Bigg Boss Grand Finale 2.0: ఆరోజే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే 2.0.. హౌజ్‌లోకి అడుగుపెట్టే మాజీ కంటెస్టెంట్స్ వీళ్లే!
Ex Contestants Entry To Bigg Boss Telugu 8: ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్‌తో జోరుగా సాగుతోన్న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఆరుగురు మాజీ కంటెస్టెంట్స్ రానున్నారు. వారిలో దాదాపుగా ఇద్దరు కన్ఫర్మ్ అయ్యారు. వీళ్లందరు అక్టోబర్ మొదటి వారంలోనే గ్రాండ్ ఫినాలే 2.0 ఈవెంట్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
Bigg Boss Grand Finale 2.O With Ex Contestants: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రస్తుతం జోరుగానే సాగుతోంది. ఇందులో కంటెస్టెంట్స్‌గా అందరూ కొత్త మొహాలే అని చాలా మంది పెదవి విరిచినా షో స్టార్ట్ అయ్యాక వాళ్ల ఆట తీరుతో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌ను చూసేలా చేశారు. బిగ్ బాస్ తెలుగు 8లోకి మొదటగా 14 మంది కంటెస్టెంట్స్ సెప్టెంబర్ 2న ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మరొకరు ఎలిమినేట్
వీరిలో మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. దాంతో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక మూడో వారం కూడా మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి గత సీజన్ల మాజీ కంటెస్టెంట్లను దించనుంది బీబీ టీమ్. వారిని ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్‌కు ఛాలెంజర్స్‌గా పరిచయం చేయనుందని టాక్.
ఇలా ఈ సీజన్‌కు వైల్డ్ కార్డ్ ద్వారా మొత్తంగా ఆరుగురు మాజీ కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని సమాచారం. వారిలో జబర్దస్త్ అవినాష్ దాదాపుగా 100 శాతం కన్ఫర్మ్ అయ్యాడని తెలుస్తోంది. ముక్కు అవినాష్ ఇదివరకు రెండు సీజన్స్‌లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తన కామెడీతో చాలా ఎంటర్టైన్ చేశాడు.
ఇద్దరు కన్ఫర్మ్
కాబట్టి, మళ్లీ హౌజ్‌లో కామెడీని పండించడానికి జబర్దస్త్ అవినాష్‌ను రంగంలోకి దింపనున్నారట. అందుకు అవినాష్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అవినాష్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ కంటెస్టెంట్ అయిన నటి హరితేజ కూడా హండ్రెడ్ పర్సంట్ కన్ఫర్మ్ అయినట్లు పక్కా సమాచారం. వీరిద్దరు పక్కాగా హౌజ్‌లోకి వెళ్లనున్నారని టాక్.
వీరితోపాటు బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, శోభా శెట్టి, జబర్దస్త్ రోహిణి, యాంకర్ రీతూ చౌదరి, సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ నడుస్తోంది. మరి వీరిలో ఎవరు హౌజ్‌లోకి అడుగుపెడతారో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక వీరందరిని అక్టోబర్ 5న బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి పంపించనున్నట్లు పక్కా సమాచారం.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ తరహాలోనే గ్రాండ్ ఫినాలే 2.0 కార్యక్రమం నిర్వహించి ఆరుగురుని హౌజ్‌లోకి పంపించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. అయితే, ప్రతివారం ఎలిమినేషన్ జరిగితే.. అక్టోబర్ 5 నాటికి అప్పుడు హౌజ్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వారికి పోటీగా ఆరుగురు వైల్డ్ కార్డ్‌తో రావడంతో బిగ్ బాస్ తెలుగు 8లో 15 మంది కంటెస్టెంట్స్ ఉంటారు.
రెండు గ్రూపులు
లేదా.. అక్టోబర్ 5న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గ్రూపులో ఉంచే అవకాశం ఉంది. దాంతో హౌజ్‌లో 16 మంది అవుతారు. వారిని రెండు గ్రాపులుగా అంటే.. ఛాలెంజర్స్.. వారియర్స్‌గా విడదీసి బిగ్ బాస్ టాస్కులు ఆడించే అవకాశం ఉంది.