Bigg Boss Telugu: కావాలని కూడా కొడ్తావ్ నువ్వు- వెళ్లి కూసో భే- గౌతమ్‌, నిఖిల్ ఫైట్‌తో దద్దరిల్లిన హౌజ్ (వీడియో)-bigg boss telugu 8 december 6 episode highlights gautham nikhil bigg fight bigg boss 8 telugu today episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu: కావాలని కూడా కొడ్తావ్ నువ్వు- వెళ్లి కూసో భే- గౌతమ్‌, నిఖిల్ ఫైట్‌తో దద్దరిల్లిన హౌజ్ (వీడియో)

Bigg Boss Telugu: కావాలని కూడా కొడ్తావ్ నువ్వు- వెళ్లి కూసో భే- గౌతమ్‌, నిఖిల్ ఫైట్‌తో దద్దరిల్లిన హౌజ్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Dec 06, 2024 01:15 PM IST

Bigg Boss Telugu 8 December 6 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో మరోసారి నిఖిల్, గౌతమ్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. దీనికి సంబంధంచిన బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 6 ఎపిసోడ్ ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఓట్ అప్పీల్ టాస్క్‌ జరిగే క్రమంలో నిఖిల్, గౌతమ్‌కు పెద్ద వాగ్వాదం జరిగింది.

కావాలని కూడా కొడ్తావ్ నువ్వు- వెళ్లి కూసో భే- గౌతమ్‌, నిఖిల్ ఫైట్‌తో దద్దరిల్లిన హౌజ్ (వీడియో)
కావాలని కూడా కొడ్తావ్ నువ్వు- వెళ్లి కూసో భే- గౌతమ్‌, నిఖిల్ ఫైట్‌తో దద్దరిల్లిన హౌజ్ (వీడియో) (Star Maa/YouTube)

Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 తుది దశకు చేరుకుంది. అయినా కూడా కంటెస్టెంట్ల మధ్య బిగ్ ఫైట్స్, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్నర్ రేస్‌లో ఉన్న గౌతమ్, నిఖిల్ మధ్య మరోసారి బిగ్ ఫైట్ జరిగింది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 6 ఎపిసోడ్ ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు.

yearly horoscope entry point

ఓట్ అప్పీల్ ఛాన్స్

ఈ వీడియోలో కంటెస్టెంట్స్ అంతా నిల్చుని ఉన్నారు. ఇదివరకు నాగార్జున హోస్ట్ చేసిన వీకెండ్ ఎపిసోడ్‌లో నిఖిల్, రోహిణి, గౌతమ్ గోల్డెన్ టికెట్ పొందారు. ఆ విషయం చెబుతూ ఈ ముగ్గురు మాత్రమే ఓట్ అప్పీల్‌ కంటెండర్స్‌గా అర్హత సాధించారు అని, ముగ్గిరిలో ఒక్కరికే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.

ఓట్ అప్పీల్ అవకాశం గెలుపొందడానికి గోల్డెన్ టికెట్ పొందిన గౌతమ్, నిఖిల్, రోహిణికి ఒక టాస్క్ ఇచ్చారు. 8 అంకె రాసి ఉన్న ఇసుక కేక్‌ను ముందు ఉంచారు. ఒక్కొక్కరుగా వచ్చి 8 పడకుండా కేక్ కట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో మొదటగా రోహిణి ఓడిపోయినట్లు తెలుస్తోంది. దాంతో తర్వాతి టాస్క్‌లోకి నిఖిల్, గౌతమ్ వెళ్లారు. వారిద్దరికి చివరి ఛాలెంజ్‌గా రంగు పడుద్ది టాస్క్ ఇచ్చారు.

మొహంపై కొడుతున్నావ్

ఈ ఛాలెంజ్‌లో ప్రత్యర్థి టీ షర్ట్‌పై ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవాల అని బిగ్ బాస్ అనౌన్స్ చేసి చెప్పాడు. దాంతో టాస్క్ మొదలు అయింది. ఇద్దరు బాగానే ఆడుతూ ఒకరికంటే మరొకరు టీ షర్ట్స్‌పై రంగులు పూసుకున్నారు. ఈ క్రమంలో కాస్తా ఫిజికల్ కూడా అయ్యారు. గౌతమ్‌ కాలు పట్టి లాక్కెళ్లాడు నిఖిల్. తర్వాత కాసేపటికి నిఖిల్ కింద ఉంటే గౌతమ్ పైన ఉన్నాడు. అప్పుడు బజర్ మోగింది.

దాంతో ఇద్దరు విరమించుకున్నారు. కానీ, కట్ చేస్తే "గౌతమ్ నువ్ నా ఫేస్‌పై కొడుతున్నావ్" అని నిఖిల్ అన్నాడు. "ఇట్లా నీకు రాయబోతుంటే నీకు తగిలింది" అని గౌతమ్ చెప్పాడు. "నువ్ అన్ని అదే చెబుతున్నావ్ అంటున్నా" అని నిఖిల్ అన్నాడు. దాంతో గౌతమ్ షాక్ అయ్యాడు. "మచ్చా నువ్వు కింద పడేసి ఈడ్చుకుంటూ వెళ్లిపోయావ్. ఇక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చిన్న లేదా" అని గౌతమ్ అన్నాడు.

కూసో భే ఏంటీ

"పక్కకు వెళ్లి కూసో భే" అని నిఖిల్ నోరు జారాడు. దాంతో గౌతమ్‌కు ట్రిగ్గర్ అయింది. "కూసో భే.. భే అని ఎవన్నీ అంటున్నావ్. మొన్ననే లేసినవ్‌గా ఏదో మాట అంటే. భే ఎవన్ని అంటున్నవ్" అంటూ గౌతమ్ నిఖిల్ దగ్గరికి వెళ్లాడు. "ఆడే విధానం తెలియదు ఊరికే" అని నిఖిల్ అన్నాడు. "ఆడే విధానం నీకు తెలుసా మచ్చా.. ఫస్ట్ నుంచి చూస్తున్నా" అని గౌతమ్ అన్నాడు.

"మొహం మీద నేను కాదు కొట్టింది" అని నిఖిల్ అరిచాడు. "గేమ్‌లో కావాలని ఎవడైనా కొడతాడా" అని గౌతమ్ అంటుంటే.. "ఎవరికి తెలుసు నువ్వు కావాలని కొట్టిన కొడతావ్" అని మరోసారి నోరు జారాడు నిఖిల్. తర్వాత ఇద్దరు వాదించుకున్నారు. టాస్క్‌కు సంచాలక్‌గా ఉన్న ప్రేరణ ఆపేందుకు ప్రయత్నం చేసింది. "గౌతమ్ ఒక్క నిమిషం" అంటూ గట్టిగా అరిచింది. "ఆగు" అని గౌతమ్ ఇంకా గట్టిగా అరిచాడు.

గేమ్ కాదు నా పర్సనల్

"నేను మాట్లాడుతా ఎందుకంటే ఇది నా పర్సనల్, గేమ్ కాదు" అని గౌతమ్ చాలా సీరియస్‌గా చెప్పాడు. దాంతో ప్రేరణ సైలెంట్ అయిపోయింది. అక్కడితో బిగ్ బాస్ తెలుగు 8 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో వీడియో ముగిసింది. ఇక నిఖిల్, గౌతమ్ టాస్క్ ఆడేవిధానం, ఫైట్ చూసి మిగతా కంటెస్టెంట్స్ భయపడిపోయారు. వారి ఆట, మాటలతో బిగ్ బాస్ హౌజ్ దద్దరిల్లినట్లు అయింది.

Whats_app_banner