తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss Baladitya Maa Oori Polimera 2 Movie First Look Unveiled

Bigg Boss Baladitya Movie: చేత‌బ‌డుల నేప‌థ్యంలో బిగ్‌బాస్ బాలాదిత్య మూవీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

09 May 2023, 14:20 IST

  • Bigg Boss Baladitya Movie ప్ర‌స్తుతం క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డుల నేప‌థ్యంలో టాలీవుడ్‌లో సినిమాల్ని తెర‌కెక్కించే ట్రెండ్ పెరుగుతోంది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య సినిమా చేయ‌బోతున్నాడు. ఆ సినిమా ఏదంటే...

మా ఊరి పొలిమేర 2
మా ఊరి పొలిమేర 2

మా ఊరి పొలిమేర 2

Bigg Boss Baladitya Movie బిగ్‌బాస్ ఫేమ్ బాలాదిత్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మా ఊరి పొలిమేర మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. తాజాగా ఈ సినిమాకు మా ఊరి పొలిమేర - 2 పేరుతో సీక్వెల్ రాబోతున్న‌ది. ఇందులో బాలాదిత్య‌తో పాటు స‌త్యం రాజేష్‌, గెట‌ప్ శ్రీను, కామాక్షి భాస్క‌ర్ల‌, అక్ష‌త కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ పూర్త‌యింది.

ట్రెండింగ్ వార్తలు

Pranaya Vilasam OTT Release Date: ఓటీటీలోకి ప్రేమలు హీరోయిన్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే..

Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

జూన్ నెల‌లో మా ఊరి పొలిమేర 2 సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ రిలీజ్‌ చేశారు. గ్రామీణ నేప‌థ్యంలో క్షుద్ర పూజ‌లు, చేత‌బ‌డుల బ్యాక్‌డ్రాప్‌లో హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సీక్వెల్ తెర‌కెక్కుతోంద‌ని, ఫ‌స్ట్ పార్ట్‌కు మించి భ‌య‌పెట్టే సీన్స్ ఇందులో ఉన్నాయ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ నెలాఖ‌రున ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కంప్లీట్ చేసి జూన్‌లో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. కాగా రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కులు కూడా అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సీక్వెల్ డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మా ఊరి పొలిమేర కూడా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లోనే రిలీజైంది. ఈ సీక్వెల్‌లో త‌న సోద‌రుడి జీవితం వెనుక‌న్న భ‌యంక‌ర నిజాల్ని వెలుగులోకి తీసుకొచ్చే పోలీస్ కానిస్టేబుల్‌గా బాలాదిత్య క‌నిపించ‌బోతుండ‌గా...చేత‌బ‌డుల న‌మ్మే వ్య‌క్తిగా స‌త్యం రాజేష్ న‌టిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.