తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhootaddam Bhaskar Narayana Teaser: సైకో కిల్ల‌ర్ క‌థ‌తో భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ - టీజ‌ర్ రిలీజ్‌

Bhootaddam Bhaskar Narayana Teaser: సైకో కిల్ల‌ర్ క‌థ‌తో భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ - టీజ‌ర్ రిలీజ్‌

28 January 2023, 20:36 IST

  • Bhootaddam Bhaskar Narayana Teaser: శివ కందుకూరి భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ మూవీ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

శివ కందుకూరి,రాశిసింగ్
శివ కందుకూరి,రాశిసింగ్

శివ కందుకూరి,రాశిసింగ్

Bhootaddam Bhaskar Narayana Teaser: శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ హీరో తేజ స‌జ్జా శ‌నివారం రిలీజ్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

చ‌నిపోయిన 16 మంది త‌ల‌లు ఎక్క‌డున్నాయి...ఏమ‌య్యాయి అన్న‌ది ఎవ‌రికి తెలియ‌దు అనే డైలాగ్‌తో భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. స్టేట్ మొత్తం నీ గురించి మాట్లాడుకోవాలంటే ఆ సీరియ‌ల్ కిల్ల‌ర్ కేస్ సాల్వ్ చేయాలి అంటూ ఓ యువ‌కుడు డైలాగ్ చెప్ప‌గానే భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ‌గా హీరో శివ కందుకూరి స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తూ క‌నిపించాడు.

తొమ్మిదో రోజు తొమ్మిదో నెల తొమ్మిది గంట‌ల‌కు అంటూ హీరో చెప్పిన డైలాగ్‌ను ఇంకో మ‌ర్డ‌ర్ జ‌రిగింది అంటూ మ‌రొక‌రు పూర్తిచేయ‌డం టీజ‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. దేవుడి గ‌దిలో దిష్టి బొమ్మ క‌నిపించే సీన్‌తో టీజ‌ర్ ముగిసింది.

టీజ‌ర్ చూస్తుంటే పోలీసుల‌కు చాలా ఏళ్లుగా దొర‌క్కుండా త‌ప్పించుకు తిరుగుతోన్న ఓ సైకో కిల్ల‌ర్‌, అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే ఓ డిటెక్టివ్ క‌థ‌తో భూత‌ద్ధం బాస్క‌ర్ నారాయ‌ణ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. మార్చి 31న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇందులో శివ‌కందుకూరికి జోడీగా రాశిసింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు రాని స‌రికొత్త క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించామ‌ని టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివ కందుకూరి పేర్కొన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.