తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Grand Finale: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఆరోజే- ఇక నుంచి షో టైమింగ్స్‌లో మార్పు- ఎప్పుడు ప్రసారం అంటే?

Bigg Boss Grand Finale: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఆరోజే- ఇక నుంచి షో టైమింగ్స్‌లో మార్పు- ఎప్పుడు ప్రసారం అంటే?

Sanjiv Kumar HT Telugu

02 December 2024, 10:36 IST

google News
    • Bigg Boss Telugu 8 Grand Finale Date: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్ అయింది. అలాగే, బిగ్ బాస్ షో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇవాళ్టీ (డిసెంబర్ 2) నుంచి బిగ్ బాస్ తెలుగు 8 ప్రసార సమయాంలో మార్పు ఉండనుంది.
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఆరోజే- ఇక నుంచి షో టైమింగ్స్‌లో మార్పు- ఎప్పుడు ప్రసారం అంటే?
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఆరోజే- ఇక నుంచి షో టైమింగ్స్‌లో మార్పు- ఎప్పుడు ప్రసారం అంటే?

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఆరోజే- ఇక నుంచి షో టైమింగ్స్‌లో మార్పు- ఎప్పుడు ప్రసారం అంటే?

Bigg Boss 8 Telugu Grand Finale Date: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. అయితే, ఎప్పటిలాగే గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ తెలుగు 8 విజేతను ప్రకటించనున్నారు.

మరికొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్

ఇక బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ జబర్దస్త్ అవినాష్, గౌతమ్ కృష్ణ, నిఖిల్ మలియక్కల్, నబీల్ అఫ్రీది, ప్రేరణ కంబం, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ రోహిణి ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఎవరుంటారో, ఎవరు ఎలిమినేట్ కానున్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే డేట్

అయితే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఎప్పుడు ముగిసిపోనుందో తెలిసిపోయింది. బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను డిసెంబర్ 15 నిర్వహించనున్నారు. అది కూడా బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను డిసెంబర్ 15 ఆదివారం నాడు రాత్రి 7 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో స్టార్ హీరోయిన్ డ్యాన్సులు, సింగర్స్ సింగింగ్ పర్ఫామెన్స్‌లు, హీరోల ఎంట్రీ ఉండే అవకాశం ఉంది.

ట్రోఫీ అందించేది ఎవరు?

అట్టహాసంగా జరిగే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేలో టైటిల్ విన్నర్‌కు ట్రోఫీని ఏ హీరో అందిస్తారో ఇంట్రెస్టింగ్‌గా మారింది. గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో అయితే హోస్ట్‌గా చేసిన నాగార్జుననే విజేత పల్లవి ప్రశాంత్‌కు కప్ అందించాడు. మరి ఈసారి స్పెషల్ గెస్ట్‌ను పిలుస్తారో లేదా నాగార్జునతోనే ఇప్పిస్తారో చూడాలి.

బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ 105 రోజులు

ఈ లెక్కన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ 105 రోజులు ప్రసారం కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 షో ప్రసారం చేసే సమయంలో మార్పులు చేశారు. స్టార్ మా టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ఎపిసోడ్ ప్రసారం అయ్యేది. కానీ, ఇక నుంచి గంట ఆలస్యంగా రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ షోను ప్రసారం చేయనున్నారు.

బిగ్ బాస్ షో టైమింగ్స్‌లో మార్పు

అంటే, ఇవాళ్టీ నుంచి అనగా బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 2 ఎపిసోడ్ రాత్రి 10 గంటలకు టెలీకాస్ట్ కానుందన్నమాట. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 టైమింగ్స్ మార్పులకు గల సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. స్టార్ మాలో పలు సీరియల్స్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాయని తెలుస్తోంది. అలాగే, బిగ్ బాస్ సీజన్‌కు ఈ వారం అతిముఖ్యమైనది.

గంట ఆలస్యంగా

ఈ రెండు వారాలే బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో నిర్ణయించేది. అందుకే స్టార్ మా ప్రేక్షకులను మరింతగా తమ ఛానెల్‌కు ఎంగేజ్ చేసేందుకు బిగ్ బాస్ తెలుగు 8 షోను గంట ఆలస్యంగా రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం