Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరగా ఫేమస్ అవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఫాలోవర్స్ పెరుగుతారు-follow these tips to get famous on instagram fast and followers will increase ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరగా ఫేమస్ అవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఫాలోవర్స్ పెరుగుతారు

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరగా ఫేమస్ అవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఫాలోవర్స్ పెరుగుతారు

Haritha Chappa HT Telugu
Aug 20, 2024 02:00 PM IST

Instagram: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇన్ స్టాగ్రామ్లో ఫేమస్ కావాలని కోరుకుంటారు. మీకు కూడా అలాంటి కోరిక ఉండి ఉంటే ఈ కథనం మీకోసమే. మీరు ఎలాంటి వీడియోలు, ఫోటోలు పెడితే త్వరగా ఇన్‌స్టాలో ఫేమస్ అవుతారో తెలుసుకోండి.

ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి?
ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి? (Shutterstock)

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎక్కువ ఫాలోవర్లను సాధించాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇది ఎంతో మందికి కెరీర్ గా కూడా మారుతోంది. ముఖ్యంగాా ఉద్యోగాలు చేయకుండా ఇంటి నుంచే పని చేసేవారికి సోషల్ మీడియా అనేది కెరీర్ గా మారిపోయింది. ఇది మీరు కెరీర్‌లో ఎదగడానికి లెక్కలేనన్ని అవకాశాలను అందిస్తుంది.

ఇన్ స్టాగ్రామ్ ఈ రోజుల్లో చాలా పాపులర్. ఇన్స్టా ద్వారా తమ క్రియేటివిటీని, టాలెంట్‌ను చూపించి డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇన్స్టాలో ఫేమస్ కావడం ద్వారా మాత్రమే సెలబ్రిటీ హోదాను కూడా పొందవచ్చు. మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోవర్లను పెంచుకోవాలని ఆలోచిస్తుంటే, మేము మీ కోసం కొన్ని చిట్కాలను ఇచ్చాము. వాటి సహాయంతో మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ కావచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇలా సెట్ చేయండి

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ కావాలనుకుంటే, ఖాతాను ప్రారంభించేటప్పుడే కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా యూజర్ నేమ్‌ను పెట్టుకునే ముందు అది సెర్చ్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోండి. అంటే మీ యూజర్ నేమ్‌ను ఎవరైనా సులభంగా గుర్తుపెట్టుకుని సెర్చ్ చేసేలా ఉండాలి. అలాగే, మీ ఖాతాను బిజినెస్ అకౌంట్‌గానే ఉంచండి. మీరు ప్రైవేట్ అకౌంట్‌గా పెట్టుకుంటే, మీ కంటెంట్ కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రొఫైల్ పిక్చర్ ను ఒరిజినల్‌గా మీదే ఉంచడం మంచిది. ఇది చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది.

ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయ్యే అతి ముఖ్యమైన విషయం మీ కంటెంట్. యూజర్ దృష్టిని ఆకర్షించే విధంగా కంటెంట్ ఉండాలి. అప్పుడే యూజర్ మీ ప్రొఫైల్‌ను సందర్శించి మిమ్మల్ని ఫాలో అవుతారు ఎవరైా. ఇందుకోసం కంటెంట్ నాణ్యత, పరిమాణం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. యూజర్ అవసరాన్ని తీర్చే కంటెంట్‌ను పోస్ట్ చేయండి. వారికి సమాచారం ఇచ్చేలా, ఎంటర్‌టైన్ చేసేలా మీ కంటెంట్ ఉండాలి. ఇన్ స్టాగ్రామ్‌లో కూడా చాలా ట్రెండ్స్ వైరల్ అవుతుంటాయి. ఆ ట్రెండ్‌కు అనుగుణంగా రెగ్యులర్‌గా వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండాలి

హ్యాష్ ట్యాగ్ ముఖ్యం

చాలా సార్లు కంటెంట్ బాగున్నా ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. దీనికి ప్రధాన కారణం వీడియో పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ వాడకపోవడం లేదా తప్పుడు హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేయడం. వీడియోను పోస్ట్ చేసేటప్పుడు సరైన హ్యాష్ ట్యాగ్ ఎంచుకోండి. ఒక బాలీవుడ్ సినిమా లేదా నటుడికి సంబంధించిన రీల్ ఉంటే, దానికి సెట్ అయ్యే హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించండి. మీరు వైరల్ ట్రెండ్‌లో వీడియో చేస్తుంటే, దాని హ్యాష్ ట్యాగ్ ‘వైరల్ వీడియో’, ‘ట్రెండింగ్ వీడియో’ వంటివి ఉండేలా చూసుకోండి.

ఆ సమయంలో పోస్టు చేయండి

మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోవర్లను పెంచుకోవాలనుకుంటే, సరైన సమయంలో ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం, మీ వ్యాపార ఖాతాలోని ప్రొఫెషనల్ డాష్‌బోర్డుకు వెళ్లి చెక్ చేయవచ్చు. ఇక్కడ మీరు ప్రొఫైల్ రీచ్, ఎంగేజ్మెంట్ రేట్ వంటివి చూడవచ్చు. ఇక్కడ ఫాలోయర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా ఏ సమయంలో ఎక్కువ మంది యూజర్లు యాక్టివ్ గా ఉన్నారో తెలుసుకోవచ్చు. ఆ సమయంలో మీ ఫోటోలు లేదా రీల్స్ పోస్ట్ చేయడం వంటివి చేయండి. దీని వల్ల మీ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇన్ స్టాలో త్వరగా ఫేమస్ అయిపోవచ్చు.

టాపిక్