తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu Episode 25: రేవంత్ ఎమోష‌న‌ల్ - కెప్టెన్సీ రేసు నుంచి చంటి ఔట్

Bigg Boss 6 Telugu Episode 25: రేవంత్ ఎమోష‌న‌ల్ - కెప్టెన్సీ రేసు నుంచి చంటి ఔట్

HT Telugu Desk HT Telugu

29 September 2022, 7:13 IST

  • Bigg Boss 6 Telugu Episode 25: హోట‌ల్ టాస్క్ కంటెస్టెంట్స్ గొడ‌వ‌లు, అల‌క‌ల మ‌ధ్య సాగింది. బాత్‌రూమ్ యాక్సెస్‌తో పాటు రూల్స్ విష‌యంలో రెండు టీమ్స్ వాద‌న‌ల‌కు దిగాయి.

చంటి
చంటి (twitter)

చంటి

Bigg Boss 6 Telugu Episode 25: హోటల్ టాస్క్ లో రెండు టీమ్స్ పదే పదే గొడవలు పడుతూ కనిపించారు. హోట‌ల్ టాస్క్‌లో బాత్‌రూమ్ యూజ్ చేసే విష‌యంలో గెస్ట్స్ అంద‌రూ మేనేజ‌ర్ రూల్‌ను ఫాలో కావాల‌ని సుదీప చెప్పింది. కానీ సూర్య, రాజ్ మాత్రం తాము ఇండివిజువ‌ల్‌గా డీల్ పెట్టుకున్నాన‌ని సుదీపతో చెప్పాడు. ఎవ‌రితో డీల్ పెట్టుకున్నది చెప్పనని రాజ్ అన్నాడు. తన టీమ్‌లోనే రాజ్ ఉన్నాడు...కానీ అత‌డు ఎవ‌రితో డీల్ పెట్టుకున్న‌ది త‌న‌కు కూడా తెలియ‌ద‌ని ఫైమా చెప్పింది. ఆ త‌ర్వాత ఫైమానే వాష్‌రూమ్ డీల్ ఒప్పుకున్న‌ది తానే అంటూ కీర్తితో చెబుతూ క‌నిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

రూల్‌లో లేక‌పోయినా ఒప్పుకోవ‌డం త‌న త‌ప్పు అని ఫైమా చెప్పింది. ఫైమా త‌ప్పు చేసింద‌నే వ‌ర్డ్‌ను సుదీప రిపీట్ చేస్తూ క‌నిపించింది. సుదీప మాట‌ల‌కు ఫైమా సీరియ‌స్ అయ్యింది. ఇద్ద‌రు గొడ‌వ‌లు ప‌డ్డారు. వెట‌కారం త‌గ్గించుకుంటే మంచిదంటూ ఫైమాకు సుదీప వార్నింగ్ ఇచ్చింది. ప‌ప్పు త‌క్కువ‌గా ఉంద‌ని ప‌దే ప‌దే రేవంత్ అన‌డంతో బాలాదిత్య అత‌డిపై సీరియ‌స్ అయ్యాడు. కిచెన్‌లో బాలాదిత్య‌, రేవంత్ కూడా గొడ‌వ‌లు ప‌డుతూ క‌నిపించారు. చిన్న చిన్న విష‌యాల‌కు బాధ‌ప‌డ‌టం క‌రెక్ట్ కాద‌ని బాలాదిత్య రేవంత్‌తో చెబుతూ క‌నిపించాడు.

రేవంత్‌, ఆదిరెడ్డి..రేవంత్‌పై జోకులు వేస్తూ క‌నిపించారు. బిగ్‌బాస్ సీజ‌న్ 6 టైటిల్ త‌న చేతితో ప‌ట్టుకున్న‌రోజు మీ న‌వ్వులు ఏమ‌వుతాయో చూస్తాను ఎంత న‌వ్వుతారో న‌వ్వండి బ్రో అంటూ త‌న‌లో తానే మాట్లాడుకుంటూ రేవంత్ క‌నిపించాడు. డీల్ కుదుర్చుకోకుండా బాత్‌రూమ్ వాడిన వారి నుంచి ఫైన్ వ‌సూలు చేస్తామంటూ సుదీప చెప్పింది. స్విమ్మింగ్‌పూల్‌ను ఆదిరెడ్డి వాడ‌టంపై బిగ్‌బాస్ హోట‌ల్ టీమ్ అభ్యంత‌రం చెప్పారు. టాస్క్ స‌మ‌యం ముగిసింది కాబ‌ట్టి వాడుతున్నామంటూ మీరు ఎంత‌నైనా ఫైన్ వేసుకొండి అంటూ ఆదిరెడ్డి, శ్రీహాస్ వాదించారు.

బీబీ6 హోట‌ల్‌లో బ్రేక్‌ఫాస్ట్ 300, బాత్‌రూమ్‌కు 700 రేట్ పెట్టార‌న, ఫుడ్ టేస్ట్ యావ‌రేజ్‌గా ఉంద‌ని, హోట‌ల్ స్టాఫ్ రెస్పెక్ట్ ఇవ్వ‌డం లేద‌ని ఆదిరెడ్డి కంప్టైంట్ ఇచ్చాడు. టాస్క్ మ‌ధ్య‌లో బీబీ 6 టీమ్‌ దగ్గర 4300, గ్లామ్ ప్యారడైజ్ టీమ్ 5400 రూపాయ‌లు ఉండ‌టంతో బీబీ6 హోటల్ నిర్వ‌హ‌ణ బాధ్యతను గ్లామ్ ప్యారడైజ్ కు అప్పగించాడు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో చంటి విఫలం కావడంతో అతడిని కెప్టెన్ రేసు నుంచి తప్పిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.