Brahmamudi: కావ్యతో రాజ్ రొమాన్స్ - దొంగగామారిన దుగ్గిరాల వారసుడు - కళ్యాణ్‌కు ముద్దుపెట్టిన అప్పు
Brahmamudi: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో కావ్య వేసిన డిజైన్స్‌ను దొంగతనం చేసేందుకు ఆమె క్యాబిన్‌లోకి వస్తాడు రాజ్. అనుకోకుండా కావ్య క్యాబిన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు కనిపించకుండా టేబుల్ కింద దాక్కుంటాడు.
Brahmamudi: రాజ్, కావ్య విడిపోయారని, స్వరాజ్ గ్రూప్ కంపెనీ కష్టాల్లో ఉందని అనామిక చెప్పిన మాటల్ని నిజమని నమ్ముతాడు జగదీష్ ప్రసాద్. ఈ విషయం తన దగ్గర దాచిపెట్టిన రాజ్, కావ్యలను నిలదీయాలని ఆవేశంగా ఆఫీస్‌కు వస్తాడు. అతడి అనుమానాలకు తగ్గట్లుగానే జగదీష్ ప్రసాద్ ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్‌లో కావ్య, రాజ్ గొడవలు పడుతూ కనిపిస్తారు.
దుగ్గిరాల కుటుంబం స్థాపించిన సంస్థ ఇంతకుముందులా లేదని, విడిపోయిన భార్యభర్తలు కలిసి ఈ కంపెనీని మరింత పాడు చేస్తున్నారని రాజ్, కావ్యలపై జగదీష్ ప్రసాద్ ఫైర్ అవుతాడు. క్లయింట్స్, కాంట్రాక్ట్స్ గురించి మీరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారని నిందలు వేస్తాడు.
రాజ్ భయం...
ఒకవేళ జగదీష్ ప్రసాద్ ఇచ్చిన డీల్ క్యాన్సిల్ అయితే కావ్యనే ఎప్పటికీ సీఈవోగా కొనసాగుతుందని రాజ్ భయపడిపోతాడు. ఒకవేళ మేము విడిపోతే ఒకే ప్రాజెక్ట్‌పై ఎందుకు కలిసి పనిచేస్తామని జగదీష్ ప్రసాద్‌ను నమ్మించేందుకు నాటకం ఆడటం మొదలుపెడతాడు రాజ్.
బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చేందుకు ఇద్దరం వాదించుకుంటున్నామని, దానిని మీరు గొడవగా పొరపడ్డారని నోటికి వచ్చిన అబద్ధం చెబుతాడు. కావ్య నడుముపై చేయివేస్తాడు రాజ్. ఆమె కిందపడబోతుండగా పట్టుకుంటాడు. కావ్య, రాజ్ రొమాన్స్ చూసి ఇద్దరి మధ్య గొడవలు ఉన్నది అబద్ధమని జగదీష్ ప్రసాద్ అనుకుంటాడు. తన డీల్ కోసం బాగా చేయమని చెప్పి వెళ్లిపోతుంది.
కావ్య ఫైర్...
జగదీష్ ప్రసాద్ నమ్మించడానికి తన నడుముపై చేయి ఎందుకు వేశారని రాజ్‌పై కావ్య ఫైర్ అవుతుంది. అంతమంది ముందు నన్ను ఎందుకు టచ్ చేశారని వార్నింగ్ ఇస్తుంది. డీల్ పోతుందని జగదీష్‌ప్రసాద్‌ను ముందు నటించాల్సివచ్చిందని రాజ్ అంటాడు. నమ్మించడానికి నటించడం తప్పు కాదని అంటాడు.
అయితే మా అమ్మ మనల్ని కలపడం కోసం క్యాన్సర్ వచ్చినట్లుగా నాటకం ఆడిందని, ఆమె నాటకంలో ఎలాంటి తప్పు లేదని రాజ్‌తో వాదిస్తుంది కావ్య. అది ఇది ఒకటి కాదంటూ రాజ్ సమాధానమిస్తుంది.
కావ్య ఛాలెంజ్...
చివరి గొడవ సీఈవో సీట్ వరకు వస్తుంది. ఎప్పటికైనా స్వరాజ్ గ్రూప్‌లోసీఈవో, ఎండీ రెండు నేనే, ఈ పోటీలో నేను గెలుస్తానని కావ్యతో అంటాడు రాజ్. మిమ్మల్ని ఓడించేవరకు వదిలిపెట్టనని తగ్గేదేలే అంటూ భర్త్‌కు ప్రతి సవాల్ విసురుతుంది కావ్య.
కావ్య జీవించేసింది...
జగదీష్ ప్రసాద్ ఆవేశం అంతా ఓ డ్రామా అని బయటపడుతుంది. సీతారామయ్య ప్లాన్ ప్రకారమే జగదీష్ ఇదంతా చేశాడని తెలుస్తుంది. యాక్టింగ్‌లో రాజ్ ఇరగదీశాడని, కావ్య జీవించేసిందని అంటాడు.తాను లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయిపోయిన సంగతి అప్పుకు చెబుతాడు కళ్యాణ్.
ఆ విషయం చెప్పగానే అప్పు సంతోషంగా ఫీలవుతుంది. కానీ లక్ష్మీకాంత్ దగ్గర మూడేళ్లు పనిచేస్తానని అగ్రిమెంట్ రాసి ఇచ్చిన సంగతి మాత్రం అప్పు దగ్గర దాచేస్తాడు.
రాజ్ దొంగతనం...
తాను వేసిన డిజైన్స్‌ను క్యాబిన్‌లో పెట్టి బయటకు వెళుతుంది కావ్య. ఆ డిజైన్స్ దొంగతనం చేయాలని రాజ్ ఫిక్సవుతాడు. కానీ దొంగతనం చేయడానికి రాజ్ మనసు ఒప్పుకోదు. కళావతిని పెళ్లిచేసుకొని మహారాణిలా చూసుకున్నానని, ఈ రకంగానైనా తన రుణం తీర్చుకునే అవకాశం కావ్యకు దొరికిందని తనకు తానే సర్ధిచెప్పుకుంటాడు. కావ్యకు తానే అవకాశం ఇచ్చిన వాడిని అవుతానని, ఇది దొంగతనం కాదని, తస్కరించుట అని మనసులో అనుకుంటాడు.
టేబుల్ కింద దాక్కున్న రాజ్...
కావ్య వేసిన డిజైన్స్‌ను ఫోన్‌లో ఫొటో తీసుకోవడానికి సిద్ధమవుతాడు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడంతో దానికోసం తిరిగి క్యాబిన్‌లోకి వస్తుంది కావ్య. కళావతి రావడం చూసి కంగారులో టేబుల్ కింద దాక్కుంటాడు రాజ్. డిజైన్స్ ఓపెన్ చేసి కనిపించడంతో తన క్యాబిన్‌లోకి ఎవరో వచ్చారని కావ్య అనుమానపడుతుంది. దొంగతదనం చేస్తూ కావ్యకు రాజ్ దొరికిపోయాడా లేదా అన్నది సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.