Bigg Boss Shobha Shetty: హౌజ్‌లో శోభా శెట్టికి వాంతులు.. బాత్రూమ్‌లోకి పరుగులు.. అసలు ఏమైందంటే?-shobha shetty vomiting in bigg boss 7 telugu november 17th episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Shobha Shetty Vomiting In Bigg Boss 7 Telugu November 17th Episode

Bigg Boss Shobha Shetty: హౌజ్‌లో శోభా శెట్టికి వాంతులు.. బాత్రూమ్‌లోకి పరుగులు.. అసలు ఏమైందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 17, 2023 08:09 AM IST

Bigg Boss 7 Telugu Shobha Shetty Vomiting: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం ఫ్రీ ఎవిక్షన్ పాస్ టాస్క్ నడుస్తోంది. ఈ క్రమంలోనే శోభా శెట్టికి వాంతులు అయ్యాయి. దీంతో బాత్రూమ్‌లోకి పరుగుపెట్టింది శోభా శెట్టి.

బిగ్ బాస్ హౌజ్‌లో శోభా శెట్టికి వాంతులు.. బాత్రూమ్‌లోకి పరుగులు, అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ హౌజ్‌లో శోభా శెట్టికి వాంతులు.. బాత్రూమ్‌లోకి పరుగులు, అసలు ఏమైందంటే?

Bigg Boss Telugu DAy 74 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో కంటెస్టెంట్లకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. టాప్ 10లో ఉన్న ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్స్, వాటి ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవుతోంది. ర్యాంకింగ్ పర్ఫామెన్స్ తర్వాత 6 నుంచి 10వ స్థానంలో ఉన్న హౌజ్ మేట్స్ కు ఫ్రీ ఎవిక్షన్ పాస్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అలా ఎవిక్షన్ బాక్స్ టాస్క్ ఇవ్వగా అందులో అర్జున్ అంబటి గెలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

ఫ్రీ ఎవిక్షన్ పాస్ గెలిచిన అర్జున్‌కు ఢిఫెన్స్ చేసుకోవాలని పెద్ద మెలిక పెట్టాడు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులతో అర్జున్ డిఫెన్స్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. అలా పెట్టిన బాల్ టాస్క్, బాణం టాస్క్, స్కూటర్ టాస్క్ అన్నింట్లో ప్రిన్స్ యావర్ గెలిచి సత్తా చాటాడు. వరుసగా మూడు టాస్కుల్లో గెలిచి రికార్డ్ కొట్టాడు. ఇక నాలుగో టాస్కులో శోభా శెట్టితో పోటీ పడ్డాడు ప్రిన్స్ యావర్.

ఫ్రీ ఎవిక్షన్ పాస్ కోసం చేసిన నాలుగో టాస్కులో శోభా, యావర్‌కు ఐ లవ్ బర్గర్ అనే గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఇద్దరూ తెగ పోటీ పడి బర్గర్ తిన్నారు. ఇదివరకు స్పైసీ చికెన్ టాస్క్ అనుభవం ఉన్న శోభా శెట్టి యావర్‌కు మంచి పోటీ ఇచ్చింది. అయినా కానీ, ఈ టాస్కులో అధికంగా బర్గర్స్ తిని ప్రిన్స్ యావర్ మళ్లీ గెలిచాడు. అలా వరుసగా నాలుగు టాస్కులు గెలిచిన అందరినీ ఆశ్చర్యపరిచాడు యావర్. దీంతో ఫ్రీ ఎవిక్షన్ పాస్ ప్రిన్స్ యావర్‌కు లభించింది.

అయితే, టాస్క్ తర్వాత శోభాకు ఆరోగ్యం దెబ్బతింది. ఎక్కువగా బర్గర్స్ తినడంతో శోభాకు బెడిసికొట్టింది. తిండి ఎక్కువ కావడంతో శోభాకు వాంతులు అయ్యాయి. ఆ దెబ్బకు బాత్రూమ్‌లోకి పరుగులు పెట్టింది శోభా శెట్టి. ఇదివరకు స్పైసీ చికెన్ తిని కన్నీళ్లు పెట్టుకున్న శోభా ఈసారి బర్గర్స్ దెబ్బకు వాంతులతో బాత్రూమ్‌లోకి పరుగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.