Bigg Boss 8 Telugu: ఎలిమినేష‌న్ కంటెస్టెంట్ ఫిక్స్ - బేబ‌క్క‌కు త‌క్కువ ఓట్లు - వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌నుందా?-bigg boss 8 telugu five contestant nominated for first week elimination nagarjuna star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: ఎలిమినేష‌న్ కంటెస్టెంట్ ఫిక్స్ - బేబ‌క్క‌కు త‌క్కువ ఓట్లు - వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌నుందా?

Bigg Boss 8 Telugu: ఎలిమినేష‌న్ కంటెస్టెంట్ ఫిక్స్ - బేబ‌క్క‌కు త‌క్కువ ఓట్లు - వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌నుందా?

Nelki Naresh Kumar HT Telugu
Sep 08, 2024 01:21 PM IST

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌ర‌న్న‌ది నేడు తేల‌నుంది. బేబ‌క్క హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నామినేష‌న్స్‌లో ఉన్న ఐదుగురిలో ఆమెకు త‌క్కువ ఓట్లు ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్ 8 తెలుగు
బిగ్‌బాస్ 8 తెలుగు

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 తెలుగులో ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌ర‌న్న‌ది ఆదివారం(నేడు) తేల‌నుంది. ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ కోసం బేబ‌క్క‌, శేఖ‌ర్ బాషా, విష్ణుప్రియ‌, నాగ‌మ‌ణికంఠ‌తో పాటు పృథ్వీరాజ్‌, సోనియా నామినేట్ అయ్యారు. వీరిలో శ‌నివారం ఇచ్చిన టాస్క్‌లో సోనియా సేఫ్ అయిన‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఐదుగురు ఎలిమినేష‌న్స్‌లో ఉన్నారు.

బేబ‌క్క‌కు త‌క్కువ ఓట్లు...

ఈ ఐదుగురిలో బేబ‌క్క‌కు త‌క్కువ ఓట్లు ప‌డ్డ‌ట్లు స‌మాచారం. బేబ‌క్క బిగ్‌బాస్ సీజ‌న్ 8 నుంచి ఎలిమినేట్ కానున్న ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా నిల‌వ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన ఫ‌స్ట్ డే నుంచే మాటి మాటికి ఎమోష‌న‌ల్ అవుతూ బిగ్‌బాస్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ ద‌గ్గ‌ర సింప‌థీ కొట్టేశాడు మ‌ణికంఠ‌. అదే అత‌డికి ప్ల‌స్స‌యిన‌ట్లు స‌మాచారం.

శేఖ‌ర్ బాషా, విష్ణుప్రియ సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌తో... సోనియా, పృథ్వీ అగ్రెసివ్ గేమ్‌తో ఫ‌స్ట్ వీక్ బాగానే ఓట్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. స్ట్రాట‌జిక్ గేమ్ ఆడిన బేబ‌క్క‌కు త‌క్కువ ఓట్లు ప‌డ‌టంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బేబ‌క్క హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

మ‌రో సెల‌బ్రిటీ...

బేబ‌క్క హౌజ్ నుంచి వెళ్లిపోయిన వెంట‌నే వైల్డ్ కార్డ్ ద్వారా మ‌రో టీవీ సెల‌బ్రిటీ హౌజ్‌లో అడుగుపెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. అత‌డు ఎవ‌ర‌న్న‌ది సండే ఎపిసోడ్‌లో తేల‌నుంది.

ప్రోమో రిలీజ్‌...

సండే ఎపిసోడ్ తాలూకు ప్రోమోను స్టార్ మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది. సండే అంటే ఫండే అంటూ నాగార్జున ఈ ప్రోమోలో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఫండే మాత్ర‌మే కాదు...ఈ సండే పేడే అని నాగార్జున ప్ర‌క‌టించాడు. కానీ ఈ రోజు ప్రైజ్‌మ‌నీ ఏం ఉండ‌ద‌ని చెప్పి కంటెస్టెంట్స్‌కు నాగార్జున షాకిచ్చాడు. ప్ర‌తి వారం మీరు ఆడే ఆట‌ను బ‌ట్టి పే పెరుగుతుంటుంద‌ని నాగార్జున అనౌన్స్‌చేశాడు.

చిరంజీవి సినిమా పేరు...

కంటెస్టెంట్స్‌ను మేల్‌, ఫిమేల్ టీమ్‌లుగా నాగార్జున విభ‌జించాడు. స్టార్ హీరోల పేర్లు వ‌రుస‌గా చెప్పాల‌ని టాస్క్ ఇచ్చాడు. ఇందులో చిరంజీవి సినిమా పేరును చెప్ప‌లేక నైనిక ఓడిపోయింది. ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబు సినిమా దూకుడు పేరును రెండు సార్లు విష్ణుప్రియ చెప్ప‌డంతో ఫిమేల్ టీమ్ ఓట‌మిపాలైంది. ఆ ర్వాత ఇచ్చిన ఫ‌న్ టాస్క్‌లో మాత్రం మేల్ టీమ్‌పై ఫిమేల్ టీమ్ గెలిచింది.

వార్ హార్న్ టాస్క్‌...

ఆ త‌ర్వాత నామినేష‌న్స్లో వార్ హార్న్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో ఐదుగురి చేత హార్న్ ఊదించాడు. అందులో ఎవ‌రూ ఎలిమినేట్ అయ్యింది మాత్రం ప్రోమోలో చూపించ‌లేదు. ఈ ప్రోమో వైర‌ల్ అవుతోంది.