Singapore Saloon OTT:ఓటీటీలో రిలీజైన మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లి త‌మిళ మూవీ - లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌-meenakshi chaudhary tamil movie singapore saloon streaming now on amazon prime video guntur kaaram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singapore Saloon Ott:ఓటీటీలో రిలీజైన మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లి త‌మిళ మూవీ - లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌

Singapore Saloon OTT:ఓటీటీలో రిలీజైన మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లి త‌మిళ మూవీ - లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 23, 2024 06:03 AM IST

Singapore Saloon OTT: గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ సింగ‌పూర్ సెలూన్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం అమెజాన్‌ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది.

సింగ‌పూర్ సెలూన్ ఓటీటీ రిలీజ్ డేట్‌
సింగ‌పూర్ సెలూన్ ఓటీటీ రిలీజ్ డేట్‌

Singapore Saloon OTT: గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ సింగ‌పూర్ సెలూన్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. తెలుగులోనూ సింగ‌పూర్ సెలూన్ రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ కేవ‌లం త‌మిళ వెర్ష‌న్‌ను మాత్ర‌మే రిలీజ్ చేశారు.

ఆర్‌జే బాలాజీ హీరో...

న్యూ ఏజ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఆర్‌జే బాలాజీ హీరోగా న‌టించాడు. స‌త్య‌రాజ్‌, లాల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన సింగ‌పూర్ సెలూన్ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దాదాపు ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్‌...

సింగ‌పూర్ సెలూన్ సినిమాలో కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. అత‌డితో పాటు అర‌వింద్ స్వామి, యాత్ర హీరో జీవా కూడా అతిథి పాత్ర‌ల్లో మెరిశారు.

సింగ‌పూర్ సెలూన్ క‌థ ఇదే...

ఈ సినిమాలో హెయిర్ స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాల‌ని, సొంతంగా సెలూన్ ఏర్పాటుచేసుకోవాల‌ని క‌ల‌లు గ‌నే కాథిర్ అనే యువ‌కుడిగా ఆర్‌జే బాలాజీ క‌నిపించాడు. ఇంజినీరింగ్ చ‌దివిన అత‌డు వార‌స‌త్వంగా తండ్రి నుంచి వ‌చ్చిన వృత్తిని ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? సొంతంగా సెలూన్ ఏర్పాటుచేసిన కాథిర్‌కు పోటీదారుల నుంచి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాన్న‌ది అన్న‌ది ఎమోష‌న్స్‌, కామెడీ మేళ‌వించి ద‌ర్శ‌కుడు గోకుల్ ఈ సినిమాలో చూపించాడు. కాథిర్‌ను ప్రేమించే డ‌బ్బున్న కుటుంబానికి చెందిన యువ‌తిగా మీనాక్షి చౌద‌రి ఈ సినిమాలో క‌నిపించింది.

గుంటూరు కారంలో మ‌హేష్ మ‌ర‌ద‌లిగా...

కెరీర్ ప‌రంగా పెద్ద‌గా స‌క్సెస్‌లు లేక‌పోయినా స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో దూసుకుపోతున్న‌ది మీనాక్షి చౌద‌రి. సుశాంత్ హీరోగా న‌టించిన ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ర‌వితేజ ఖిలాడిలో న‌టించింది. హిట్ 2తో ఫ‌స్ట్ స‌క్సెస్ అందుకున్న మీనాక్షి చౌద‌రి అనుకోకుండా మ‌హేష్‌బాబు గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమా నుంచి పూజాహెగ్డే అర్ధాంత‌రంగా త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలో మీనాక్షికి ఆ అవ‌కాశం ద‌క్కింది.గుంటూరు కారం సినిమాలో మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లిగా క‌నిపించింది మీనాక్షి చౌద‌రి. చిన్న పాత్రే అయినా త‌న లుక్స్‌, యాక్టింగ్‌తో మెప్పించింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు వ‌రుణ్‌తేజ్ మ‌ట్కాసినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే విశ్వ‌క్‌సేన్ ప‌దో సినిమాలో క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతున్న‌ది మీనాక్షి చౌద‌రి. ఈ మూడు సినిమాల‌తో పాటు మ‌రో రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్లు తెలిపింది.

విజ‌య్‌తో గోట్‌...

త‌మిళంలో ఏకంగా ద‌ళ‌ప‌తి విజ‌య్‌తోనే రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. ప్ర‌స్తుతం విజ‌య్ తాజా మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌లో మీనాక్షి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ ఏడాది మీనాక్షి న‌టించిన ఐదు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

IPL_Entry_Point