Bigg Boss Winner Nikhil: బిగ్ బాస్ విన్నర్‌గా నిఖిల్ మలియక్కల్- 55 లక్షల ప్రైజ్ మనీ, ఖరీదైన కారు- మొదటి విజేతగా రికార్డ్
15 December 2024, 23:15 IST
- Bigg Boss Telugu 8 Winner Nikhil Maliyakkal: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ అని తేలిపోయింది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈపాటికే పూర్తి కాగా నిఖిల్‌ను బిగ్ బాస్ విన్నర్‌గా రామ్ చరణ్ ప్రకటించాడు. మరి నిఖిల్‌కు బిగ్ బాస్ ప్రైజ్ మనీతోపాటు వచ్చే కాస్ట్‌లీ కారు, రెమ్యునరేషన్ ఎంతో చూద్దాం.
బిగ్ బాస్ విన్నర్‌గా నిఖిల్ మలియక్కల్- 55 లక్షల ప్రైజ్ మనీ, ఖరీదైన కారు- మొదటి విజేతగా రికార్డ్
Bigg Boss Winner Nikhil Remuneration And Prize Money: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ముగిసిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌ను ప్రకటించాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇదివరకే పూర్తి అయిపోయింది.
ప్రైజ్ మనీ ఆఫర్
బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ రేస్‌లో గౌతమ్, నిఖిల్ ఇద్దరు చాలా గట్టి పోటీ ఇచ్చారు. నువ్వా నేనా అన్నంతగా వీరి ఓటింగ్ కొనసాగింది. అయితే, నబీల్ టాప్ 3 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన తర్వాత టాప్ 2లో గౌతమ్, నిఖిల్ ఇద్దరు నిలిచారు. దాంతో ఏ సీజన్‌లో ఊహించని ఆఫర్ ఇచ్చారు. హౌజ్ లోపలికి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్లిన నాగార్జున ప్రైజ్ మనీ నుంచి కొంత ఇందులో ఉందని, అది తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు.
విజేతగా నిలిచిన నిఖిల్
ఆ బ్రీఫ్ కేసులో ఎంతైన ఉండొచ్చు అని నాగార్జున చెప్పారు. కానీ, దానికి ఇద్దరు ఒప్పుకోలేదు. ముందు గెలుపు తర్వాతే డబ్బు అని గౌతమ్ అంటే.. అందులో 55 లక్షలు ఉన్న వద్దని నిఖిల్ అన్నాడు. దాంతో వారిలో ఒకరిని బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్‌ను రామ్ చరణ్ ప్రకటించారు.
అలా ఈ సీజన్ బిగ్ బాస్ విజేతగా నిఖిల్ మలియక్కల్ నిలిచాడు. దాంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ అయ్యాడు. కర్ణాటకకు చెందిన నిఖిల్ గోరింటాకు సీరియల్‌తో బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అక్కడి నుంచి ఇలా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి ఫైనల్‌గా విజేత అయ్యాడు.
మారుతి సుజుకీ బ్రాండ్ న్యూ డిజైర్ ధర
ఇదిలా ఉంటే, తాజాగా బిగ్ బాస్ ద్వారా నిఖిల్‌కు వచ్చిన ప్రైజ్ మనీ, ఇతర బెన్‌ఫిట్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తం అయిన రూ. 55 లక్షలు గెలుచుకున్న నిఖిల్ మారుతీ సుజుకీ బ్రాండ్ న్యూ డాజ్లింగ్ డిజైర్ కారు కూడా అందుకున్నాడు. ఈ కారు ధర ఇండియాలో సుమారుగా రూ. 6.79 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
నిఖిల్ రెమ్యునరేషన్
అంటే, రూ. 55 లక్షల ప్రైజ్ మనీతోపాటు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అదనంగా మరో రూ. 6.79 లక్షలు సంపాదించినట్లే. ఈ లెక్కన నిఖిల్ సుమారుగా రూ. 62 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్ రెమ్యునరేషన్ రోజుకు రూ. 32,143, వారానికి రూ. 2 లక్షల 25 వేలు అని సమాచారం.
ఏదైనా ఒకటే ఇస్తారా?
బిగ్ బాస్ హౌజ్‌లో 15 వారాలు ఉన్న నిఖిల్ కంటెస్టెంట్‌గా రూ. 33,75000 పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. మరి నిఖిల్ ఎలాగు బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కాబట్టి, అతని రెమ్యునరేషన్‌తో కలిపి ప్రైజ్ మనీ ఇస్తారా లేదా కేవలం ప్రైజ్ మనీనే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తంగా నిఖిల్‌కు 95 లక్షలు
ఒకవేళ బిగ్ బాస్ ప్రైజ్ మనీ, కారు ధర, పారితోషికం అన్ని కలిపి ఇస్తే మాత్రం నిఖిల్ మలియక్కల్ సుమారుగా రూ. 95 లక్షలు సంపాదించినట్లు అవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇంత డబ్బు గెలుచుకున్న మొదటి బిగ్ బాస్ తెలుగు విన్నర్‌గా నిఖిల్ నిలిచే అవకాశం ఉంది.