తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Episode 40 Rohit Self Nominated For Elimination

Bigg Boss 6 Telugu Episode 40: రోహిత్ సెల్ఫ్ నామినేట్ - మ‌రోసారి కెప్టెన్సీ రేసులో రేవంత్‌

14 October 2022, 7:26 IST

  • Bigg Boss 6 Telugu Episode 40: బిగ్‌బాస్ గురువారం ఎపిసోడ్ ఎమోష‌న‌ల్‌గా సాగింది. బ్యాట‌రీ టాస్క్‌లో భాగంగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు రావ‌డంతో హౌజ్‌మేట్స్ అంద‌రూ ఎమోష‌న‌ల్ అయ్యారు. రైస్ విష‌యంలో కెప్టెన్ రేవంత్‌తో ఆదిరెడ్డి గొడ‌వ‌ప‌డ్డాడు.

సూర్య‌
సూర్య‌

సూర్య‌

Bigg Boss 6 Telugu Episode 40: బిగ్‌బాస్ గురువారం ఎపిసోడ్ మొత్తం ఎమోష‌న‌ల్‌గా సాగింది. త‌న భార్యాపిల్ల‌ల‌తో మాట్లాడిన బాలాదిత్య ఆ మాట‌ల్ని ప‌దే ప‌దే గుర్తుచేసుకుంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. తానే బ్యాట‌రీ మొత్తం యూజ్ చేసుకోవ‌డం క‌రెక్ట్ కాదేమో అనే సంశ‌యంలో ఏడుస్తూ ఉండిపోయాడు. స్మోక్ చేసే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

రోహిత్ సెల్ఫ్ నామినేట్‌

ఆ త‌ర్వాత బ్యాట‌రీ వంద శాతం రీఛార్జ్ అవ్వాలంటే వాసంతి, రోహిత్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు రెండు వారాల పాటు సెల్ఫ్ నామినేట్ కావాల‌ని బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చాడు. సెల్ఫ్ నామినేష‌న్‌కు వాసంతి ఒప్పుకోలేదు. రోహిత్ అందుకు అంగీక‌రించాడు. మ‌రీనా నామినేష‌న్స్‌లో ఉండ‌టంతోనే తాను సెల్ఫ్ నామినేష‌న్‌కు అంగీక‌రించిన‌ట్లు రోహిత్ చెప్పాడు. దాంతో బ్యాట‌రీ వంద శాతం రీఛార్జ్ అయ్యింది. ఉద‌యం ఐదు గంట‌ల స‌మ‌యంలో త‌న ఇంటి వాళ్ల‌తో మాట్లాడుతున్న‌ట్లుగా ఆర్జే సూర్య న‌టించాడు. ఆ స‌మ‌యంలో క‌న్నీళ్లను ఆపుకోలేక‌పోయాడు.

రేవంత్‌తో ఆదిరెడ్డి గొడ‌వ‌...

మ‌ధ్యాహ్నం రైస్ స‌రిపోవ‌డం లేద‌నే విష‌యంలో కెప్టెన్ రేవంత్‌తో ఆదిరెడ్డి గొడ‌వ‌ప‌డ్డాడు. సూర్య‌, ఇనాయా ల‌వ్ ట్రాక్ రోజురోజుకు డీప్‌గా మారిపోతుంది. హౌజ్‌లో ఎప్పుడూ క‌లిసే క‌నిపిస్తున్నారు. ఈ సారి వ‌చ్చే ఫోన్‌కాల్‌ను ఎవ‌రు లిఫ్ట్ చేస్తే వారికి స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని బిగ్‌బాస్ అన్నాడు. ఆ ఫోన్‌ను రేవంత్ లిఫ్ట్ చేశాడు. భార్య ఫొటో కావాల‌ని రేవంత్ రిక్వెస్ట్ చేశాడు. వీడియో అయితే ఒక‌సారి చూస్తే అయిపోతుంద‌ని, అదే ఫొటో అయితే చాలా రోజులు త‌న‌తో పాటే ఉండిపోతుంద‌ని రేవంత్ అన్నాడు.

క‌న్నీళ్లు పెట్టుకున్న సూర్య‌

ఆ త‌ర్వాత అమ్మ‌తో ఫోన్ మాట్లాడ‌టానికి 25 శాతం బ్యాట‌రీని ఉప‌యోగించుకునే ఆప్ష‌న్‌ను ఎంచుకున్న‌ది ఫైమా. కీర్తి ఆడియో మెసేజ్ ఆప్ష‌న్‌ను ఎంచుకున్న‌ది. సూర్య అమ్మ నుంచి లెట‌ర్ ఆప్ష‌న్‌ను ఎంచుకున్నాడు. ఫోన్ మాట్లాడ‌టానికి 30 శాతం బ్యాట‌రీ ఖ‌ర్చు అవుతుంద‌ని బిగ్‌బాస్ కండీష‌న్ పెట్ట‌డం వ‌ల్లే లెట‌ర్ ఆప్ష‌న్ తీసుకున్నాన‌ని అన్నాడు. ఎమోష‌న‌ల్ అయిన అత‌డిని ఇనాయాను ఓదార్చుతూ క‌నిపించింది. లెట‌ర్ చ‌దువుతున్న స‌మ‌యంలో సూర్య క‌న్నీళ్ల‌ను ఆపుకోలేక‌పోయాడు.వాసంతి త‌న అక్క కూతురు ఫొటో పొందే ఆప్ష‌న్‌ను ఎంచుకున్న‌ది. రాజ్ త‌న అమ్మ‌తో ఫోన్ మాట్లాడే ఆప్ష‌న్‌ను తీసుకున్నాడు.

కెప్టెన్సీ రేసులో ఎనిమిది మంది...

ఆ త‌ర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గ్రాబ్ అండ్ ర‌న్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్‌. అందులో బాల్ త‌న‌కు రాక‌పోవ‌డంతో బాల్ ఇవ్వ‌మ‌ని అంద‌రిని బ్ర‌తిమిలాడుతూ క‌నిపించింది. రేవంత్‌, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య‌, శ్రీస‌త్య‌, రాజ్‌, అర్జున్‌, రోహిత్ కెప్టెన్సీ రేసులో నిలిచార‌ని బిగ్‌బాస్ అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.