వద్దు...
బీరువా తాళాలను అపర్ణకు తిరిగి ఇవ్వబోతుంది కావ్య. ఏంటిది అని అపర్ణ అడిగితే మీరు దింపుకున్న బరువు అని కావ్య సమాధానం చెబుతుంది. అది బరువు కాదు బాధ్యత అని అపర్ణ అంటుంది.ఈ బరువును తాను మోయలేకపోతున్నాని కావ్య బదులిస్తుంది.
నువ్వు ఇంటి బాధ్యతల్ని తీసుకోవాలని తాతయ్య గారి ఆర్డర్, అమ్మమ్మ అభిలాష అని అపర్ణ ఎంత చెప్పిన తాళాలు మళ్లీ తీసుకోవానికి కావ్య ఒప్పుకోదు.లక్షల్లో అందరూ డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే నువ్వేంత, నీ బతుకెంతా, నీ పుట్టింటి ఆస్తి అడుగుతున్నామా అని కోప్పడుతున్నారని కావ్య సమాధానమిస్తుంది.
కోర్టుకు వెళ్తనన్న ధాన్యలక్ష్మి...
సీతారామయ్యపెట్టిన ష్యూరిటీ సంతకానికి సంబంధించిన డబ్బుల కోసం బ్యాంకు వాళ్లు ఇంటికి వెళతారు. తన భర్త ఇచ్చిన మాట, చేసిన సంతకం నిలబడాల్సిందేనని, ఆస్తి మొత్తంపోయినా పర్వాలేదని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి అందుకు ఒప్పుకోరు.
ఆస్తిలో మాకు రావాల్సిన వాటాల కోసం కోర్టుకు వెళతామని అంటారు. సీతారామయ్యపై కోర్టుకు వెళతామని అంటారు. ఆ మాట వినగానే గుండెనొప్పితో ఇందిరాదేవి కుప్పకూలిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.