Dasara and Pushpa Movie Comparisons: అల్లు అర్జున్ పుష్పతో దసరా మూవీ కంపేరిజన్స్ - నాని సమాధానం ఇదే
Dasara and Pushpa Movie Comparisons: దసరా టీజర్ రిలీజ్ తర్వాత ఈసినిమాను అల్లు అర్జున్ పుష్పతో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ కంపేరిజన్స్‌పై హీరో నాని స్పందించాడు.
Dasara and Pushpa Movie Comparisons: ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో దసరా ఒకటి. నాని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దసరా సినిమా రూపొందుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో నాని లుక్, క్యారెక్టరైజేషన్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ రిలీజ్ తర్వాత దసరా సినిమాను అల్లు అర్జున్ పుష్పతో కంపేరిజన్స్ మొదలయ్యాయి . పుష్ప , దసరా కథలు ఇంచుమించు ఒకేలా ఉండే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ కంపేరిజన్స్‌పై హీరో నాని స్పందించాడు. ఓరి వారి సాంగ్ లాంఛ్‌లో నాని మాట్లాడుతూ లుంగీ, బనియర్ ధరించి హీరోలు కనిపించే రూరల్ సినిమాలు చాలా రేర్‌గా వస్తాయని అన్నాడు. రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన పుష్ప సినిమాలో బన్నీ లుంగీ, బనియన్ గెటప్‌లోనే కనిపిస్తారు. దసరాలో నా క్యారెక్టర్ గెటప్ అలాగే ఉంటుంది. రెండు సినిమాల్లో హీరోల గెటప్‌లు ఒకేలా ఉండటంతోనే దసరా సినిమాను పుష్పతో కంపేర్ చేస్తున్నారు.
ఇలాంటి గెటప్‌లో ఇది వరకు చాలా సినిమాలు వస్తే సిమిలారిటీస్, రిఫరెన్స్‌లు చూసేవాళ్లం కాదు. మన కల్చర్‌లోనుంచి మనం పెరిగిన వాతావరణంలో నుంచి వచ్చిన రూటెడ్ కథలు సినీ పరిశ్రమలో చాలా తక్కువైపోయాయి. అలాంటి రూటెడ్ కథతోనే పుష్ప, దసరా సినిమాలు రూపొందాయి. ఆ ఒక్క పోలిక తప్ప పుష్ప సినిమాతో దసరా కథకు సెంటీమీటర్ కూడా సంబంధం ఉండదు అని నాని అన్నారు నాని.
దసరా సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో నాని ధరణి అనే క్యారెక్టర్ చేస్తుండగా కీర్తిసురేష్ వెన్నెల పాత్రలో కనిపిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కానుంది.