Allu Arjun Helps Kerala Student: రియల్ హీరోగా నిలిచిన అల్లు అర్జున్ - కేరళ విద్యార్థిని చదువుకు సాయం
Allu Arjun Helps Kerala Student: కేరళకు చెందిన ఓ నిరుపేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సహయాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు అల్లు అర్జున్. అతడి సేవా గుణంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Allu Arjun Helps Kerala Student: ఓ నిరుపేద విద్యార్థి చదువుకు ఆర్థిక సహయాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. అతడు చేసిన మంచి పనిని సోషల్ మీడియాలో అభిమానులు కొనియాడుతున్నారు. రియల్ హీరో అంటూ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేరళకు చెందిన ఓ విద్యార్థినికి నర్సింగ్ చదవాలనే కోరిక ఉన్న ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలిచాయి.
తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారికి అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ అండగా నిలిచారు. పేదరికం కారణంగా మెరిట్ స్టూడెంట్ చదువు ఆగిపోకూడదని భావించిన కలెక్టర్ ఆ విద్యార్థికి చదువు కోసం అల్లు అర్జున్ సహయాన్ని కోరాడట. ఏడాది ఫీజును అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. ఆ విద్యార్థిని పరిస్థితిని చూసి చలించిన అల్లు అర్జున్ నాలుగు సంవత్సరాల పాటు నర్సింగ్ చదవడానికి అవసరమయ్యే కాలేజీ ఫీజుతో పాటు హాస్టల్ ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చాడట.
అంతే కాకుండా ఆ విద్యార్థిని దత్తత తీసుకోవడానికి అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లు తెలిసింది. అల్లు అర్జున్ సేవ గుణాన్ని ప్రశంసిస్తూ కలెక్టర్ కృష్ణ తేజ చేసిన ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్‌కు కేరళలో భారీగా ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అతడు హీరోగా నటించిన పుష్ప సినిమా కేరళలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.
ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప ది రూల్ పేరుతో రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.